హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అవతల 330 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డును రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం భూసేకరణ ప్రక్రియకు వెంటనే శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు. డీపీఆర్‌ల తయారీలో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. చాలా పనుల్లో డీపీఆర్‌ల పేరుతో ఎడతెగని జాప్యం జరుగుతోందని, అవసరమైతే పనులను ఎక్కువ ప్యాకేజీలుగా విభజించి సత్వరమే డీపీఆర్‌లు రూపొందించాలని సూచించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, లక్ష్మారెడ్డి, ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఆ శాఖ ఈఎన్‌సీలు రవీందర్‌రావు, గణపతిరెడ్డి తదితరులతో సీఎం సమావేశమయ్యారు.
Published Wed, Oct 19 2016 6:54 AM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement