
ముగ్గులతో మహిళల నిరసన
నిరసన తెలపడానికి అనేక మార్గాలుంటాయి. కొంత మంది ఉద్యమబాట పడతారు..మరికొంత మంది మౌనప్రదర్శన చేస్తారు.. ఇంకొంతమంది హింసను ఎన్నుకుంటారు. కానీ.. ఆంధ్రప్రదేశ్ రాజధాని తుళ్లూరు ప్రాంత మహిళలు మాత్రం.. సంక్రాంతి సందర్భంగా ముగ్గులతో తమ నిరసన తెలిపారు.
ముగ్గుల ద్వారా తమ మనసులోని భావాలు చెప్పారు. రాజధానికి భూములు ఇచ్చేది లేదని పెనుమాక, ఉండవల్లి గ్రామస్తులు తెలిపారు. భూములు ఇవ్వం అంటూ రంగురంగుల ముగ్గులతో రాశారు. స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నా, ఏపీ సర్కారు మాత్రం మొండిగా భూసేకరణతోనే ముందుకెళ్తోంది.