dalith incident
-
హృదయ విదారక ఘటన: చెట్టుకు కట్టేసి దళిత కుటుంబంపై దాడి
చండీగఢ్: పంజాబ్‌లో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. కొంత మంది గ్రామస్తులు దళిత దంపతుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. సదరు కుటుంబాన్ని చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా మైనర్ బాలికను, ఆమె తల్లిని లైంగిక వేధింపులకు గురిచేశారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. కాగా, పంజాబ్‌లోని ఫాజిల్కా గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈ అమానుషాన్ని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ (ఎన్సీఎస్సీ) తీవ్రంగా పరిగణించింది. దీనిపై వెంటనే విచారణ ప్రారంభించి, నిందితులను పట్టుకోవాలని పంజాబ్ పోలీసు అధికారులను ఆదేశించింది. కాగా, విచారణ వివరాలను మెయిల్ ద్వారా తమకు నివేదిక ఇవ్వాలని తెలిపింది. ఈ కేసుపై పోలీసు అధికారులు జాప్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని పంజాబ్ పోలీసులు తెలిపారు. చదవండి: మైనర్‌ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి! -
బీజేపీపై మాయావతి ఫైర్
లక్నో: భారతీయ జనతా పార్టీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. దళితులపై దాడులు జరుగుతున్నా హరియాణాలోని బీజేపీ ప్రభుత్వ మొద్దు నిద్రపోతుందని ఆరోపించారు. ఇద్దరు దళిత చిన్నారులను సజీవ దహనం చేసినటువంటి ఘటనలు జరగడం ఆ ప్రభుత్వానికి సిగ్గు చేటని అన్నారు. హరియాణాలో ఈ వారం ప్రారంభంలో అగ్రవర్ణానికి చెందిన వ్యక్తులు ఓ దళిత కుటుంబాన్ని సజీవ దహనం చేసే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా వారి తల్లి తీవ్ర గాయాలతో ప్రాణాలకోసం కొట్టుమిట్టాడుతోంది. తండ్రికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపట్ల స్పందించేందుకు మాయావతి శుక్రవారం ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇది నిజంగా ఓ దిగ్భ్రాంతిని కలిగించే విషయమని, అది కూడా ఎప్పుడూ పోలీసులు తిరుగుతుండే ప్రాంతంలో ఘటన సంభవించడం విస్మయాన్ని కలిగించిందని మాయావతి అన్నారు. పోలీసులు పక్కన ఉండగానే నలుగురు దళితులను సజీవ దహనం చేసే యత్నం చేశారే వారేం నేరం చేశారని నిలదీశారు. వ్యక్తిగత గౌరవంతో బతుకుతున్న ఆ కుటుంబాన్ని ఓర్వలేకనే ఈ దాడి చేశారని ఆరోపించారు. ఇంకా అక్కడ భూస్వామ్య విధానం కొనసాగుతోందని, దళితులను తమ పొలాల్లో బానిసలుగా పనిచేసేందుకు బలవంత పెడుతున్నారని, అది నచ్చని దళితులు తిరగబడి తమకు తాముగా బతుకుతుంటే భరించలేకే ఇలాంటి దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని చోట్ల కూడా ఇప్పటికీ దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు ఏమాత్రం జరగనివ్వబోమని హామీలు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇన్ని ఘటనలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.