ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్) నేత దీపక్ సింఘ్లా నివాసంతో సహా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. పలువురు ఆప్ నేతల సన్నిహితుల నివాసాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. తాజాగా ఈడీ పంజాబ్‌పై కూడా పోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఏకకాలంలో చండీగడ్‌లో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ రాడార్‌లో మరో ఆప్ నేత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ కక్షలతో బీజేపీ తమపై ఈడీ దాడులు చేయిస్తుందని ఆప్ నేతలు మండిపడుతున్నారు.
#WATCH | The Enforcement Directorate is conducting raids at multiple locations in Delhi and NCR among places including the residence of AAP leader Deepak Singla: Sources pic.twitter.com/Q1pJ34Ms7r
— ANI (@ANI) March 27, 2024
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరీంగ్ కేసులో సీఎం ఆరవింద్ కేజ్రీవాల్ అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఆప్ నేతలపై తాజాగా జరుగుతున్న ఈడీ సోదాలతో లిక్కర్ స్కామ్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment