
సాక్షి, విశాఖపట్నం : అమరాతి రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎలాంటి అన్యాయం చేయరని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ భరోసానిచ్చారు. అమరావతి నుంచి అసెంబ్లీని మారుస్తానని సీఎం జగన్ చెప్పలేదని అన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రైతుల పేరిట విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. మీడియాపై బాబు దాడులకు తెగబడుతున్నాడని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పవన్ కల‍్యాణ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తీరు ఆచరిస్తే రాష్ట్ర ప్రగతి అధోగతి పాలవ్వడం ఖాయమన్నారు.
అమరావతి ఒక్కటే అభివృద్థి చేస్తే సరిపోతుందా.. ఇతర ప్రాంతాల అభివృద్ధి చెందకూడదా అని చంద్రబాబును ప్రశ్నించారు. విశాలంగా ఆలోచించండి అని హితవు పలికారు. విశాఖలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే అమరావతిలో పెట్టాలని చంద్రబాబు చెప్పడంతో పెట్టుబడులు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. చంద్రబాబు మూడు ప్రాంతాల అభివృద్ధికి అనుకూలమా.. కాదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment