
చంద్రబాబు, మంత్రులకు పవన్ కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ చట్టాన్ని ప్రయోగించే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినందుకు సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన కృతజ్ఞతా సందేశాన్ని ప్రజలకు అందించారు.
రాజధాని నిర్మాణంలో భూసేకరణ ఆపే దిశగా అడుగులు వేస్తున్నందుకు రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణ, ఇతర మంత్రివర్గ సభ్యులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా, రైతుల మనోభావాలను సానుభూతితో పరిశీలించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు.
— Pawan Kalyan (@PawanKalyan) August 28, 2015
ముఖ్యంగా రైతుల మనోభావాలను సానుభూతితో పరిశీలించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నార చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు...
— Pawan Kalyan (@PawanKalyan) August 28, 2015