రాజశేఖర్ రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి అయితే.. చంద్రబాబు, లోకేష్‌ను కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిపించులేకపోయాడు. ఇలాంటి కొడుకు పుట్టినందుకు చంద్రబాబు మథనపడుతున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చర్రితలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఏడాది ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించబోతున్నారని తెలిపారు. రుణాలు అన్ని మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు.. మాట తప్పారని ఆరోపించారు. జగన్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల దెబ్బలకు చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క ప్రజాదరణ కార్యక్రమం అయినా ప్రవేశ పెట్టారా అని ప్రశ్నించారు సుధాకర్ బాబు.