
అమలాపురం టౌన్: కొద్ది రోజుల కిందట అస్వస్థతకు గురై, హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొంది, అక్కడి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ గుండె శస్త్రచికిత్సకు శుక్రవారం ముంబై బయలుదేరి వెళ్లారు. ముంబైలోని ఏషియన్ హార్ట్ సెంటర్‌లో ఆయనకు సోమవారం గుండె శస్త్రచికిత్స చేస్తారని మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి మంత్రి విశ్వరూప్ తన కుటుంబ సభ్యులతో కలిసి విమానంలో ముంబై వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం ముంబై ఏషియన్ హార్ట్ సెంటర్ ఆస్పత్రిలో ఆయన అడ్మిట్ అయినట్లు కృష్ణారెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment