15 నుంచి కొత్త విమాన సర్వీసులు | new airplane service from 15th | Sakshi
Sakshi News home page

15 నుంచి కొత్త విమాన సర్వీసులు

Published Wed, Aug 27 2014 3:48 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

new airplane service from 15th

వెంకోజీపాలెం : విశాఖ విమాన ప్రయాణికులకు శుభవార్త. ఢిల్లీ, ఛండీఘర్, జమ్ము నగరాలకు కొత్త విమాన సర్వీసులు రానున్నాయి. ఈ సర్వీసులు వచ్చే నెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఎస్‌జి-224 విశాఖ-బెంగళూర్-ఢిల్లీ-ఛండీఘర్-జమ్ము విమానం ఉదయం 7.30 గంటలకు బయల్దేరుతుంది. బెంగళూర్ నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని విమాన ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు వరదారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఛండీఘర్‌కు, 3.40 గంటలకు జమ్ముకు చేరుకుంటుందన్నారు. జమ్ములోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులకు ఈ విమానం సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement