పంజాబ్ చండీగఢ్ యూనివర్సిటీ ఘటనపై బాలీవుడ్ నటుడు సోనూసూద్ స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష‍్టకరమన్నారు. దయచేసి ఎవరూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల‍్లో షేర్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి క‍్లిష్ట సమయంలో మనం వారికి పూర్తి అండగా నిలవాలని ట్విట్టర్ ద్వారా సోనూ సూద్ కోరారు.
'చండీగఢ్ యూనివర్శిటీలో ఇలాంటి ఘటన జరగడం దురదృష‍్టకరం. ఈ కష్ట సమయంలో మనందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ విషయంలో మన సిస‍్టర్స్‌కు అండగా నిలుద్దాం. దయచేసి ఎవరూ కూడా సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలు షేర్ చేయొద్దు. ఇది మనందరికీ పరీక్ష సమయం. బాధ్యత గల పౌరులుగా మన బాధితుల తరఫున నిలుద్దాం' అని ట్విట్టర్‌లో సోనూసూద్ కోరారు.
Something that happened in Chandigarh University is very unfortunate. It’s time for us to stand with our sisters and set an example of a responsible society. These are testing times for us, not for the victims.
— sonu sood (@SonuSood) September 18, 2022
Be responsible 🙏
అసలేం జరిగిందంటే: పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సీటీలోని హాస్టల్‌లో దాదాపు 60 మంది యువతుల ప్రైవేటు వీడియోలను వారితో కలిసి ఉండే మరో యువతి తీయడం సంచలనంగా మారింది. అంతే కాకుండా ఆ వీడియోలు ఆ యువతి స‍్నేహితుల ద్వారా సోషల్ మీడియాలో షేర్ కావడంతో బాధిత యువతులు ఆందోళనకు దిగారు. కొంతమంది బాధితులు ఆత్మహత‍్యకు కూడా యత్నించారు. అయితే ఈ ఘటనను పోలీసులు, యూనివర్శిటీ యాజమాన్యం ఖండించింది. దీనిపై విచారణ జరుగుతోందని పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment