'నా తప్పుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా..' | chinthamaneni statement on vanajakshi case | Sakshi
Sakshi News home page

'నా తప్పుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా..'

Published Thu, Sep 24 2015 3:46 PM | Last Updated on Thu, Apr 4 2019 12:50 PM

'నా తప్పుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా..' - Sakshi

'నా తప్పుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా..'

కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడి కేసులో విచారణ నిమిత్తం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం సబ్ కలెక్టరేట్కు వచ్చారు.  విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో దాడి ఘటనపై జేసీ శర్మ కమిటీ విచారణ ప్రారంభించింది.  ముందుగా వనజాక్షి ...త్రిసభ్య కమిటీ ఎదుట తన వాదనలు వినిపించారు.

ఈ సందర్భంగా  చింతమనేని ప్రభాకర్  మాట్లాడుతూ ఈ ఘటనలో తన తప్పుందని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. వనజాక్షి సరిహద్దులు దాటి ఇసుక ర్యాంపులోకి వచ్చారని చింతమనేని అన్నారు. ఆమెపై తాను ఎటువంటి దాడి చేయలేదని ఆయన పేర్కొన్నారు. డ్వాక్రా మహిళల పట్ల వనజాక్షి దురుసు ప్రవర్తనను కమిటీకి వివరించినట్లు ఎమ్మెల్యే చింతమనేని తెలిపారు. తన పై తప్పుడు ప్రచారం చేయడం వెనుక చాలా కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement