‘గుండ్లకమ్మ’ పాపం గత ప్రభుత్వానిదే | Santanuthalapadu MLA Sudhakarbabu on Gundlakamma Reservoir | Sakshi
Sakshi News home page

‘గుండ్లకమ్మ’ పాపం గత ప్రభుత్వానిదే

Published Sun, Dec 10 2023 5:15 AM | Last Updated on Sun, Dec 10 2023 2:41 PM

Santanuthalapadu MLA Sudhakarbabu on Gundlakamma Reservoir - Sakshi

మద్దిపాడు: గుండ్లకమ్మ రిజర్వాయర్‌ నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేసి.. సుందరీకరణ పేరు­తో నిధులు బొక్కేయడానికే ప్రాధాన్యత ఇవ్వడమే ప్రస్తుత దుస్థితికి కారణమని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు అన్నారు. గుండ్లకమ్మ రిజర్వాయర్‌ వద్ద విరిగిపోయిన రెండో గేటును శనివారం పరిశీలించిన ఆయన రిజర్వా­యర్‌ ఎస్‌ఈ ఆబూదలి, ఈఈ నాగమురళీ­మోహన్‌­తో మాట్లాడారు.

రిజర్వాయర్‌­లోని మిగి­లిన గేట్ల పరి­స్థితిపై ఆరా తీశారు. అనంతరం మీడి­యాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో గుండ్లకమ్మ రిజ­ర్వా­యర్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2014–19 కాలంలో వర్షాలు లేక రిజర్వాయర్‌లో నీరు అతి తక్కువగా ఉండటంతో నాయకులు రిజర్వాయర్‌కు వచ్చిన నిర్వహణ నిధులతో ఉపయోగం లేని పనులు చేసి నిధులను తమ ఖాతాల్లో వేసుకు­న్నా­రని విమర్శించారు.

రిజర్వాయర్‌ గేటు గత సంవ­త్సరం విరిగిపోయినప్పుడు గేట్ల మరమ్మతులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.90 లక్షలు మంజూరు చేశారని, ఈ ఏడాది రిజర్వాయర్‌ గేట్లు పూర్తిగా మరమ్మతు చేయించేందుకు రూ.9 కోట్లు విడుదల చేశారని చెప్పారు. 

లెగ్మెంట్లు కొట్టుకుపోవడం దురదృష్టకరం
మిచాంగ్‌ తుపాను కారణంగా గుండ్లకమ్మ జలా­శయ­ంలోకి నీరు పుష్కలంగా వస్తుండటంతో నిల్వ చేసేందుకు అధికారులు ప్రయత్నించారని.. దురదృష్టవశాత్తు 2వ గేటు లెగ్మెంట్లు నీటి ఉధృతికి కొట్టుకు­పోయాయని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు. రిజ­ర్వాయర్‌లో సాగర్‌ నుంచి ఒక టీఎంసీ నీరు విడు­­దల చేయించడానికి ప్రయత్నిస్తామని చెప్పా­రు. గేట్ల మరమ్మతులపై సీఎంవో, నీటిపారు­దల శాఖ అధి­­కారులతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే హుటాహు­టిన తాడేపల్లి వెళ్లారు. అంతకుముందు జల వన­రుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో ఫోన్‌లో మాట్లాడారు.

కాగా.. మండల వైఎస్సార్‌­సీపీ అధ్య­క్షుడు మండవ అప్పారావు, ఎంపీపీ వాకా అరుణ­కోటి­రెడ్డి, నాయకులు రిజర్వాయర్‌ను సందర్శించా­రు. అనంతరం మీడియాతో మాట్లా­డుతూ.. గత ప్రభు­త్వం రిజర్వాయర్‌కు ఒరగబెట్టిందేమీ లేద­న్నా­రు. రిజర్వాయర్‌ నిర్వహణ కోసం గత ప్రభు­త్వంలో మంజూరైన నిధులను నాయకులు తినేశార­న్నారు. టీడీపీ  హయాంలో ఎన్ని టీఎంసీల నీరు సాగర్‌ నుంచి గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు తీసు­కొచ్చారో చెప్పా­­లని డిమాండ్‌ చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌­రైతుల పక్షపాతి అని, అందుకే రిజర్వా­యర్‌ నిర్వహణకు రూ.9 కోట్లు మంజూరు చేశార­న్నారు.

టీడీపీ నాయకుల హడావుడి
గుండ్లకమ్మ రిజర్వాయర్‌ గేటు విరిగిందన్న విష­యం తెలుసుకున్న టీడీపీ నాయకులు శనివారం ఉదయం రిజర్వాయర్‌ వద్దకు చేరుకుని కొంతసేపు హడావుడి చేశారు. రిజర్వాయర్‌ నిర్వహించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, డోలా బాలవీరాంజనే­య­స్వామి, మాజీ ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్, టీడీపీ నాయకుడు ముత్తుముల అశోక్‌రెడ్డి రిజర్వాయర్‌ను సందర్శించిన వారిలో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement