సాక్షి, గుంటూరు: వైఎస్ వివేకానందరెడ్డి హత్య టీడీపీ హయాంలోనే జరిగిందని, ఈ కేసులో చంద్రబాబే తొలి ముద్దాయి అని, ఈ కేసులో భాదితుల్ని నిందితులుగా చిత్రీకరించే యత్నం జరుగుతోందని, అన్నింటికి మించి సీఎం జగన్‌పై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగమే ఇదంతా అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
వివేకా హత్య కేసు ద్వారా సీఎం జగన్‌పై రాజకీయ కుట్ర జరుగుతోంది. జగన్ వ్యక్తిత్వం తక్కువ చేసే కుట్ర చేస్తున్నారు. కుట్రలో భాగంగానే వివేకా హత్య కేసులో జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. దస్తగిరి బయటకు వచ్చి హత్య చేసిన విధానం చెప్పడం ఏంటి?. గొడ్డలితో నరికానని చెప్తుంటే సునీత మౌనంగా ఎందుకు ఉన్నారు?. సునీత భర్తకు ఈ హత్యలో సంబంధం ఉందని ఆరోపించారు సుధాకర్‌బాబు.
వివేకా హత్య కేసులో చంద్రబాబు తొలి ముద్దాయి. టీడీపీ హయాంలోనే వివేకా హత్య జరిగింది. అప్పుడెందుకు అవినాష్, భాస్కర్‌రెడ్డిల పేర్లు రాలేదు. వాళ్లిద్దరూ బాధితులు. ఇక్కడ బాధితుల్ని ముద్దాయిలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రం నిధుల సేకరణ కోసం ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లడం సాధారణం. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని సుధాకర్‌బాబు మండిపడ్డారు.
చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడు
వివేకా కేసు పరిణామాలపై ఎమ్మెల్యే సుధాకర్‌బాబు బుధవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. వివేకా కేసు ద్వారా చంద్రబాబు తన కుటిల రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారాయన. ‘‘పేదలకు మేలు చేయకుండా చంద్రబాబు అడ్డు తగులుతున్నాడు. చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. సంక్షేమ పథకాలు బాబుకు అవహేళనగా కనిపిస్తున్నాయి. మీ పాలనలో పేదలకు ఎందుకు మేలు చేయలేదని చంద్రబాబును ఎమ్మెల్యే సుధాకర్ బాబు నిలదీశారు.
పారదర్శక పాలన సాగుతుంటే చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. మాతో యుద్ధం చేయడానికి చంద్రబాబుకు యుద్ధసామగ్రి లేదు. మాతో పోరాడేందుకు చంద్రబాబుకు ఒక్క అంశం కూడా లేదు. చంద్రబాబు వస్తే కరువు వచ్చింది. చంద్రబాబు వస్తే చెరువులు ఎండిపోయాయి. పైగా సీఎం జగన్ పై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ప్రజలకు సీఎం జగన్ మంచి చేస్తుంటే అడ్డు తగులుతున్నారు. రోజూ అబద్దాలు వల్లెవేయడమే పచ్చ గ్యాంగ్ పనిగా పెట్టుకుంది. చంద్రబాబుకు దమ్ముంటే ఇళ్ల స్థలాల దగ్గర సెల్ఫీ దిగాలి.
చంద్రబాబు చీకటి యుద్దాన్ని నమ్ముకున్నాడు
వివేకా కేసు ద్వారా సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని తగ్గించే కుట్ర చేస్తున్నాడు. చంద్రబాబు ఏపీకి పట్టిన పిశాచి. అందుకే చీకటి యుద్ధాన్ని నమ్ముకున్నాడు. అవినాష్ రెడ్డిని చంద్రబాబు టార్గెట్ చేశారు. సీఎం జగన్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నాడు. తప్పు చేయని తమ్ముడికి(అవినాష్‌రెడ్డిని ఉద్దేశించి..) అండగా నిలబడటం తప్పా ?. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయమనడం తప్పా ?. వివేకా కేసులో ఆదినారాయణ రెడ్డి, బిటెక్ రవి పాత్రపై దర్యాప్తు చేయాలి. వివేకా హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాలి అని ఎమ్మెల్యే సుధాకర్ బాబు దర్యాప్తు సంస్థను డిమాండ్ చేశారు.
వ్యవస్థలను వాడుకోవడంలో చంద్రబాబే ఓ కేస్ స్టడీ. చంద్రబాబు తన చుట్టూ పది మందికి దోచిపెట్టడం ఓ కేస్ స్టడీగా తీసుకోవచ్చు. లోకేష్ రాజకీయాల్లో విఫలం కావడం ఓ కేస్ స్టడీ. అలాగే.. లోకేష్ కు ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా ఓ కేస్ స్టడీ. ఎన్నో నేరాలు చేసి తప్పించుకున్న చంద్రబాబే ఓ కేస్ స్టడీ. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు కూడా ఓ కేస్ స్టడీ. ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చిన చంద్రబాబు ఓ కేస్ స్టడీ. మంగళగిరిలో కొడుకును గెలిపించుకోలేకపోవడం ఓ కేస్ స్టడీ.
ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో నడుస్తోంది. హార్బర్లు, పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయడమే చంద్రబాబు పని. పేదల అభ్యున్నతికి సీఎం జగన్ పాటుపడుతుంటే.. బటన్ల ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు హేళన చేస్తున్నాడు. పేదలకు మేలు చేయకుండా అడ్డుపడుతున్నాడు. చంద్రబాబు తన కుటిల రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నాడు. చంద్రబాబు హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కానీ, సీఎం వైఎస్ జగన్ ప్రతి గ్రామంలో అభివృద్ధి చేస్తున్నారు. నాడు - నేడు పేరుతో ఎంతో మందికి మేలు చేస్తున్నారు అని ఎమ్మెల్యే సుధాకర్ బాబు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment