Capital City Construction
-
హైకోర్టు ‘గడువుల’పై సుప్రీం స్టే
రాజధాని ఫలానా ప్రాంతంలోనే ఉండాలని ఆదేశించే అధికారం న్యాయస్థానానికి లేదు. అది ప్రభుత్వ పరిధిలోని అంశం. ఇలాంటి వ్యవహారాల్లో కూడా కోర్టులు జోక్యం చేసుకుంటుంటే, ఇక ప్రజా ప్రతినిధులెందుకు? మంత్రి వర్గం ఎందుకున్నట్లు? – సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో నిర్మించి, అభివృద్ధి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపేసింది. అలాగే రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర ప్రాథమిక మౌలిక సదుపాయాలతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలన్న ఆదేశాన్ని కూడా సుప్రీంకోర్టు నిలిపేసింది. అంతేకాక అన్ని మౌలిక సదుపాయాలతో నివాసయోగ్యమైన రీతిలో ప్లాట్లను అభివృద్ధి చేసి వాటిని మూడు నెలల్లో ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన భూ యజమానులకు అప్పగించాలన్న ఆదేశాన్ని సైతం సుప్రీంకోర్టు స్టే చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అమరావతి రైతులకు, రైతు సంఘాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేసింది. రాజధాని నగరాన్ని మార్చే లేదా రాజధానిని విభజించే లేదా మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదని చెప్పిన హైకోర్టు తీర్పుపై జనవరి 31న లోతుగా విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘‘ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త చట్టాన్ని తెస్తే, ప్రస్తుత వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయి కదా! అందుకనే ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా తేలుస్తాం’’ అని న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బివీ.నాగరత్నంతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పలు సందర్భాల్లో విస్మయం వ్యక్తం చేసింది. పలు ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటిషన్ రాజధాని నగరాన్ని మార్చే లేదా రాజధానిని విభజించే లేదా మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ ఏడాది మార్చి 3న తీర్పునిచ్చింది. అలాగే హైకోర్టుతో సహా శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలను ఏపీ సీఆర్డీఏ చట్టం, ల్యాండ్ పూలింగ్ నిబంధనల కింద నోటిఫై చేసిన ప్రాంతంలో తప్ప మరో చోటుకి మార్చే అధికారం కూడా రాష్ట్రానికి లేదని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. వీటితో పాటు రాజధాని నగర, రాజధాని ప్రాంత అభివృద్ధి, నిర్మాణం విషయంలో పలు కాల పరిమితులను నిర్ధేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఇదే సమయంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని, ఇలా చేయకపోవటం కోర్టు ధిక్కారమేనని పేర్కొంటూ కొందరు రైతులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నంతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. మనుగడలోని లేని చట్టం ఆధారంగా హైకోర్టు తీర్పునిచ్చింది... ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ, పాలన వికేంద్రీకరణ కోసం ఉద్దేశించిన చట్టం రద్దయిందని, అలా రద్దయిన తరవాత కూడా అది ఉన్నట్లుగా భావించి హైకోర్టు తీర్పునిచ్చిందని, అలా ఎలా చేస్తుందని ప్రశ్నించారు. న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ జోక్యం చేసుకొని రైతులకు, రాష్ట్రానికి మధ్య జరిగిన ఒప్పందం కొంత మేరకు మనుగడలో ఉంటుంది కదా అని అభిప్రాయపడ్డారు. ఒక నిర్దిష్ట పరిధిలో చట్టాన్ని ఆమోదించాలంటూ శాసనసభను హైకోర్టు ఆదేశించజాలదని, ఇదంతా అధికార విభజన పరిధిలోని వ్యవహారమని వేణుగోపాల్ తెలిపారు. ఒక చట్టం మనుగడలో లేనప్పుడు దాని శాసన యోగ్యతపై కోర్టు జోక్యం తగదన్నారు. ‘‘చట్టం రద్దు చేసినప్పుడు శాసనసభ తదుపరి ఏం చేస్తుందో న్యాయ వ్యవస్థ ఓపికతో చూడాలి. ఆపై శాసనసభ మరో చట్టాన్ని ఆమోదిస్తే దాని చెల్లుబాటును పరిగణించొచ్చు. కానీ చట్టమే లేనప్పుడు అది ఉన్నట్టే పరిగణనలోకి తీసుకున్నారు. ఇది చాలా చిత్రమైన అంశం. న్యాయస్థానాలు పూర్తిగా అకడమిక్ సమస్యల్లోకి వెళ్లజాలవవు’’ అని వేణుగోపాల్ తెలిపారు. రాజధాని నగరం అనే భావన రాజ్యాంగంలో లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలులో రాజధాని ఏర్పాటుకు సంబంధించి నిర్దిష్ట ప్రదేశం లేదని, రాజధాని అంటే ప్రభుత్వం తన మూడు శాఖల్లో దేనిలోనైనా పని చేసే స్థానం మాత్రమేనన్నారు. కార్యనిర్వాహక వ్యవహారాలు పూర్తిగా అధికార యంత్రాంగానికి సంబంధించిన సమస్య అని విన్నవించారు. హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది... నెల లోపు ఇది చేయండి అని ఆదేశించడం సులభమని, కాని దానిని ఆచరణలో పెట్టడం అసాధ్యమైన పనిగా వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ సమయంలో జస్టిస్ జోసెఫ్ జోక్యం చేసుకుంటూ, ‘అమరావతిలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు ఉన్నారుగా..! హైకోర్టు భవనం కూడా కట్టారు. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు అంటున్నారు. దీని సంగతి ఏమిటి? అని ప్రశ్నించారు. అదంతా అయిపోయిన అంశం అని వేణుగోపాల్ పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులకు ముప్పు వాటిల్లుతుందని సహేతుకమైన భయాందోళనలున్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు. కానీ హైకోర్టు ఆదేశాలు అనుమానమే బేస్‌గా ఇచ్చినట్లున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సమయంలో జస్టిస్ బీవీ నాగరత్న స్పందిస్తూ,. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో అధికారాలు వేర్వేరుగా లేవా? హైకోర్టు ఎందుకు కార్యనిర్వాహక అధికారాలను నిర్విర్తిస్తోంది? అన్నింటినీ ఒకే చోట కేంద్రీకరించడం కంటే మరిన్ని పట్టణ కేంద్రాలను కలిగి ఉండడం మంచిది కదా..? దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్రమే కదా? హైకోర్టు కాదు కదా!. హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాక ఇరువురు న్యాయమూర్తులు కూడా, వేర్వేరు రాష్ట్రాల్లో అధికార వికేంద్రీకరణ గురించి న్యాయవాదులతో చర్చించారు. రైతుల ప్రయోజనాలకు పూర్తి రక్షణ ఉంది... ఈ సమయంలో భూములిచ్చిన రైతుల గురించి జస్టిస్ జోసెఫ్ ఆరా తీశారు. రైతుల హక్కులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్‌రెడ్డి కోర్టుకు వివరించారు. చట్టంలో రైతుల ప్రయోజనాలను పరిరక్షించే ఏర్పాట్లున్నాయన్నారు. రైతుల నుంచి సేకరించిన భూమిని అభివృద్ధి చేయడానికి సంబంధించి ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని, అయితే కాలపరిమితి అనేది ప్రధానమైన అడ్డంకి అని ఆయన వివరించారు. అమరావతిని రాజధానిగా తొలగించలేదని, మూడు అధికార కేంద్రాల్లో అమరావతి కూడా ఒకటి అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో హైకోర్టు నిర్వహణ గురించి న్యాయమూర్తులు ఆరా తీశారు. హైకోర్టు గురించి చెప్పాలని జస్టిస్ జోసెఫ్ కోరగా.. అమరావతిలోనే నిర్వహణ సాగుతోందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. హైకోర్టుపై ఎంత ఖర్చుచేశారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. సుమారు రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు నిరంజన్‌రెడ్డి తెలిపారు. హైకోర్టులో క్యాంటీన్ లేదట కదా..! న్యాయమూర్తులు, న్యాయవాదులు మధ్యాహ్నా సమయంలో భోజనం నిమిత్తం బయటకి వెళ్తున్నారట కదా! అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. హైకోర్టు పూర్తి స్థాయిలో పనిచేయాలంటే పూర్తి స్థాయి సౌకర్యాలు ఉండాలి కదా? అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం క్యాంటీన్ పూర్తిస్థాయిలో ఉందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. పూర్తిస్థాయి వాదనల తరువాత దీనిపై నిర్ణయం... వేణుగోపాల్ వాదనలు కొనసాగిస్తూ.. సమాఖ్య నిర్మాణంలో రాజధానిని మార్చుకొనే అధికారం రాష్ట్రానికి ఉండదా? ఆ అధికారాన్ని హైకోర్టు తన ఆదేశాలతో నియంత్రించొచ్చా? అని ప్రశ్నించారు. జస్టిస్ జోసెఫ్ జోక్యం చేసుకొని రెండు సమస్యలు గుర్తించినట్లుగా పేర్కొన్నారు. శాసనసభ అధికారాలు, రైతుల సమస్య రెండింటినీ చూడాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వానికే రాష్ట్ర రాజధానిని నిర్ణయించే అధికారం ఉందన్న హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని వేణుగోపాల్ కోరారు. ఈ విషయంలో న్యాయాన్యాయాల జోలికి వెళ్లని సుప్రీంకోర్టు... పూర్తి స్థాయి వాదనల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. హైకోర్టు తప్పుగా పేర్కొంది... చట్టంలో ‘ఎ క్యాపిటల్’ అని ఉందని, అంటే ఒకే రాజధాని అని ఎలా భావిస్తారని ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వ్యాఖ్యానించారు. అమరావతిని రాజధానిగా కేంద్రం నిర్ణయించలేదని, కేంద్రం కేవలం నిపుణుల కమిటీని మాత్రమే వేసిందని ఆయన తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 4 ప్రకారం రాష్ట్ర రాజధానిని కేంద్రమే నిర్ణయిస్తుందని హైకోర్టు తప్పుగా పేర్కొందని వేణుగోపాల్ తెలిపారు. ఆర్టికల్ 4 ద్వారా సంక్రమించిన అధికారం కొత్త రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఒకసారి మాత్రమే వినియోగించగలిగేదని వేణుగోపాల్ ధర్మాసనం దృష్టికికి తీసుకొచ్చారు. శాసన అధికారాలకు మూలం ఏంటని జస్టిస్ జోసెఫ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.. కార్యనిర్వాహక అధికారం శాసన అధికారంతో సహా విస్తృతమైనదని, ముందుగా శాసన అధికారం కలిగి ఉండాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. క్యాపిటల్ అనే భావన అసలు రాజ్యాంగంలో లేదని, సమాఖ్య రాష్ట్రంలో పాలనలో కొంత భాగాన్ని కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా నిర్ణయించడానికి అనుమతి ఉంటుందని, కార్యనిర్వాహక అధికారాల నిర్వహణలో శాసన వ్యవస్థ ఎప్పుడైనా అడుగు పెట్టొచ్చని వేణుగోపాల్ తెలిపారు. ‘‘రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సమయంలో రాజ్యాంగపరమైన విషయాలపై నిర్ణయం తీసుకోవాలి. కానీ రోజువారీ కార్యకలాపాలు ఎలా నిర్వహించాంటూ రాష్ట్రం చేతులు కట్టుకుని న్యాయవ్యవస్థను అడగాలా? ఇది పూర్తిగా ఎగ్జిక్యూటివ్ అధికారాలకు విరుద్ధం కాదా?’’ అని వేణుగోపాల్ ప్రశ్నించారు. ఆర్టికల్ 162 రాష్ట్ర కార్యనిర్వాహక అధికార పరిధిని పరిశీలిస్తుంది కదా అని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించగా... కార్యనిర్వాహక అధికారం శాసన అధికారంతో కలిసి ఉంటుందని మాత్రమే ఆర్టికల్ 162 చెప్పిందని వేణుగోపాల్ తెలిపారు. అయితే, రాష్ట్రానికున్న శాసన అధికారాలతో విభజన చట్టాన్ని సవరించగలరా? అని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించారు. అలా చేయలేమని, విభజన చట్టం అనేది ఓ ప్రవేశిక అని వేణుగోపాల్ తెలిపారు. విభజన చట్టాన్ని సవరించడానికి పార్లమెంటుకు నిర్దిష్టమైన నిబంధనలున్నందున దాన్ని సవరించలేమని జస్టిస్ జోసెఫ్ పేర్కొన్నారు. రాజధానిని మార్చే అధికారం రాష్ట్రానికి లేదు... రైతుల తరఫు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని ఓసారి చూడాలన్న ఆయన... ఒకసారి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశాక దాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. జస్టిస్ జోసెఫ్ జోక్యంచేసుకొని... చట్టంలో అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పలేదుగా? అని ప్రశ్నించారు. తొలుత హైదరాబాద్ రాజధానిగా పేర్కొన్నారని, తర్వాత కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ప్రత్యామ్నాయ రాజధానిని నిర్ణయించాలని సూచించిందని నారిమన్ పేర్కొన్నారు. అంటే ఫలానా ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పలేదుగా? అని జస్టిస్ జోసెఫ్ పేర్కొంటూ... రాజధాని ఒక ప్రాంతంలో అభివృద్ధి చెందాలని కూడా చెప్పలేమన్నారు. పార్లమెంటు ఒక రాజధాని అని మాత్రమే చెప్పిందని, కానీ ఇక్కడ మూడు రాజధానులు అంటున్నారని నారీమన్ తెలిపారు. రాజధాని ఎక్కడ ఉండాలో రాష్ట్రం నిర్ణయించగలదని జస్టిస్ జోసెఫ్ స్పష్టంచేశారు. దీనిపై పార్లమెంటు చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుంటందని నారీమన్ తెలిపారు. లబ్ది చేకూరుతుందనే భూములిచ్చారు... రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు నిరంజన్‌రెడ్డి, శ్రీరామ్ జోక్యం చేసుకొంటూ రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ 35, ఉమ్మడి జాబితాలోని ఎంట్రీ 20 ప్రకారం రాష్ట్రంలో పట్టణ, స్థానిక ప్రణాళికలకు సంబంధించి చట్టాలను రూపొందించడానికి శాసనసభ సమర్థనీయమైందని తెలిపారు. రైతుల తరఫు మరో సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తూ.. రైతులకు ప్రయోజనం చేకూరుతుందనే ల్యాండ్ పూల్‌కి అంగీకరించారన్నారు. 2020 నాటికి భూములు అభివృద్ధిలోకి తెస్తామని హామీ ఇచ్చారని, కానీ 2019 నుంచే మౌలికసదుపాయాల కల్పన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వదిలేసిందని శ్యాం దివాన్ తెలిపారు. మూడేళ్లుగా భూమిపై ఎలాంటి చర్యలు లేవన్నారు. కొన్ని ఫొటోలు చూపుతూ హైకోర్టు ఆవరణలో సౌకర్యాలు లేవని, సరైన రహదారులు లేవని, పాఠశాలలు లేవని, కానీ మిషన్ 2020 అని రైతులకు చెప్పారన్నారు. పరిపాలనలో భాగంగా పాలనపరమైన బ్లాకులను వేరే ప్రాంతాలకు మార్చే సామర్థ్యం రాష్ట్రానికి లేదని పేర్కొన్నారు. పాలనపరమైన బ్లాకులను మార్చడం ద్వారా నగరాన్ని నాశనం చేస్తున్నారన్నారు. హైకోర్టు విధించిన కాలపరిమితి అసాధ్యమని భావిస్తే తిరిగి హైకోర్టుకు వెళ్తే తగిన సమయం ఇస్తుందన్నారు. 2019 మే నుంచి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎందుకు చేయలేదో కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలన్నారు. అసలు చట్టంలో రాజధాని నగరం అంటే ఏంటని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించగా.. పరిపాలన ప్రాథమిక స్థానమని దివాన్ తెలిపారు. అలా అయితే మనకు ప్రజా ప్రతినిధులెందుకు..? ఇవన్నీ ఫలానా ప్రాంతంలో ఉండాలా? ఇవి చట్టానికి సంబంధించిన విషయాలా? అని న్యాయమూర్తి తిరిగి ప్రశ్నించారు.. జస్టిస్ బీవీ నాగరత్న స్పందిస్తూ.. అలా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం న్యాయస్థానానికి సంబంధించిన అంశం కాదు. అలాంటప్పుడు మనకు ప్రజా ప్రతినిధులు ఎందుకున్నారు? మంత్రి వర్గం ఎందుకు? అని ప్రశ్నించారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజధాని కాకుండా వేరే ప్రదేశంలో సెక్రటేరియట్ లేదా దానిలో కొంత భాగం ఉండాలని ప్రభుత్వం భావిస్తుండొచ్చుగా? జస్టిస్ జోసెఫ్ పేర్కొన్నారు. అమరావతి నుంచి విశాఖపట్నం, కర్నూలు ఎంత దూరమని న్యాయవాదిని ప్రశ్నించారు. విశాఖపట్నం సుమారు 500 కిలోమీటర్లు, కర్నూలు సుమారు 800 కిలోమీటర్లు అని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. ఇది వికేంద్రీకరణలాగే ఉంది కదా! అని ధర్మాసనం అభిప్రాయపడింది. అందరి వాదనలు విన్న ధర్మాసనం, హైకోర్టు ఇచ్చిన తీర్పులోని పలు ఆదేశాలపై స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేసింది. అమరావతి రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశం పూర్తిగా అసంబద్ధం. అది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆరు నెలల్లో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయడమేంటి? అసలు మీ ఉద్దేశంలో రాజధాని నగరమంటే ఏంటి? అన్నీ మౌలిక వసతులతో రాజధాన్ని ప్రాంతం మొత్తాన్ని నెల రోజుల్లో అభివృద్ధి చేయాలా? హైకోర్టు ఇలా ఎలా ఆదేశాలిస్తుంది. నగర నిర్మాణంలో హైకోర్టుకున్న నైపుణ్యమేంటి? హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా? లేక చీఫ్ ఇంజనీరా? ఇలాంటి వ్యవహారంలో కోర్టులకు ఎలాంటి నైపుణ్యం ఉండదు. అందువల్ల నగర నిర్మాణం విషయంలో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోబోం. ఆంధ్రప్రదేశ్‌లో అధికారాలు వేర్వేరుగా లేవా? హైకోర్టు ఎందుకు కార్యనిర్వాహక విధులు నిర్వర్తిస్తోంది? అన్నింటినీ ఒకే చోట కేంద్రీకరించడం కంటే మరిన్ని పట్టణ కేంద్రాలను కలిగి ఉండడం మంచిదే కదా!!. ఈ విషయంలో నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే తప్ప, హైకోర్టుది కాదు. ఈ మొత్తం వ్యవహారంలో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది. హైకోర్టు కార్య నిర్వాహక వ్యవస్థ ఎంత మాత్రం కాజాలదు. – సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నం ధర్మాసనం -
చంద్రబాబు జాతీయ నాయకుడు కాదు..
సాక్షి, అనంతపురం : లక్ష కోట్ల రాజధాని వద్దు-ఇరిగేషన్ ప్రాజెక్టులు ముద్దు పేరుతో జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని క్లాక్ టవర్ నుంచి సప్తగిరి సర్కిల్ దాకా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాల్, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, కదిరి ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి, మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, ఎమ్మెల్సీ ఇక్భాల్, డీసీసీబీ ఛైర్మన్ పామిడి వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, పార్టీ నేతలు నదీం అహ్మద్, గంగుల భానుమతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే. అమరావతి కోసం చంద్రబాబు జోలె పట్టడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. రాయలసీమలో ఆకలి చావులు జరిగినప్పుడు చంద్రబాబు ఎందుకు జోలి పట్టలేదని ప్రశ్నించారు. సీమ వెనుకబాటుకు చంద్రబాబే కారణమని విమర్శించారు. చంద్రబాబు జాతీయ నాయకుడు కాదని, ఒక జాతి నాయకుడని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ ప్రారంభించిన ఇరిగేషన్‌ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ కరువుపై మానవతా దృక్పథంతో స్పందించి.. సీమ ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి అధికార వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీలోని 13 జిల్లాలు అభివృద్ధి చెందాలని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు జోలె పట్టడం హాస్యాస్పదం అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు డ్రామాలు అడుతున్నాడని ఎమ్మెల్సీ ఇక్బాల్ దుయ్యబట్టారు. అమరావతిలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, ఇన్ సైడర్ ట్రెడింగ్ ద్వారా 4000 ఎకరాలు టీడీపీ నేతలు కొన్నారని పేర్కొన్నారు. బినామీ ఆస్తులను కాపాడుకునేందుకు చంద్రబాబు పాకులాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు జోలె పట్టడం హాస్యాస్పదమని, ఏపీ లోని 13 జిల్లాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారన్నారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందితే చంద్రబాబుకు ఎందుకు బాధ అని నిలదీశారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు అనుకూలమా.. కాదో చెప్పాలని ఎమ్మెల్సీ ఇక్బాల్ డిమాండ్ చేశారు. రాయలసీమ కష్టాలు బాబుకు కనిపించవా సొంత ప్రయోజనాల కోసమే చంద్రబాబు అమరావతి పోరాటం చేస్తున్నారని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో చంద్రబాబు గ్రాఫిక్స్ మమాజాలం సృష్టించిందని, నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అమరావతిలో రాజధాని కట్టలేమని పేర్కొన్నారు. రాయలసీమ కష్టాలు చంద్రబాబుకు కనిపించవా అని ప్రశ్నించారు. వైఎస్సార్ కృషి ఫలితమే హంద్రీనీవా ప్రాజెక్టు అని తెలిపారు. చంద్రబాబు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని, కనీసం రూ. 25000 కోట్లు సీమ కోసం ఎందుకు ఖర్చు పెట్టలేదని నిలదీశారు. తమకు లక్షల కోట్ల రూపాయల రాజధాని అక్కర్లేదని.. పుష్కలంగా తాగు, సాగు నీరు అందింతే చాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అండగా నిలుస్తామని, రాయలసీమలో జ్యూడిషియల్ క్యాపిటల్ ను స్వాగతిస్తున్నామని అన్నారు. -
ఉద్యమం అంటే ఏంటో మేం చూపిస్తాం: స్పీకర్
సాక్షి, శ్రీకాకుళం : మూడు రాజధానులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఉత్తరాంధ్ర ఫోరం అండగా ఉంటుందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. జిల్లాలో శుక్రవారం స్పీకర్ మాట్లాడుతూ.. సీఎం నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసే పోరాటాలకు ధీటైన సమాధానం చెబుతామని పేర్కొన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్‌ను, ఆస్తులను కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు జనాల్ని రెచ్చగొట్టి ఉద్యమం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతిలో సాగేది సహజ సిద్ధమైన పోరాటం కాదని, అసలుసిసలైన ప్రజా ఉద్యమం అంటే ఏంటో తాము చూపిస్తామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం నుంచి రాజయలసీమ వరకూ సాగే ఉద్యమం ఎలా ఉంటుందో బాబు చూస్తారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వెళ్లిన టీడీపీ నేతలు పార్టీ స్టాండ్ తో అమరావతి కావాలనడం సిగ్గుచేటని అన్నారు. ఇన్నేళ్లుగా పేదరికం, వెనుకబాటుతనానికి ఈప్రాంతం గురవుతుంటే వాళ్లకు కళ్లు లేవా అని స్పీకర్ ప్రశ్నించారు. ‘ఓ ఉత్తరాంధ్ర పౌరుడిగా నేను ప్రశ్నిస్తున్నా.. సమాధానం చెప్పండి. రాజకీయం చేసుకుని బతికే మీదీ ..ఒక బతుకేనా? మా రాజధానిని మేం దక్కించుకునేందుకు ఎంత వరకైనా పోరాడుతాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. గతంలో ఏ కారణం లేకుండా సీఎం వైఎస్ జగన్‌ను విశాఖ ఎయిర్ పోర్టులో ఎందుకు అరెస్ట్ చేశారు. ఇంకా మా పేదరికంతో, ఆకలి మంటలతో ఆడుకోవద్దని చంద్రబాబుని హెచ్చరిస్తున్నా. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు అన్ని సంఘాలు ఏకమవుతాం. అమరావతిలోలాగా పెయిడ్ ఆర్టిస్ట్ ఉద్యమం కాదు. విశాఖలో రాజధాని ప్రతిపాదనను వ్యతిరేకిస్తే ఉద్యమం అంటే ఏంటో చూపిస్తాం’ అని స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు. (చదవండి: చంద్రబాబును తిరగనివ్వం) -
‘చంద్రబాబు, పవన్‌కు వారి త్యాగాలు తెలియవా’
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటూ బీసీజీ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నామని ఎస్సీ కమీషన్ చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందే విధంగా బీసీజీ నివేదిక ఉందని, విశాఖలో రాజధాని ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని, రోడ్డు, వైమానిక, సముద్ర మార్గాలు ఉన్నాయని అన్నారు. చంద్రబాబు మోసం చేయడం వల్లే అమరావతి రైతులు రోడ్డున పడ్డారని విమర్శించారు. అభివృద్ది 23 గ్రామాలకే పరిమితం కావాలా... రాష్ట్రమంతా అభివృద్ది చెందకూడదా అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం త్యాగాలు చేసింది పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులే కానీ.. అమరావతి రైతులు కాదని అన్నారు. చంద్రబాబు మాటలను నమ్మి అమరావతి రైతులు మోసపోవద్దని హితవు పలికారు. అమరావతిలో జరుగుతున్న ఆందోళన కృత్రిమమైనదన్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , కమ్యూనిస్టులకు పోలవరం రైతుల త్యాగాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. -
‘చంద్రబాబు తీరు ఆచరిస్తే రాష్ట్ర ప్రగతి అధోగతి’
సాక్షి, విశాఖపట్నం : అమరాతి రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలాంటి అన్యాయం చేయరని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ భరోసానిచ్చారు. అమరావతి నుంచి అసెంబ్లీని మారుస్తానని సీఎం జగన్ చెప్పలేదని అన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రైతుల పేరిట విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. మీడియాపై బాబు దాడులకు తెగబడుతున్నాడని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తీరు ఆచరిస్తే రాష్ట్ర ప్రగతి అధోగతి పాలవ్వడం ఖాయమన్నారు. అమరావతి ఒక్కటే అభివృద్థి చేస్తే సరిపోతుందా.. ఇతర ప్రాంతాల అభివృద్ధి చెందకూడదా అని చంద్రబాబును ప్రశ్నించారు. విశాలంగా ఆలోచించండి అని హితవు పలికారు. విశాఖలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే అమరావతిలో పెట్టాలని చంద్రబాబు చెప్పడంతో పెట్టుబడులు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. చంద్రబాబు మూడు ప్రాంతాల అభివృద్ధికి అనుకూలమా.. కాదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఎజెండాలేని టీడీపీకి అదే గతి పడుతుంది: మంత్రి అవంతి
సాక్షి, విజయవాడ : రాజధాని రైతులు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. శ్రీకనకదుర్గ అమ్మవారిని శుక్రవారం మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని ప్రాంత రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు. భూముల ఇచ్చిన రైతులకు ముఖ్యమంత్రి అండగా ఉంటారని తెలిపారు. మూడు ప్రాంతాలు అభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారని, దీనిలో భాగంగానే రాజధానులు వికేంద్రీకరణ చేపడుతున్నారన్నారు. చంద్రబాబు రెండు కళ్ళ సిద్దాంతం వల్ల తెలంగాణలో నష్టపోయినా ఇంకా మేల్కొలేదని దుయ్యబట్టారు. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని ఏర్పాటు విషయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలతో చంద్రబాబు కనీసం చర్చించలేదని, తాత్కాలిక రాజధాని భవనాల పేరుతో ప్రజల్ని మోసం చేశారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ ప్రజల నాడి తెలుసుకున్న మనిషి అని.. చంద్రబాబులాగా రాత్రి ఒక మాట పగలు ఒక మాట మాట్లాడటం ముఖ్యమంత్రికి చేతకాదని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలకు లోటు లేకుండా ఒక తండ్రి లాగా సమన్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మేడ్ ఇన్ పబ్లిక్ అని ప్రశంసించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న వ్యక్తి సీఎం జగన్ అని ప్రస్తావించారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వ పరిపాలన ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణా విషయంలో రెండుకళ్ల సిద్ధాంతం అవలంభించిన చంద్రబాబు.. ఇప్పుడు 3 ప్రాంతాల అభివృద్ధిని వ్యతిరేకించడం హాస్యాస్పదమన్నారు. రాజధాని అని చెప్పి 5 సంవత్సరాల కాలంలో ఏమి అభివృద్ధి చేశారని.. తాత్కాలిక భవనాలు తప్ప ఏమీ లేదని మండిపడ్డారు.ఎజెండా లేని టీడీపీకి తెలంగాణాలో పట్టిన గతే ఆంధ్రాలో కూడా పట్టబోతుందని వ్యాఖ్యానించారు. -
చంద్రబాబు ఆ పని చేసుంటే..
సాక్షి, తాడేపల్లి : రాజధాని విషయంలో టీడీపీ నాయకులు పెయిడ్ ఆర్టిస్ట్‌లను తీసుకొచ్చి ఉద్యయం చేయిస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజధాని విషయంలో టీడీపీ మీడియా అతిగా చూపిస్తోందని, రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉద్యమాలు చేయిస్తున్నారని విమర్శించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అద్భుతమైన రాజధానిని నిర్మిస్తానని చెప్పి చంద్రబాబు రైతులను మోసం చేశారని మండిపడ్డారు. రాజధానిలో టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, తన బినామీలు కొన్న భూములకు రేట్లు పలకడం కోసం ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు నమ్మబలికారని దుయ్యబట్టారు. రాజధాని ప్రజలను బాబు రెచ్చగొడుతున్నారు చంద్రబాబు రాజధాని పూర్తి చేసి ఉంటే రాజధాని తరలించే పరిస్థితి వచ్చేది కాదని, ఢిల్లీని తలదన్నే విధంగా రాజధాని నిర్మిస్తామని బాబు గ్రాఫిక్స్ చూపించారని మండిపడ్డారు. రాజధాని ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని, శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. రూ. లక్షా 70 వేల కోట్లు అప్పు తెచ్చి కేవలం అయిదు వేల కోట్లు రాజధానికి చంద్రబాబు ఖర్చు చేశారని విమర్శించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి రాజధాని ఆంధ్రప్రదేశ్‌కు అవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని అంటేనే సీఎం జగన్ అమరావతికి మద్దతు తెలిపారని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చందాలు వసూళ్లు చేసి రాజధానిలో ఉద్యమాన్ని అమరావతిలో నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. అదే విధంగా.. మూడు లక్షల కోట్ల అప్పుతో మరొక లక్ష కోట్లు అప్పు చేస్తే రాజధాని నిర్మిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం కావాలని నిలదీశారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన వైజాగ్‌ను రాజధానిగా చేసుకుంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని, సీఎం జగన్ ప్రజా ఆకాంక్షకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గత పాలకులు రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చి కమిషన్లు దండుకున్నారని విమర్శించారు. పార్టీలకు అతీతంగా ప్రజలు మూడు రాజధానులను స్వాగతిస్తున్నారని.. చిరంజీవి, జీవీఎల్, కేఈ, గంటా వంటి వారు జీఎస్ రావు కమిటీని స్వాగతిస్తున్నారని తెలిపారు. ప్రజలు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం కేబినేట్ భేటీ తరువాత వస్తుందని పేర్కొన్నారు. -
‘ఆ భూములు రైతులకు ఇవ్వడమే సముచితం’
సాక్షి, నెల్లూరు : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో వేలాది కటుంబాలు సంతోషిస్తున్నాయని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. ఈ సారి శాసనసభ సమావేశాలు ఫలప్రదమయ్యాయన్నారు. సమావేశాల్లో 16 చట్టాలను ప్రభుత్వం తీసుకుని రావడమే కాకుండా వాటిపై పూర్తి స్థాయిలో చర్చ జరగడం హర్షనీయమన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లను విభజించడం వల్ల వారికి మరింత ప్రయోజనం కలగనుందన్నారు. చంద్రబాబు రాజధానికి 40 వేల ఎకరాలు సేకరించి.. ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కేవలం ఒక వర్గం ప్రయోజనాలను కాపాడేందుకే ప్రయత్నించారని మండిపడ్డారు. రైతుల భూములను బలవంతంగా లాక్కొని, టీడీపీ నేతలకు అప్పగించారని ఆరోపించారు. రైతులకు చెందిన అసైన్మెంట్ భూములను వారికే ఇవ్వడం సముచితమన్నారు. దిశ చట్టాన్ని ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన సంస్కారానికి నిదర్శనమని అమరావతిలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడిండ్‌కు పాల్పడ్డారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో అన్నీ తాత్కాలిక భవనాలు కట్టారని, ప్రజలు కూడా ఆయనను తాత్కాలిక ముఖ్యమంత్రిగా భావించి గత ఎన్నికల్లో తొలగించారని దుయ్యబట్టారు. -
ఆ భయంతోనే చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు
సాక్షి, తాడేపల్లి : మూడు రాజధానుల నిర్ణయంపై జాతీయ స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. మూడు రాజధానులు ఏర్పాటుకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారని.. అధికార వికేంద్రీకరతో అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం అంబటి మాట్లాడుతూ.. అమరావతిని సింగపూర్ చేస్తానని చంద్రబాబు చాలాసార్లు చెప్పినా.. దాని అమలు మాత్రం చేయలేకపోమారని విమర్శించారు. వైఎస్సార్సీపీ చెప్పిన ప్రతి దాన్ని వ్యతిరేకించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. తినడానికి తిండి లేకున్నా చంద్రబాబు పరమాన్న అడిగేడాడని ఎద్దేవా చేశారు. టీడీపీ వాళ్లు ఈ భూములను లాక్కున్నారు మూడు రాజధానులు అంటే మూడు నగరాలు నిర్మించడం కాదనే విషయాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అర్థం చేసుకోవాలని హితవు పలికారు. రాజధాని అంటే పరిపాలన భవనాలు నిర్మంచుకోవడమని.. శాసనసభ, సచివాలయ నిర్మాణం.. ముఖ్యమైన భవనాలు నిర్మించడమని స్పష్టం చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. అమరావతి అనేది స్కాం అని, అమరావతిలో బాబు ఆయన బినామీలు పెద్ద ఎత్తున భూములు కొన్నారని ఆరోపించారు. పేదల భూములు భయపెట్టి టీడీపీ నాయకులు లాక్కున్నారని, ఇప్పుడు టీడీపీ నేతల భూ కుంభకోణం బయటకు వస్తుందన్న భయంతోనే చంద్రబాబు భయపడుతున్నారని దుయ్యబట్టారు. ‘అమరావతి ప్రజా రాజధాని అనేది పెద్ద భూ కుంభకోణం. రాజధానిలో నిరసన కార్యక్రమాలు తీరు, బాష చూడండి. వారు కావాలనే నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు ఉంది. రైతుల ముసుగులో కొంతమంది సీఎం జగన్మోహన్ రెడ్డిపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాంటి వారిని చూస్తూ ఉరుకోము. రాజధాని మారిస్తే రైతులు నష్టపోరు. రైతులు ముసుగులో భూములు కొన్న టీడీపీ నాయకులు మాత్రమే నష్టపోతారు. అన్ని ప్రాంతాలు బాగుండాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు’ని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. -
ప్రభుత్వంపై బురదజల్లేందుకే సమావేశాలు
సాక్షి,అమరావతి: రాష్ట్ర ప్రజలను గ్రాఫిక్స్‌తో ఐదేళ్లు వంచించిన చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి రాజధానిపై అపోహలు సృష్టించి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. బాబు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రాజకీయ పక్షాలు పెద్దగా స్పందించినట్లు కన్పించలేదన్నారు. రాజధాని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని, ఇతర పార్టీలను మాట మాత్రం అడగని చంద్రబాబు ఇప్పుడు రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బాబుకు అప్పుడు కన్పించని ప్రతిపక్షాలు ఓడిన తరువాత కన్పిస్తున్నాయా అని ఎద్దేవా చేశారు. రాజధానిపై అపోహలు సృష్టిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... రాజధాని పేరు ఎత్తితే బాబు సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన అంటారని, బాబుకు, ఆయన వర్గానికి మాత్రం రాజధాని బాగా సంపద సృష్టించిపెట్టిందన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన స్కాములు అన్నీఇన్నీ కావన్నారు. ఇవన్నీ కొత్తగా వచ్చిన తమ ప్రభుత్వం బయటపెట్టే ప్రయత్నంలో ఉందన్నారు. దీంతో బాబుకు, ఆయన బినామీలు తమ దోపిడీ బయటపడుతుందనే భయంతో రాజధాని పర్యటనలు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో ప్రజలు టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించినా జ్ఞానోదయం కాలేదన్నారు. రాష్ట్రంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ఇక్కడి ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించేందుకు పక్క రాష్ట్రాలకు ఆరోగ్య శ్రీ విస్తరించామన్నారు. ప్రజాప్రయోజనాల కోసం ప్రధానిని, కేంద్ర మంత్రులను కలవడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్తున్నారే తప్ప మరే ప్రత్యేక అంశం లేదని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సార్థక నామధేయుడు పవన్ కల్యాణ్ పవన్ పదిరోజుల నుంచి మతం, కులం, ఉల్లిపాయలు గురించి ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. ఆయన సార్థకనామధేయుడని, పేరులోని రెండో భాగం కల్యాణంకు చాలా న్యాయం చేశాడని వ్యాఖ్యానించారు. బాప్టిస్టు మతం తీసుకున్నానని పేర్కొన్న పవన్ తిరుమల వెళ్లినపుడు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. -
బ్లాక్ మార్కెట్లోకి ఉచిత ఇసుక
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనులు పొందిన పలు బడా నిర్మాణ సంస్థలు చిల్లర పనులు చేస్తున్నాయి. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పుతో ఏర్పడిన ఇసుక కొరతను ఇవి సొమ్ము చేసుకుంటున్నాయి. రాజధాని పనులకు ప్రభుత్వం నుంచి ఉచితంగా పొందిన ఇసుకను ఈ సంస్థలు ప్రస్తుత కొరతను ఆసరాగా చేసుకుని తమ వద్ద పెద్ద మొత్తంలో ఉన్న ఇసుకను ఇతర సంస్థలకు అధిక రేట్లకు అమ్ముకుంటున్నాయి. ట్రాక్టరు ఇసుక విజయవాడ, గుంటూరులో రూ.3 వేల నుంచి రూ.5 వేలకు, ఇతర ప్రాంతాలకు లారీ ఇసుకను రూ.20 నుంచి రూ.25 వేలకు (రవాణా చార్జీలతో కలిపి) అమ్ముకుంటున్నాయి. పదిరోజులుగా ఈ నిర్మాణ సంస్థల్లో కొన్ని తమ ప్రధాన పనులను నిలిపివేసి ఇతర నిర్మాణ సంస్థలకు ఇసుక అమ్ముకునే పనిలో పడ్డాయి. దీంతో పదిహేను రోజుల క్రితం వరకు 60–70 అడుగుల ఎత్తులో ఉన్న ఇసుక నిల్వలు ఏ పనులు చేయకుండానే రోజురోజుకీ తరుగుతున్నాయి. దీనిపై అధికారులెవరూ ప్రశ్నించకపోవడంతో విచ్చలవిడిగా ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయి. ఇష్టారాజ్యంగా తవ్వకాలు నిజానికి రాజధాని పరిధిలో నిర్మాణ పనులు పొందిన పలు సంస్థలకు కృష్ణా, గుంటూరు పరిధిలోని నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఉచితంగా ఇసుక తవ్వుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ సంస్థలన్నీ దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన పనులు పొందాయి. వాస్తవంగా ఆ పనులకు అంచనాలు వేసిన సమయంలో ఇసుక ఎంత మేరకు అవసరం అవుతుందో అంతే ఇసుకను ఆ సంస్థలు తీసుకోవాలి. అయితే, ఇవన్నీ ప్రభుత్వ అనుకూల సంస్థలు కావడంతో అవి ఎంత ఇసుక తవ్వుతున్నాయి.. పనులకు ఎంత వాడుతున్నాయి.. ఇతర సంస్థలకు ఎంత అమ్ముకుంటున్నాయి అనే విషయాలను అధికారులు పట్టించుకోలేదు. గతంలోనూ ఇసుక కొరత ఏర్పడినప్పుడు కొన్ని సంస్థలు రెడీమిక్స్ ప్లాంట్లకు అమ్ముకున్నాయి. ఇప్పుడు అనేక సంస్థలు ఇసుకను ఇష్టారీతిన అమ్ముకుంటున్నాయి. ఆ సంస్థలకు ప్రభుత్వం పెద్దఎత్తున బిల్లులు బకాయి పడటంతో కొన్ని సంస్థలు నామమాత్రంగా పనులు చేస్తుంటే మరికొన్ని పూర్తిగా పనులు నిలిపివేసి, బ్లాక్‌లో ఇసుక అమ్ముకునే పనిలో పడ్డాయి. ఫ్రీగా పొంది అధిక రేట్లకు అమ్మకాలు ఇదిలా ఉంటే.. కృష్ణా నదిలో విచ్చలవిడిగా ఇసుక తోడేయడం వలన పర్యావరణం దెబ్బతింటుందని ఈ ప్రాంతానికి చెందిన కొందరు పర్యావరణ ప్రేమికులు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ను ఆశ్రయించారు. దీంతో నెల రోజుల క్రితం నదిలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఎన్జీటీ తీర్పునిచ్చింది. గుంటూరు జిల్లాలోని 37 రీచ్‌లను, కృష్ణా జిల్లాలోని సూరాయిపాలెం, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం రీచ్‌లలో ఇసుక తవ్వకాలను నిలిపివేశారు. మరోవైపు.. ఇసుక కొరత ఉన్నప్పటికీ కొన్ని నిర్మాణ సంస్థలు రాజధాని పనులు పొందిన పలు నిర్మాణ సంస్థల నుంచి అధిక ధరకు ఇసుకను కొని పనులను కొనసాగిస్తున్నాయి. కాగా, ఇసుక అక్రమ అమ్మకాలు తమ ద్టృష్టికి రాలేదని కృష్ణా, గుంటూరు జిల్లాల మైనింగ్ అధికారులు చెప్పారు. రాజధాని పనులను పొందిన సంస్థలపై పర్యవేక్షణ తమ పరిధిలోని అంశం కాదన్నారు. -
సీఎంతో అనిల్ అంబానీ భేటీ
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుతో ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఏడీఏజీ(అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్) చైర్మన్ అనిల్ అంబానీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాలయానికి వచ్చిన అనిల్‌ను సీఎం బయటికొచ్చి సాదరంగా ఆహ్వానించి తన కార్యాలయంలోకి తీసుకెళ్లారు. ఇద్దరూ గంటకుపైగా ఏకాంతంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి నూతన రాజధాని నిర్మాణంపై వారు చర్చించినట్టు, ఈ సందర్భంగా సీఎంను అనిల్ అంబానీ అభినందించినట్టు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజధాని నిర్మాణం చేపట్టడాన్ని అనిల్ అంబానీ ప్రశంసించారని పేర్కొంది. రాష్ట్రంలోని నెల్లూరు, విశాఖ ప్రాంతాల్లో విద్యుత్, మౌలిక వసతుల ప్రాజెక్టులను అనిల్ అంబానీ గ్రూపు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆయన సీఎంను కలవడం చర్చనీయాంశమైంది. రాజధాని నిర్మాణంతోపాటు పలు రాజకీయ అంశాలు తాజా భేటీలో వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. కొద్ది రోజులక్రితం ముఖేష్ అంబానీ సైతం చంద్రబాబును కలవడం తెలిసిందే. అనిల్ అంబానీ సోమవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. -
రాజధాని పనులు డ్రోన్లతో పర్యవేక్షిస్తా: సీఎం
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనులను డ్రోన్లతో పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సహకారంతో డ్రోన్లతో తీసిన చిత్రాలను 15 రోజులకోసారి తనకు చూపాలని ఆదేశించారు. బుధవారం ఆయన సచివాలయంలో సీఆర్డీఏ, ఏడీసీ అధికారులతో సమావేశమై రాజధాని వ్యవహారాలను సమీక్షించారు. 2,500 ఎకరాలిస్తే కాగిత పరిశ్రమ: రాష్ట్రంలోని తీరప్రాంతంలో 2,500 ఎకరాల భూమిని కేటాయిస్తే కాగిత పరిశ్రమ నెలకొల్పుతామని ఆసియా పల్ప్ అండ్ పేపర్ (ఏపీపీ) ప్రతిపాదించింది. ఏపీపీ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. నగదు కొరత నివారణకు రూ.5 వేల కోట్లు పంపండి: నగదు కొరతను నివారించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వెంటనే రూ.5 వేల కోట్ల కరెన్సీ పంపాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. ఆర్బీఐ గవర్నర్, ప్రాంతీయ గవర్నర్లకు కూడా సీఎం లేఖలు రాశారు. ప్రస్తుతం ఏపీలో నగదుకు కొరత ఏర్పడిందని, ఏటీఎంలలో డబ్బులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధాన్యం విక్రయించినా డబ్బులు తీసుకోలేక రైతులు అవస్థ పడుతున్నారని, వెంటనే బ్యాంకులకు నగదు పంపాలని కోరారు. -
రైతులు అత్యాశకు వెళ్లవద్దు: చంద్రబాబు
విజయవాడ: రాజధాని కోసం చేపట్టే భూసమీకరణ, సేకరణ అంశంపై రైతులే నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానికి భూసేకరణ చట్టంతో భూములు సేకరిస్తామని ఆయన తెలిపారు. కోట్ల రూపాయలు చెల్లించాలని రైతులు ఆత్యాశకు వెళ్లోద్దని చంద్రబాబు సలహా ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ విధానమే రైతులకు మేలైనదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని నిర్మాణానికి భూసేకరణ అనివార్యమని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. రైతులు సహకరిస్తేనే రాజధాని నిర్మాణం సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.