
వైఎస్సార్‌సీపీ నేత సుధాకర్ బాబు
సాక్షి, విజయవాడ : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎవరు కుట్ర పన్నారో చెప్పాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నటుడు శివాజి టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని మండిపడ్డారు. గుంటూరులో తమ అధినేతపై రెక్కి జరిగిందన్న ఈ పెయిడ్ ఆర్టిస్ట్.. మళ్లీ దాడి జరగబోతుందని తెలిపాడని, ఈ పెయిడ్ ఆర్టిస్ట్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. 2010 ఉపఎన్నికల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు నాందేడ్ ప్రాంతంలో పర్యటించారని, అప్పుడు చేసిన ధర్నాపై కేసు నమోదు అయిందన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్, టీడీపీ ఆడిన మహా డ్రామాపై.. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నారు. ఇది కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసని, బెయిల్ తీసుకుంటే ఇది కేసే కాదన్నారు. కానీ ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ఎదో జరిగినట్లు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని విమర్శించారు. గరుడ ఆపరేషన్‌ను ఎవరు ఆపరేట్ చేస్తున్నారో ఈ పెయిడ్ ఆర్టిస్ట్ చెప్పాలన్నారు. ప్రతిసారి రాష్ట్రంపై కుట్ర జరుగుతుందని చెబుతుంటే నిఘా వర్గాలు ఏమి చేస్తున్నాయని సుధాకర్ బాబు ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు ఓ రాజకీయ వెన్నుపోటు దారుడని విమర్శించారు. జాతీయ మీడియా సర్వేలో 43 శాతం మంది వైఎస్ జగనే సీఎం అని చెబుతుంటే దానిని నుంచి ప్రజలను దృష్టిని మళ్ళించడానికే ఈ పెయిడ్ అర్టిస్టు హడావుడని తెలిపారు. ఐటీని చంద్రబాబే అభివృద్ధి చేశారని చెబుతున్న ఈ పెయిడ్ ఆర్టిస్ట్.. ఈ విషయం హైదరాబాద్‌లో చెబితే అసలు విషయం తెలుస్తుందన్నారు. ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ఎందుకు ప్రతినెల అమెరికా వెళ్తున్నాడో సమాధానం చెప్పాలన్నారు. ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ఓ కులగజ్జి అని, ఇలా ప్రవర్తిస్తేనే సొంత ఊరునుంచి తరిమికొట్టారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment