ఆ వ్యవస్థ లేకుండా చేస్తున్నారు
అందులో భాగమే పవన్ వ్యాఖ్యలు
వైఎస్ జగన్ వలంటీర్ల కోసం ప్రత్యేక శాఖనే ఏర్పాటు చేశారు
దానికో మంత్రి ఉన్నారు.. ఇప్పుడూ ఉన్నారు
వారి నియామకాలపైనా స్పష్టమైన ఆదేశాలు
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్‌బాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ లేకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వలంటీర్లను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయకుండా తప్పించుకునేందుకే కూటమి నేతలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
వలంటీర్లకు సంబంధించి ఎలాంటి వ్యవస్థ లేదని, గత ప్రభుత్వం వారిని మోసం చేసిందని, దాని వల్ల నిర్ణయం తీసుకోలేకపోతున్నామని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చెప్పడమూ ఈ కుట్రలో భాగమేనన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను పూర్తి పారదర్శకంగా ఇంటి గడప వద్దే అందించడం కోసం 50 ఇళ్లకు ఒక వలంటీర్ నియామకానికి ప్రత్యేక శాఖనే ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆ శాఖ బాధ్యతను ఒక మంత్రికి అప్పగించిందని వెల్లడించారు. ఇప్పుడు కూడా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి ఆ శాఖను కేటాయించారన్న విషయం తెలుసుకోవాలన్నారు.
వలంటీర్ల నియామకంపైనా వైఎస్ జగన్ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, పవన్ ఆ జీవోలు తెప్పించుకుని చూడాలని చెప్పారు. అంత పక్కాగా వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తే, దానిపై పవన్ వెటకారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వలంటీర్ల వ్యవస్థపై టీడీపీకి, జనసేన పార్టీకి సదభిప్రాయం లేదనడానికి గతంలో చంద్రబాబు, పవన్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ప్రజలకు వలంటీర్లు అందించిన సేవలు ఎనలేనివని, కోవిడ్ బాధితులను వారి కుటుంబ సభ్యులే పట్టించుకోకపోతే వీరు ప్రాణా లకు తెగించి సేవలందించారని, అలాంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పవన్ క్షమాపణలు చెప్పాలని అన్నారు.
ఎన్నికల్లో వలంటీర్లకు కూటమి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వారిన తిరిగి విధుల్లోకి తీసుకొని, గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. వలంటీర్లకు ఏ హామీ ఇవ్వలేదని కూటమి నేతలు అనుకొంటే.. తిరుమల శ్రీవారి ఎదుట ప్రమాణం చేయాలని సుధాకర్‌బాబు సవాల్ చేశారు.
నేడు వలంటీర్ల ఆవేదన సదస్సు
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచి్చన హామీ మేరకు వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుతోపాటు గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచాలని కోరుతూ ఏఐవైఎఫ్ అనుబంధ ఏపీ రాష్ట్ర వలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో వలంటీర్ల ఆవేదన సదస్సు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరుచూరి రాజేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్లకు ఉద్యోగ భద్రత కలి్పంచాలని, ఐదు నెలల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలన్న అంశంపై సదస్సులో చర్చించనున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment