పులి వస్తోంది | Puli the 19th century movie release on 24th | Sakshi
Sakshi News home page

పులి వస్తోంది

Published Sat, Feb 11 2023 1:44 AM | Last Updated on Sat, Feb 11 2023 1:44 AM

Puli the 19th century movie release on 24th - Sakshi

సిజు విల్సన్‌ లీడ్‌ రోల్‌లో కాయాదు లోహర్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన మలయాళ చిత్రం పాథోన్ పథం నూట్టాండు’. వినయన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత సెప్టెంబరులో విడుదలైంది. ఈ చిత్రాన్ని ‘పులి.. ది పంతొమ్మిదవ సెంచురీ’ పేరుతో సీహెచ్‌ సుధాకర్‌ బాబు తెలుగులో ఈ నెల 24న విడుదల చేస్తున్నారు.

‘‘యాక్షన్‌ పీరియాడికల్‌ డ్రామాగా రూపొందిన చిత్రమిది. తెలుగు టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తెలుగులోనూ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సీహెచ్‌ సుధాకర్‌ బాబు. అనూప్‌ మీనన్, పూనమ్‌ బజ్వా ఇతర పాత్రలు చేసిన ఈ చిత్రానికి సహనిర్మాత: ఎస్‌.కె. రామచంద్ర నాయక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement