
సాక్షి, విజయవాడ : టీడీపీ పాలనలో ప్రజలకే కాదని, చివరికి అమ్మవారికి కూడా భద్రత కరువైందని వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దుర్గగుడిలో అర్థరాత్రి తాంత్రిక పూజలు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నా మళ్లీ విచారణ కమిటీ ఏమిటని సుధాకర్ బాబు సూటిగా ప్రశ్నించారు. వీడియో క్లిప్పింగ్స్ స్పష్టంగా ఉంటే విచారణ కమిటీనా అని అన్నారు.
‘టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఈ పూజలు లోకేష్ కి రాజయోగం కోసం చేయించారు అని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటివరకు సీఎం ఎందుకు నోరు మెదపలేదు. ఇది మీ ఇంట్లో విషయం కాదు, కోట్లాది మంది హిందువుల మత విశ్వాసం దెబ్బతింది. గుళ్లో జరిగిన విషయాలు అన్ని ప్రజలకు వివరించాలి. అమ్మ వారి నగలు నిజమైనవేనా అన్న అనుమానం వస్తుంది. మీరు నియమించిన కమిటీకి విలువ లేదు. దేవినేని ఉమా మీరు సూటిగా సమాధానం చెప్పండి, ఒక స్థానిక ఎంపీని మాట్లాడనీయరా, చిత్రవతికి మీ హయాం లో ఇచ్చిన నిధులు ఎన్ని?. ఉమా నోరు అదుపులో పెట్టుకో. అడ్డగోలుగా విమర్శించద్దు. నీ అవినీతి విజయవాడలో, మైలవరం లో ఎవరిని అడిగినా చెబుతారు. పులివెందులకి నీళ్లు ఇచ్చే విషయంలో మీ హయాంలో ఎంత ఖర్చు పెట్టారో, వైఎస్‌ఆర్ హయాంలో ఎంత పెట్టారో లెక్కలు బయటపెట్టండి.’ అని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment