
సాక్షి, కర్నూలు : కర్నూలుకు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కర్నూలులోని తన కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు లాంటి చిల్లర నాయకుడిని చూడలేదన్నారు. తన పబ్బం గడుపుకునేందుకు మతాల మధ్య చిచ్చుపెడుతున్నాడని విమర్శించారు. క్రైస్తవులు తలకాయలు తీసే టెర్రరిస్టులు కాదని హితవు చెప్పారు. రాజకీయం కోసం మతాల మధ్య చిచ్చుపెట్టడం మంచి పరిణామం కాదని సుధాకర్‌బాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment