TET notification
-
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
-
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం.. రేపట్నుంచి అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. దరఖాస్తులు స్వీకరించేందుకు చివరి తేదీ నవంబర్ 20న చివరి తేదీ విధించింది. జనవరి ఒకటి నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు ప్రారంభించింది. -
మళ్లీ టెట్ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ – టెట్)కు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ వంటి పూర్తి సమాచారంతో కూడిన షెడ్యూల్ మంగళవారం ప్రకటించనునున్నట్టు కమిషనర్ సురే‹Ùకుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో టెట్ నిర్వహిస్తునట్లు ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులకు కావాల్సిన పూర్తి సమాచారం, పరీక్షలు జరిగే తేదీలను త్వరలో https://cse.ap.gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని, ప్రత్యేక హెల్ప్‌డెస్క్ కూడా ఏర్పాటుచేశామన్నారు. ఫిబ్రవరిలో ఒకసారి నిర్వహణ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం డీఎస్సీ ద్వారా 6,100 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతోపాటు అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఫిబ్రవరిలో టెట్–2024 నోటిఫికేషన్ ఇచి్చంది. దీంతో బీఈడీ, డీఈడీ అభ్యర్థులు మొత్తం 2,67,789 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు సీబీటీ (ఆన్లైన్) విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించగా 2,35,907 మంది (88.90 శాతం) హాజరయ్యారు.అయితే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫలితాలు వెల్లడించలేదు. జూన్ 25న ప్రకటించిన టెట్ ఫలితాల్లో 1,37,903 మంది (58.4 శాతం) మంది అర్హత సాధించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల అర్హత పరీక్ష పేపర్–1ఏ (రెగ్యులర్)లో 75,142 మంది, పేపర్–1బీ (స్పెషల్ ఎడ్యుకేషన్)లో 790 మంది ఉత్తీర్ణులయ్యారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ల అర్హత పరీక్ష అయిన పేపర్–2ఏ(రెగ్యులర్)లో 60,846 మంది, పేపర్–2బీ (స్పెషల్ ఎడ్యుకేషన్)లో 1,125 మంది విజయం సాధించారు. ఈ నేపథ్యంలో.. మరోసారి టెట్ (జూలై) నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ రద్దు ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇచి్చన డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం రద్దుచేసింది. ఈ మేరకు ఆదివారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీచేశారు. ఒకట్రెండు రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులతో కొత్తగా నోటిఫికేషన్ జారీచేయనున్నారు. అయితే, ఈ కొత్త డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు తక్కువగా ఉన్నాయని, కావాలనే ఈ పోస్టులు భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని పలు జిల్లాల్లో అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. -
రెండ్రోజుల్లో టెట్ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు మరో శుభవార్త. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క ఏర్పాట్లు చేసూ్తనే మరోవైపు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శ కాలు జారీ చేసింది. కాగా, 2022, 2023 కాలంలో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారికి కూడా ఈ డీఎస్సీ నోటిఫికేషన్లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి.. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ జారీచేశారు. అప్పుడు 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుని పరీక్ష రాస్తే దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి సుమారు 5 లక్షల మంది టెట్‌కు హాజరుకావొచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.. ఒకట్రెండు రోజుల్లో పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ‘టెట్’ నిబంధనల సడలింపు.. ఇక టెట్ నిర్వహణకు ఏర్పాట్లుచేస్తున్న పాఠశాల విద్యాశాఖ.. అభ్యర్థులకు మేలు చేసేలా నిబంధనలను సడలించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్ పేపర్–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరన్న నిబంధన ఉండేది. దాన్ని సవరించి ఏపీ టెట్–2024 నోటిఫికేషన్‌కు ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. ఇతర వర్గాలకు మాత్రం గ్రాడ్యుయేషన్‌లో 50 మార్కులు తప్పనిసరి చేసింది. దీనివల్ల ఎక్కువమంది అభ్యర్థులు టెట్ రాసేందుకు అవకాశముంటుంది. అలాగే.. ఒకటి నుంచి ఐదో తరగతి బోధనకు ఉద్దేశించిన టెట్ పేపర్–1 రాసే అభ్యర్థులు ఇంటర్మిడియట్‌లో 50 శాతం మార్కులు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్/సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్‌తో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తిచేయాలి లేదా డిగ్రీ తర్వాత రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు టెట్ పేపర్–1 రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు. అయితే.. ఎస్సీ ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఐదు శాతం మార్కుల సడలింపునిచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. -
ఏపీ టెట్–2022 నోటిఫికేషన్ విడుదల ఎప్పుడంటే..?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్ ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం నోటిఫికేషన్, సిలబస్, పరీక్షల తేదీలు, పరీక్ష రుసుం తదితర వివరాలకు aptet.apcfss.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10.30 నుంచి ఈ వెబ్సైట్ నుంచి సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
టెట్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్! ఒక్కసారి రాస్తే చాలు..
సాక్షి, హైదరాబాద్: టెట్‌కు సంబంధించి ఇటీవల మంత్రుల కమిటీ చేసిన కొన్ని సవరణలను ప్రభుత్వం ఆమోదించింది. గతం లో టెట్‌లో సాధించిన అర్హత కాలపరిమితి ఏడేళ్లుగా ఉండేది. దీన్ని ఇప్పుడు జీవితకాలానికి పొడిగించారు. జాతీయ ఉపాధ్యాయ మండలి (ఎన్సీటీఈ) రెండేళ్ళ క్రితం ఈ మేరకు మార్పులు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా మార్పులు చేసింది. దీని ప్రకారం 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అంటే అప్పటినుంచి జరిగిన టెట్‌లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రం ఇప్పుడూ చెల్లుబాటు కానుంది. రాష్ట్రంలో ఇప్పటికే టెట్ పాసైనవారు సుమారు 3 లక్షల మంది ఉంటారని అంచనా. జూన్ 12న టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ను జూన్ 12వ తేదీన నిర్వహించనున్నట్టు ప్రభుత్వం గురువారం తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటి ఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్య (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ రాధారెడ్డి సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమగ్ర వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను ఈ నెల 25వ తేదీన ‘టీఎస్‌టెట్. సీజీజీ.జీవోవీ.ఇన్’వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. కాగా టెట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ కేటగిరీ విద్యార్థులకు 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 60 మార్కులు (40 శాతం) వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. పేపర్–1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.00 వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుంది. (చదవండి: వరంగల్ ఎన్ఐటీకి ఉద్యోగాల పంట.. అత్యధిక ప్యాకేజీ 62.5 లక్షలు) -
తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇటీవలే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా టెట్ నిర్వహించనున్నారు. తెలంగాణలో 13,086 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెట్ నిర్వహణకు విద్యాశాఖకు ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరైనట్టు తెలుస్తోంది. కాగా, టెట్ పూర్తయితే టీచర్ నియామకాల ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. -
టెట్ నిర్వహిస్తారా లేదా...?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కోసం 5.5 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపడితే తమకు టెట్ అర్హత ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ముందే టెట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏటా రెండు సార్లు నిర్వహించాల్సిన టెట్‌ను ఉమ్మడి రాష్ట్రంలో కలుపుకొని ఇప్పటివరకు ఆరుసార్లే నిర్వహించారు. వాస్తవానికి 12 సార్లు నిర్వహించాల్సిన టెట్‌ను 6 సార్లే నిర్వహించడంతో ఇంకా 5.5 లక్షల మంది టెట్ కోసం ఎదురు చూస్తు న్నారు. రాష్ట్రంలో 2017 జూలై 23 తర్వాత ఇప్పటి వరకు టెట్ నిర్వహించలేదు. తాజాగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఎన్సీటీఈ నిబంధనల మేరకు.. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ (1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు) పరీక్ష రాయాలంటే టెట్‌లో అర్హత సాధించి ఉండాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి 2011లో ఆదేశాలు జారీ చేసింది. విద్యా హక్కు చట్టం మేరకు టెట్‌ను తప్పనిసరి చేసింది. టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు ఉంటుందని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా టెట్ పేపర్–1లో అర్హత సాధిస్తే ఒకటి నుంచి 5వ తరగతి వరకు, పేపర్–2లో అర్హత సాధిస్తేనే 6 నుంచి 8వ తరగతి వరకు బోధించవచ్చని పేర్కొంది. టెట్‌లో అభ్యర్థులు సాధించిన స్కోర్‌కు ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ, ఉపాధ్యాయ నియామక పరీక్షకు 80 శాతం వెయిటేజీ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముగిసిన మూడు టెట్ల వ్యాలిడిటీ.. ఎన్సీటీఈ నిబంధనల మేరకు 2011 జూలై 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మొదటి టెట్ నిర్వహించింది. ఆ తర్వాత 2012 జనవరి 8న రెండో టెట్, 2012 జూన్ 1న మూడో టెట్ నిర్వహించింది. ప్రస్తుతం ఆ మూడు టెట్ల స్కోర్‌కు ఎన్సీటీఈ కల్పించిన ఏడేళ్ల వ్యాలిడిటీ ముగిసింది. ఆయా టెట్ల పేపర్–1, పేపర్–2 పరీక్షలకు తెలంగాణ, ఏపీకి చెందిన వారు 15 లక్షల మందికి పైగా హాజరు కాగా, అందులో 7,41,097 మంది అర్హత సాధించారు. అందులో తెలంగాణకు చెందిన అభ్యర్థులు దాదాపు 4 లక్షల మంది ఉన్నారు. ఏడేళ్ల నిబంధన కారణంగా వారంతా తమ టెట్ వ్యాలిడిటీని కోల్పోయారు. ఆ తర్వాత (2014, 2016, 2017లలో) నిర్వహించిన మరో మూడు టెట్లలో 3,69,308 మంది అర్హత సాధించారు. 2014 మార్చి 16న నిర్వహించిన నాలుగో టెట్‌లో ఏపీకి చెందిన 70 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వారు కాకుండా తెలంగాణ అభ్యర్థులు 3 లక్షల మంది ఆయా టెట్లలో అర్హత సాధించారు. అయితే మొదటి మూడు టెట్లలో అర్హత కోల్పోయిన వారు ఇందులో దాదాపు 2 లక్షల మంది ఉండగా, మరో లక్ష మంది అర్హులు కాలేకపోయారు. నాలుగో టెట్‌లో అర్హత సాధించని లక్ష మందితో పాటు మరో 3 లక్షల మందికి పైగా పలు టెట్లలో అర్హత సాధించని వారు ఉన్నారు. వారికి తోడు 2017 జూలై 23న నిర్వహించిన చివరి టెట్ తర్వాతి మూడు విద్యా సంవత్సరాల్లో (2018, 2019, 2020) ఉపాధ్యాయ విద్యా కోర్సులను (బీఎడ్, డీఎడ్) పూర్తి చేసుకున్న వారు మరో లక్షన్నర మంది ఉన్నారు. ఇలా మొత్తంగా రాష్ట్రంలో టెట్ కోసం ఇప్పుడు 5.5 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారంతా టెట్‌లో అర్హత సాధిస్తేనే టీఆర్టీ రాసేందుకు అర్హులు అవుతారు. ఆ లక్ష మందికి ప్రయోజనం చేకూరేనా? ప్రస్తుతం ఏడేళ్లు మాత్రమే ఉన్న టెట్ వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని ఇటీవల ఎన్సీటీఈ పాలక మండలి నిర్ణయించింది. దాన్ని జీవితకాలం వ్యాలిడిటీగా మారుస్తామని స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే దానిపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, మొదటి మూడు టెట్లలో అర్హత సాధించినా, తర్వాతి టెట్లలో అర్హత సాధించని మరో 1 లక్షల మందికి టెట్ గండం వచ్చి పడింది. టెట్ వ్యాలిడిటీని శాశ్వతం చేస్తామన్న ఎన్సీటీఈ నిర్ణయాన్ని.. గతంలో టెట్ అర్హత సాధించిన వారికి కూడా వర్తింపజేస్తే ఆ లక్ష మందికి ప్రయోజనం చేకూరనుంది. లేదంటే వారు కూడా మళ్లీ టెట్ రాయాల్సిందే. వెంటనే టెట్ నోటిఫికేషన్ ఇవ్వండి: రామ్మోహన్‌రెడ్డి, డీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రాష్ట్రంలో వెంటనే టెట్ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష నిర్వహించాలి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో టెట్‌లో అర్హత సాధిస్తేనే అభ్యర్థులకు టీఆర్టీ రాసే అర్హత లభిస్తుంది. టెట్ కోసం 5 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. వ్యాలిడిటీ రద్దయిన టెట్ల వివరాలు.. 2011 జూలై 1న మొదటి టెట్.. పేపర్ హాజరు అర్హులు అర్హుల శాతం 1 3,05196 1,35,105 44.27 2 3,34,659 1,66,262 49.68 2012 జనవరి 8 నాటి రెండో టెట్.. 1 55,194 24,578 44.53 2 4,12,466 1,93,921 47.02 2012 జూన్ 1 నాటి మూడో టెట్ 1 58,123 26,382 45.39 2 4,18,479 1,94,849 46.56. ప్రస్తుతం వ్యాలిడిటీ ఉన్న మూడు టెట్లు.. 16–3–2014 – నాలుగో ఏపీ టెట్ 1 65,770 40,688 61.86 2 4,04,385 1,15,510 28.56 22–5–2016– మొదటి తెలంగాణ టెట్ 1 88,661 48,278 54.45 2 2,51,906 63,079 25.04 23–7–2017– రెండో తెలంగాణ టెట్ 1 98,848 56,708 57.37 2 2,30,932 45,045 19.51 –––––––––––––––––––––– 22–5–2016 కానీ జనవరి 24న పరీక్ష జరిగింది. -
వచ్చే నెలలో మరోసారి టెట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను మరోసారి నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మేలో జారీ చేసి జూన్‌లో ఆన్లైన్లో పరీక్షలు చేపట్టనున్నారు. టెట్ పూర్తయ్యాక ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)ని నిర్వహించే అవకాశం ఉంది. మంగళవారం మంత్రి గంటా శ్రీనివాసరావు టెట్, డీఎస్సీలపై అధికారులతో సమావేశమయ్యారు. ఇటీవల నిర్వహించిన టెట్ లోపాలతో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. పైగా ఈ టెట్‌లో అనేకమందికి అర్హత మార్కులు రాలేదు. దీంతో వారంతా మరోసారి టెట్ నిర్వహించాలని కోరుతున్నారు. దీనిపై సమావేశంలో చర్చ జరిగింది. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించేందుకు అవకాశమున్నందున మరోసారి నిర్వహణకు నిర్ణయించారు. అభ్యంతరాలకు అవకాశమేది? ఇటీవల నిర్వహించిన టెట్‌ను 4,14,120 మంది రాయగా 1,94,093 మంది అర్హత సాధించారు. ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించడంతో ప్రశ్నలు, సమాధానాల జంబ్లింగ్, ఇతర కారణాలతో తమకు ఫైనల్ ‘కీ’ ప్రకారం వచ్చిన మార్కులకు, తుది ఫలితాల్లోని మార్కులకు చాలా వ్యత్యాసం ఉందని, 20 నుంచి 30 వరకు మార్కులు తగ్గిపోయాయని అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందాయి. తమ సమాధాన పత్రాలు ఇవ్వాలనే డిమాండ్ రావడంతో రూ.200 ఫీజుతో వాటిని అందించారు. 30,591 మంది వీటిని తీసుకున్నారు. అయితే వీటిని పరిశీలించుకొని అభ్యంతరాలు తెలియచేసేందుకు విద్యాశాఖ అభ్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. మరోవైపు కొన్ని పరీక్ష కేంద్రాల్లో సాంకేతిక కారణాలతో టెట్ పరీక్ష పత్రంలోని ఐదు ప్రశ్నలు కంప్యూటర్లలో కనిపించలేదు. ఈ కారణంగా తాము నష్టపోతున్నామని 1356 మంది ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించేందుకు ఒక కమిటీని విద్యాశాఖ నియమించింది. వీరికి ఆ ప్రశ్నలకు సంబంధించిన మార్కులు ఎలా కలపాలనే దానిపై తర్జనభర్జన పడుతోంది. ఇలా కలపడం వల్ల మిగిలిన అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు, న్యాయపరమైన సమస్యలు వస్తాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని, ఆ తర్వాత తదుపరి టెట్‌కు ప్రభుత్వానికి లేఖ రాస్తామని అధికారులు వివరించారు. ప్రొఫెసర్ పోస్టుల కంటే టీచర్ పోస్టులకు ఎక్కువ అర్హత మార్కులు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కంటే టెట్‌లో అర్హత మార్కులు అధికంగా పెట్టడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్ పోస్టులకు 40 శాతం మాత్రమే అర్హత మార్కులు ఉన్నాయని, తమకు 60 శాతం మార్కులు రావాలనే నిబంధన పెట్టడం అన్యాయమని వాపోతున్నారు. కాగా.. డీఎస్సీ పోస్టులపై ప్రభుత్వానికి నివేదిక పంపినా ఇప్పటివరకు స్పష్టత రాలేదు. 14,494 ఖాళీ పోస్టులున్నా అన్నిటినీ ఒకేసారి కాకుండా రెండు విడతలుగా భర్తీ చేయాలనుకుంటున్నారు. రెండో టెట్ నిర్వహణలోపు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి వీలుంటుందని, లేదంటే టెట్ ముగిశాక సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముంటుందని అధికార వర్గాలు వివరించాయి. – పోస్టుల భర్తీని వాయిదా వేసేందుకేనా! ఇలా ఉండగా టెట్‌లో గందరగోళం రేకెత్తేలా చేయడం, మళ్లీ దాన్ని నిర్వహించాలని నిర్ణయించడాన్ని పరిశీలిస్తే టీచర్ పోస్టుల భర్తీని సాధ్యమైనంత జాప్యం చేసేందుకే అనే అభిప్రాయాలు నిరుద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఏటా డీఎస్సీ ప్రకటిస్తామని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. నాలుగేళ్లలో ఇప్పటివరకు డీఎస్సీ నిర్వహించింది కేవలం ఒకేఒక సారే. రెండేళ్లుగా మంత్రి శ్రీనివాసరావు డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఇదిగో విడుదల చేస్తున్నాం, అదిగో నోటిఫికేషన్ జారీ అవుతోందంటూనే ఇప్పటికీ కాలం గడుపుతూనే వస్తున్నారు. 2017లో మూడు పర్యాయాలు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రకటనలిచ్చారు. గతేడాది డిసెంబర్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్షల నోటిఫికేషన్ తేదీలను కూడా విడుదల చేశారు. 2017 డిసెంబర్ 14న టెట్, ఆ మర్నాడు డీఎస్సీ నోటిఫికేషన్.. అన్నారు. కానీ టెట్ నోటిఫికేషన్ వెలువడటం, పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు విడుదల చేయడం అన్నీ అయిపోయాయి. టెట్ నిర్వహణలో గందరగోళం నెలకొంది. ఇప్పుడు తాజాగా మరోసారి టెట్ నిర్వహించనున్నామని, అభ్యర్థుల నుంచి డిమాండ్ వస్తోందని సర్కారు చెబుతోంది. వీటన్నింటినీ బట్టి చూస్తే.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో సాధ్యమైనంత జాప్యం చేయడానికే సర్కారు కుయుక్తులు పన్నుతోందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. -
అయోమయం..!
భువనగిరి : ఒకే రోజు భాషా పండితులకు సంబంధించిన గ్రేడ్–1, గ్రేడ్–2 పరీక్షలు జరగనుండడంతో అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి జనవరి 31వ తేదీన టీఆర్టీ షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. చాలా మంది అభ్యర్థులు రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని, ఒకే రోజు రెండు పరీక్షలు ఎలా రాయగరని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 100 పోస్టులు ఉండగా మూడువేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒకేరోజు రెండు పరీక్షలు దరఖాస్తుదారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేటప్పుడు గ్రేడ్–2 పరీక్ష రాసేందుకు ఉమ్మడి జిల్లాతో పాటు సొంత జిల్లాల ఆప్షన్ ఉండడంతో అభ్యర్థులు సొంత జిల్లాలను ఎంపిక చేసుకున్నారు. అక్టోబర్ 21న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఉదయం గ్రేడ్–2 పరీక్ష హైదరాబాద్‌లో జరగనుంది. ఈ పరీక్ష రాసి గ్రేడ్–1 పరీక్ష కోసం తిరిగి అభ్యర్థుల సొంత జిల్లాలకు రావాల్సి ఉంటుంది. కాగా అలాగే గ్రేడ్–1 పరీక్ష రాసే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేటప్పుడు కేవలం హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష కేంద్రం ఉన్నట్లుగా ఆప్షన్ రావడంతో ప్రతిఒక్కరూ అదే ఎంపిక చేసుకున్నారు. సాధారణంగా భాషా పండితుల పోస్టులకు పరీక్ష రాసే అభ్యర్థులు గ్రేడ్–1, గ్రేడ్–2కు దరఖాస్తులు చేసుకుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండు పరీక్ష నిర్వహణకు మధ్య వ్యవధి ఉండాలి. కానీ జనవరి 31వ తేదీన టీఎస్పీఎస్సీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 24వ తేదీనే రెండు పరీక్షలు నిర్వహించే విధంగా ప్రకటించారు. సాధారణంగా ఈ పరీక్షల వ్యవధి రెండున్నర గంటల వరకు ఉంటుంది. ఒకేరోజు రెండు పరీక్షలు నిర్వహించడం వల్ల హైదరాబాద్ నుంచి సొంత జిల్లాలకు వెళ్లి గ్రేడ్–1 పరీక్ష రాసే పరిస్థితి ఉండదు. వేల రూపాయాల ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు ఆవేదన వ్య్తం చేస్తున్నారు. ఈ విషయంపై టీఎస్పీఎస్సీ స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. 3వేల దరఖాస్తులు ఉపాధ్యాయ నియామక పరీక్ష–2017 కోసం ప్రభుత్వం అక్టోబర్ 21వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువుగా ప్రకటించింది. కొత్త జిల్లాల ప్రకారం కాకుండా పాత జిల్లాల ప్రాతిపదికనే నియామక ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఆదేశాల మేరకు దరఖాస్తు గడువును డిసెంబర్ 15 తేదీ వరకు పొడిగించింది. ఆపై దరఖాస్తు గడువును ఇదే నెల 30 వరకు పొడిగించింది. మరో విడతగా దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువు జనవరి 7వ తేదీ వరకు పొడిగించిది. దీంతో భాషపండితుల దరఖాస్తుదారుల సంఖ్య మరింత పెరిగింది. అయితే రాష్ట్రంలో ఉన్న 100 భాషాపండితుల ఖాళీలకు గాను మూడువేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణపై స్పష్టమైన ప్రకటన చేయాలి టీఎస్పీఎస్సీ దరఖాస్తు షెడ్యూల్లో భాషా పండితుల నిర్వహణపై చేసిన ప్రకటన అస్పష్టంగా ఉంది. నోటిఫికేషన్ సమయంలో గ్రేడ్–2 పరీక్ష హైదరాబాద్, గ్రేడ్–1 పరీక్ష సొంత జిల్లాల్లో నిర్వహించుకునే విధంగా వీలు కల్పించారు. కానీ పరీక్ష నిర్వహణ షెడ్యూల్లో మాత్రం ఒకేరోజు ఈ పరీక్ష ఉండటం వల్ల రెండు పరీక్షలు రాయడం సాధ్యం కాదు. టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహణపై స్పష్టమైన ప్రకటన చేయాలి. – మల్లికార్జున్, అభ్యర్థి, యాదాద్రిభువనగిరి జిల్లా పరీక్షల మధ్య వ్యవధి ఉండాలి భాషా పండితుల పరీక్ష నిర్వహణ విషయంలో వ్యవధి ఉండాలి. ఒకేరోజు పరీక్షను నిర్వహించడం వల్ల రెండు పరీక్షలు రాసే అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. ఒక పరీక్ష హైదరాబాద్‌లో రాసి, మరో పరీక్ష సొంత జిల్లాకు వచ్చి ఎలా రాస్తారు. భాషా పండితుల పరీక్షల నిర్వహణలో వ్యవధి ఉండే విధంగా చూడాలి. – పాండు, అభ్యర్థి, యాదాద్రిభువనగిరి జిల్లా -
నేడు ‘టెట్’ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ నియామకాల అర్హత పరీక్ష అయిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్) షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. టెట్ నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. పరీక్షలను జనవరి 17 నుంచి ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఫలితాలను ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేస్తామని మంత్రి గంటా వివరించారు. పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష అనంతరం ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీని) చేపడతామని వెల్లడించారు. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)కి అప్పగిస్తామని వివరించారు. టెట్‌కు హాజరయ్యేందుకు ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని, అనంతరం సంబంధిత దరఖాస్తులను ఆన్లైన్లో ‘హెచ్‌టీటీపీ://సీఎస్ఈ.ఏపీ.జీ ఓవీ.ఐఎన్’ద్వారా సమర్పించాలన్నారు. టెట్ షెడ్యూల్, ఇతర సమాచారాన్ని కూడా ఇదే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. -
‘ప్రైవేటు’లో బోధనకూ టెట్ తప్పనిసరి!
- టెట్ నోటిఫికేషన్లో స్పష్టం చేసిన విద్యా శాఖ - నిబంధన తప్పనిసరి చేయాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 11 వేలకు పైగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో బోధించే టీచర్లు.. ఉపాధ్యాయ అర్హత పరీక్షలో (టెట్) అర్హత సాధించి ఉండాల్సిందేనని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఇటీవల జారీ చేసిన టెట్ నోటిఫికేషన్లో ఈ విషయాన్ని వెల్లడించింది. టెట్‌లో అర్హత సాధించిన వారే ఏ పాఠశాలల్లో అయినా బోధన చేయడానికి అర్హులని పేర్కొంది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకునే వారు టెట్ పేపరు–1లో, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకునే వారు టెట్ పేప రు–2లో అర్హత సాధించి ఉండాలని పేర్కొం ది. విద్యాశాఖ కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు స్కూళ్ల లో టెట్‌లో అర్హత సాధించిన వారితోనే బోధన చేపట్టేలా నిబంధనలను తప్ప నిసరి చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 25 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లలో టెట్‌లో అర్హత సాధించిన వారినే టీచర్లుగా నియమిస్తున్న నేపథ్యంలో ప్రైవేటు స్కూళ్లలోనూ ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు కార్యాచరణను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. టెట్‌లో అర్హత లేని వారే అనేక మంది.. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఎలాంటి శిక్షణ పొందని వారు అనేక మంది పని చేస్తున్నారు. టెట్‌లో అర్హత సాధించని వారే ప్రాథమిక పాఠశాలల్లో 64 శాతం మంది టీచర్లుగా పని చేస్తున్నారు. ఇంజనీరింగ్ చేసిన వారు ఉన్నత పాఠశాల్లో సైన్స్, గణితం వంటి సబ్జెక్టులను బోధిస్తున్నారు. వారికి బోధనకు సంబంధించిన పదజాలంపై పట్టు ఉండదు. పాఠ్య పుస్తకాల నేపథ్యం, తాత్వికత, అభ్యాసాలు, విద్యా ప్రమాణాల గురించి అవగాహన ఉండదు. కేవలం పాఠం వివరించి, జ్ఞాపకం చేయించడం, వారాంతంలో పరీక్షలు నిర్వహించడం వంటివే చేస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో కేవలం 48 శాతమే టెట్‌లో అర్హత పొందిన వారున్నారని ఇటీవల విద్యాశాఖ క్షేత్రస్థాయిలో చేపట్టిన తనిఖీల్లో వెల్లడైంది. మొరాయించిన సర్వర్.. టెట్ దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 13న ప్రారంభమైంది. బుధవారం ఆన్లైన్ దరఖాస్తుల సర్వర్ మొరాయించడంతో అనేక మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఎక్కువ మంది ఒకేసారి దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించడంతో సర్వర్ డౌన్ అయిందని, అందుకే పని చేయలేదని అధికారులు వెల్లడించారు. -
టీఎస్ టెట్‌కు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష-2017 (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర పూర్తిస్థాయి సమాచారాన్ని సోమవారం నుంచి టీఎస్ టెట్ http://tstet.cgg.gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు టెట్ కన్వీనర్ వెల్లడించారు. జూలై 23న టెట్ పరీక్ష నిర్వహించి ఆగస్టు 5న ఫలితాలు ప్రకటిస్తామన్నారు. -
మే 1న టెట్
షెడ్యూలు విడుదల... నేడు నోటిఫికేషన్ జారీ ► ఈనెల 15 నుంచి 30 వరకు ఫీజు చెల్లింపు గడువు ► 16 నుంచి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ► పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల్లో ఇంకా అనుమానాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ను మే 1న నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఆదివారం తాజాగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 30 వరకు టీఎస్ ఆన్లైన్ లేదా పేమెంట్ గేట్ వే ద్వారా ఫీజు చెల్లించవచ్చని వెల్లడించింది. అలాగే ఈనెల 16 నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్లో (http://tstet.cgg.gov.in) దరఖాస్తులను సమర్పించవచ్చని పేర్కొంది. శనివారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించిన అనంతరం విద్యాశాఖ ఈ మేరకు షెడ్యూలును జారీ చేసింది. ఈసారైనా పరీక్ష జరిగేనా? టెట్‌ను నిర్వహించేందుకు విద్యాశాఖ ఇప్పటికే రెండుసార్లు నోటిఫికేషన్ జారీ చేసి షెడ్యూలును ప్రకటించినా వివిధ కారణాలతో వాయిదా వేసింది. తాజాగా మళ్లీ నోటిఫికేషన్ జారీకి సిద్ధమై షెడ్యూలును ప్రకటించింది. అయితే ఈసారైనా పరీక్ష నిర్వహిస్తారా అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. ప్రభుత్వం తొలుత గతేడాది నవంబర్ 14న టెట్ నోటిఫికేషన్ జారీ చేసి జనవరి 24న పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే అప్పట్లో వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం రాయడంతో ఆగిపోయింది. ఆ తరువాత నుంచి వివిధ కారణాలతో దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడుతూ వచ్చింది. గత నెల 27న మరోసారి టెట్ నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూలు జారీ చేసింది. ఏప్రిల్ 9న టెట్ నిర్వహిస్తామని, ఫిబ్రవరి 29 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొంది. అయితే టెట్ నిర్వహణ విషయంలో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిశీలించి తగిన చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 5న కమిటీని వేసిందన్న అంశాన్ని పేర్కొంటూ దరఖాస్తుల స్వీకరణను మరోసారి వాయిదా వేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సెంట్రల్ టెట్‌ను ఫిబ్రవరి 21న యథావిధిగా నిర్వహించింది. తాజాగా మూడోసారి టెట్ నిర్వహణకు అధికారులు షెడ్యూలు జారీ చేయడంతో అభ్యర్థుల్లో సంతోషం వ్యక్తమవుతున్నా.. పరీక్ష జరుగుతుందా అనే ఆందోళన మాత్రం వారిని ఇంకా వెంటాడుతోంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం తెలిసిందే. అందుకు సంబంధించిన కేసు త్వరలో విచారణకు రానున్న నేపథ్యంలో టెట్, ఆ తరువాత డీఎస్సీ నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు చెప్పుకునేందుకే ప్రభుత్వం టెట్ షెడ్యూలు జారీ చేసిందా అనే ప్రశ్నలు అభ్యర్థుల్లో తలెత్తుతున్నాయి. ఏదేమైనా ఈసారైనా పరీక్షను కచ్చితంగా నిర్వహించాలని వారు కోరుతున్నారు. డీఎస్సీపై పరిశీలన టెట్ షెడ్యూల్ జారీ అయిన నేపథ్యంలో డీఎస్సీ నిర్వహిణను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. డీఎస్సీకి సంబంధించి మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి. ఇదీ టెట్ షెడ్యూలు 13-3-2016: టెట్ నోటిఫికేషన్ 15-3-2016 నుంచి 30-3-2016 వరకు: టీఎస్ ఆన్లైన్, పేమెంట్ గేట్ ద్వారా ఫీజు చెల్లింపు. 15-3-2016 నుంచి: వెబ్సైట్ ద్వారా టెట్ సమాచార బులెటిన్, పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 16-3-2016 నుంచి 31-3-2016 వరకు: ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణ. 15-3-2016 నుంచి 1-5-2016 వరకు: అందుబాటులోకి హెల్ప్ డెస్క్ సేవలు. 15-3-2016 నుంచి 31-3-2016 వరకు: ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ 20-4-2016 నుంచి: హాల్ టికెట్ల డౌన్లోడ్ 1-5-2016: టెట్ పరీక్ష (ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష) -
‘టెట్’కు ఎన్నికల సంఘం పచ్చజెండా
వారంలోగా నోటిఫికేషన్ వెలువడే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం మేరకు నవంబర్‌లో టెట్ దరఖాస్తుల స్వీకరణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో నోటిఫికేషన్ ఇవ్వాలని సర్కారు భావించినప్పటికీ, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో మరోసారి అవాంతరం ఏర్పడింది. దీంతో టెట్ నిర్వహణకు అనుమతించాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌కు సర్కారు లేఖ రాసింది. దీంతో ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించిందని పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్ మంగళవారం తెలిపారు. టెట్‌తో టెన్త్‌కు గండం? వారంలోగా ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తే పరీక్షను ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశాలున్నాయి. అదే జరిగితే పదో తరగతి విద్యార్థులకు శాపంగా పరిణమించనుంది. టెన్త్ విద్యార్థులకు మార్చి 21 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఒకవేళ ఫిబ్రవరిలో టెట్ నిర్వహిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లు, ప్రైవేటు పాఠశాలల్లోని టీచర్లు టెట్‌కు సన్నద్ధమయ్యేందుకు ఒకట్రెండు నెలల పాటు సెలవులు పెట్టే అవకాశం ఉంది. ఫలితంగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో టీచర్లు లేకపోవడంతో టెన్త్ విద్యార్థులు పునశ్చరణ తరగతులకు ఇబ్బందులు పడతారు.