హైదరాబాద్ : రాయలసీమ, ఆంధ్ర ప్రజల మధ్య వివాదాలు చెలరేగితే అందుకు సీఎం చంద్రబాబుదే పూర్తి బాధ్యత అని ఎమ్మెల్సీ సుధాకర్ బాబు హెచ్చరించారు. రాయలసీమపై చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడటం దారుణమని ఆయన అన్నారు. రాజధాని విషయంలో కర్నూలుకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. అందుకే మండలి నుంచి వాకౌట్ చేసినట్లు ఎమ్మెల్సీ సుధాకర్ బాబు చెప్పారు.
అంతకుముందు ఏపీ శాసనమండలిలో ఏపీ నూతన రాజధాని ఏర్పాటుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఏపీ కొత్త రాజధాని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటనపై పలువురు రాయలసీమ నాయకులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. అందులోభాగంగా ఎమ్మెల్సీ సుధాకర్ బాబు మండలి సభ నుంచ వాకౌట్ చేశారు.