
సాక్షి, విజయవాడ : నాలుగేళ్లుగా రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని, చంద్రబాబులాంటి వ్యక్తులు దళితులను కించపరుస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ నేతలు మేరుగ నాగార్జున, సుధాకర్ బాబు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించాలని, దీనికోసం రాష్ట్రపతి, ప్రధానమంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. చంద్రబాబు గతంలో...దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నారని, రాష్ట్రవ్యాప్తంగా దళితుల భూములను టీడీపీ నేతలు లాక్కుంటున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మార్చొద్దని, దళితులకు వైఎస్‌ఆర్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment