హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను వెంటనే విప్ పదవి నుంచి తొలగించడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. పెన్షన్దారులను ఉద్దేశించి ప్రభాకర్ అసభ్యంగా మాట్లాడారని కల్పన ఆరోపించారు. ప్రభాకర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా లేక టీడీపీ విధానమా? అని ప్రశ్నించారు. ఆయన వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కల్పన డిమాండ్ చేశారు.