జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురంలో భర్తీ చేసిన బోధన, బోధనేతర ఉద్యోగాలకు సంబంధించిన రోస్టర్ పాయింట్ల రికార్డుల నిర్వహణపై ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అసంతప్తి వ్యక్తం చేశారు. ఎస్కేయూలో సమీక్ష సమావేశం అనంతరం జేఎన్‌టీయూ అధికారులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. పొరుగుసేవలు, బోధన, బోధనేతర ఉద్యోగాల రోస్టర్ రిజిస్టర్లను పరిశీలించారు. పొరుగు సేవలకు సంబంధించి 89 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం మాత్రమే ఎస్సీలకు కేటాయించారని, డేటా ఆపరేటర్లలో ఎస్టీకి ఒక పోస్టు మాత్రమే ఇచ్చారని, సామాజిక న్యాయం ఎక్కడ పాటించారని ప్రశ్నించారు.
సాంఘిక సంక్షేమ, గిరిజన, వికలాంగ సంక్షేమ అధికారులతో సామాజిక తనిఖీ చేయించలేదని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఒక ఉన్నతాధికారిని ప్రత్యేకంగా నియమించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ వీసీ ఆచార్య ఎం.సర్కార్ పాల్గొన్నారు.
రికార్డుల నిర్వహణపై అసంతృప్తి
Published Wed, Oct 26 2016 10:36 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement