హోదా కోసం పోరాడితే కచ్చితంగా వచ్చేది | poradite kachitamga vachedi | Sakshi
Sakshi News home page

హోదా కోసం పోరాడితే కచ్చితంగా వచ్చేది

Published Wed, Sep 14 2016 11:19 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

poradite kachitamga vachedi

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : ప్రత్యేక హోదా కోసం పోరాడి ఉంటే రాష్ట్రానికి కచ్చితంగా హోదా వచ్చేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ చెప్పారు. ఏలూరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని స్వాగతిస్తూనే విభజన హామీలైన ప్రత్యేక హోదా, పరిశ్రమలకు రాయితీలు, రైల్వే జోన్, చెన్నై– విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్, పెట్రోలియం యూనివర్సిటీ వంటి హామీలను సాధించేందుకు రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అందుకోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో జనసేన నాయకుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటన దురదృష్టకరమని, మన నాయకులను కించపరుచుకోవడం మనకే నష్టమన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం కోర్టులో ఉన్నందున దానిపై మాట్లాడే అధికారం తనకు లేదని, ఆయా సామాజిక వర్గాలు అందించే అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని శివాజీ చెప్పారు. కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్‌ జవహర్‌ తనపై విమర్శలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాని, ఆయన నియోజకవర్గానికి ఎప్పుడు వెళ్లినా ముందుగా ఆయనకు చెప్పే వెళతానని, కానీ ఆయన అబద్ధపు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement