తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల | Telangana TET Notification 2022 Released Check Full Details Here | Sakshi
Sakshi News home page

Telangana TET Notification: తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. జూన్ 12న ఎగ్జామ్‌

Published Thu, Mar 24 2022 7:23 PM | Last Updated on Thu, Mar 24 2022 7:25 PM

Telangana TET Notification 2022 Released Check Full Details Here - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇటీవలే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయ్యింది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా టెట్ నిర్వహించనున్నారు.  

తెలంగాణలో 13,086 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెట్ నిర్వహణకు విద్యాశాఖకు ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరైనట్టు తెలుస్తోంది. కాగా, టెట్ పూర్తయితే టీచర్ నియామకాల ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement