ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేసినా ప్రభుత్వం స్పందించకపోవటం దారుణం అని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.
పశ్చిమ గోదావరి: ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేసినా ప్రభుత్వం స్పందించకపోవటం దారుణం అని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. గూండా యాక్ట్ కింద చింతమనేని ప్రభాకర్ను అరెస్టు చేసి ఆయనను విప్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇసుక మాఫియాను టీడీపీ ప్రభుత్వమే పెంచి పోషిస్తోందని విమర్శించారు. ఏపీ ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్.. వెంకయ్యనాయుడును ప్రశ్నించక పోవటం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్కు బాధ్యత ఉంటే సీపీఐతో కలిసి పోరాడవచ్చునని ఆయన సూచించారు.