సాక్షి, తాడేపల్లి : సాంఘిక సంక్షేమ గురుకులాల్లో దాదాపు 33 ఏళ్ల తర్వాత కేర్ టేకర్ల ఉద్యోగాలు భర్తీ చేశామని ఆ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ తెలియజేశారు. బుధవారం ప్రిన్సిపాల్, కేర్‌టేకర్లుగా నియమితులైన వారికి మంత్రి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా కేర్ టేకర్లను నియమిస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరుగకుండా పారదర్శకంగా శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని వెల్లడించారు.
దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. త్వరలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 552 టీజీటీ పోస్టులను కూడా భర్తీ చేస్తామని ప్రకటించారు. నాడు, నేడు కింద విద్యాలయాలు, గురుకులాలను అభివృద్ధి చేస్తున్నామని పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో విద్యావ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నామంటూ.. వసతి గృహాల్లో మెరుగైన విద్య, ఆహారం కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment