న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ 2020-21లో షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి రూ.85 వేల కోట్లు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి రూ.53 వేల 700 కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. సీనియర్ సిటిజెన్స్, దివ్యాంగుల సంక్షేమానికి రూ. 9500 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆమె పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. నరేంద్ర మోదీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండోసారి ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది
Comments
Please login to add a commentAdd a comment