
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రవి
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి
సంగారెడ్డి జోన్: ఎస్సీ ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని వచ్చే ఏడాది స్వయం ఉపాధి పథకాల కింద ఇచ్చే సబ్సిడీని 90 శాతం పెంచేందుకు కృషి చేస్తానని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్‌లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వయం ఉపాధి రుణాల లక్ష్యం రూ.54.84 కోట్లు కాగా 3085 మంది లబ్ధిదారులకు రూ.37 కోట్లు ప0పిణీ చేశామన్నారు.
1397 ఎకరాలను 603 మంది దళితులకు భూ కొనుగోలు పథకం కింద లబ్ధిచేకుర్చామన్నారు. ఇందుకోసం రూ.66.88 కోట్లను ఖర్చు చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం ఉపాధి కింద 42 వేల మంది దరఖాస్తులు రాగా 12 వేల మందికి మంజూరు చేశామన్నారు. త్వరలోనే మిగిలిన వారి కూడా సబ్సిడీ విడుదల చేస్తామన్నారు. 2014-15, 2015-16లోఉన్న 80 శాతం సబ్సిడీని 2016-17 సంవత్సరానికి 90 శాతం పెంచేందుకు కృషి చేస్తామన్నారు.
దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రథమ స్థానంలోఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలోఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలు ఉండేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14 నాటికి 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
నవంబర్‌లో బస్సుయాత్ర
నవంబర్ నెలలో రెండేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వంఅమలు చేసిన పథకాల ఫలితాలపై అధ్యయం చేసేందుకు సీఎం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. సమావశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్‌దాస్, సూపరింటెండెంట్ దేవయ్య తదితరులు ఉన్నారు.