
సాక్షి, విజయవాడ: చంద్రబాబుకు, తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు, చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి బడుగు, బలహీన వర్గ ప్రజలు ఏకం కాబోతున్నారని తెలిపారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సువర్ణ యుగం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్నారని సుధాకర్ తెలిపారు. వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిని, ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. చంద్రబాబు నిరంకుశ, నియంత పాలనను ఎండగడతామన్నారు. రాష్ట్రంలో జరిగిన దోపిడీని బట్టబయలు చేస్తామన్నారు.