tantrik
-
లక్నో: జ్వరం తగ్గించడానికి ఇంత దారుణమా?
-
జ్వరం తగ్గించడానికి ఇంత దారుణమా?
లక్నో : జ్వరం తగ్గించటానికి ఓ మాంత్రికుడు మహిళపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఇష్టం వచ్చినట్లు కొడుతూ.. కత్తితో గుచ్చుతూ దారుణంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫిరోజాబాద్ జిల్లా గదైయా మొహల్లాకు చెందిన హర్షిణీ అనే మహిళకు నెలరోజుల క్రితం విపరీతంగా జ్వరం వచ్చింది. దీంతో ఆమెను దగ్గరలోని రాహుల్ భగత్ అనే మాంత్రికుడి దగ్గరకు తీసుకుపోయాడు భర్త పోక్పాల్. సదరు మాంత్రికుడు వైద్యం పేరుతో ఆమెపై దాడికి దిగాడు. ( ‘కబీర్ సింగ్’ చూసి.. అమ్మాయిలకు ఎర!) జుట్టు పట్టుకుని విచక్షణా రహితంగా చితకబాదటమే కాకుండా పదునైన కత్తితో వీపుపై ఇష్టం వచ్చినట్లు పొడిచాడు. ఆమె ఎంత బ్రతిమాలుతున్నా పట్టించుకోకుండా క్రూరంగా ప్రవర్తించాడు. చివరకు ఓ రసాయనం ద్వారా ఆమెను స్పృహ కోల్పోయేలా చేశాడు. పోక్పాల్ చెల్లెలి భర్త ఆకాశ్ ఈ ఘోరాన్నంతా తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. బాధితురాలి కుమారుడు దీన్ని తన మేనమామ దినేశ్‌కు పంపాడు. దీంతో ఈ సంఘటన వైరల్‌గా మారి వెలుగులోకి వచ్చింది. ( 9 హత్యల కేసు: ఫోరెన్సిక్ ల్యాబ్‌కు శాంపిళ్లు ) -
అర్థరాతి వేళ క్షుద్ర పూజల కలకలం
సాక్షి, కాకినాడ : అర్ధరాత్రి అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ ఒక్క సారిగా అరుపులు వినిపించాయి. ఏదో తెలియని శబ్దాలు, కేకలు పెద్ద ఎత్తున వినిపించాయి.. అంతే చుట్టు పక్కల వారంత ఒక్కసారి నిద్ర లేచారు. మంత్రాలు, అరుపులు ఇంకా ఎక్కువవడంతో హడలిపోయారు. అంతా ఒక్క చోటికి చేరుకొని శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గమనించారు. పక్కనే ఉన్న ఇంట్లో నుంచి మంత్రాలు వినిపిస్తున్నాయని గుర్తించారు. గుంపుగా కలిసి ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా గది అంతా పసుపు, నిమ్మకాయలతో నిండిపోయింది. ఇంటి యజమానియే క్షుద్రపూజలు చేశాడు. స్థానికులు అంతా దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని రాయుడుపాలెంలో జరిగింది. క్షుద్రపూలకు పాల్పడిన వ్యక్తిని షేక్ మహ్మద్‌గా గుర్తించారు. స్థానికులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు షేక్ మహ్మద్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. -
తాంత్రికుడి కోరిక తీర్చలేదని భార్యను..
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తాంత్రికుడి మాయలో పడిన ఓ వ్యక్తి సొంత భార్యను హత్య చేశాడు. అలీగఢ్‌కు చెందిన మాన్‌పాల్ అనే వ్యక్తి సంత్‌దాస్ దుర్గాదాస్ అనే తాంత్రికుడి మాయలో పడి ఏం చెబితే అది చేసేవాడు. మూడనమ్మకాల పిచ్చితో ఇప్పటికే ఎంతో డబ్బులు అతడికి సమర్పించుకున్నాడు. మాన్‌పాల్ పూర్తిగా తన ఆధీనంలోకి వచ్చాడని నిర్ధారణ చేసుకున్న తాంత్రికుడు తన వక్రబుద్ధిని చూపెట్టాడు. ‘నీ భార్యతో ఓసారి గడపాలని ఉంది’ అంటూ మాన్‌పాల్‌తో చెప్పాడు. దీనికి ఏమాత్రం సంకోచించని అతడు భార్యకు ఈ విషయాన్ని చెప్పాడు. భర్త మాటలతో షాకైన ఆమె దీనికి ఒప్పుకోలేదు. దీంతో ఆమెను చంపేయాలని మాన్‌పాల్ నిర్ణయించుకున్నాడు. కుటుంబం వృద్ధి చెందాలంటే కొన్ని పూజలు చేయాలని మాయమాటలు చెప్పి భార్యను శుక్రవారం సమీపంలోని నది వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ తాంత్రికుడితో కలిసి భార్యను నీళ్లలో ముంచి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. తన తల్లిని హత్య చేస్తుండగా చూసిన కుమారుడు గ్రామానికి వెళ్లి స్థానికులకు సమాచారమిచ్చాడు. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని నిందితులిద్దరినీ పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మృతురాలి సోదరుడు రాజేశ్‌కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తన తల్లిని కాపాడాలని ప్రయత్నించిన కుమారుడిని కూడా మాన్‌పాల్ చంపడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. ఇక సంత్‌దాస్ దుర్గాదాస్‌కు నేర చరిత్ర ఉందని, గతంలోనూ కొందరిని ఇలాగే మోసం చేసినట్లు పేర్కొన్నారు. -
‘నా కొడుకు నరబలికి అనుమతి ఇవ్వండి’
బెగుసరాయి : కంప్యూటర్ యుగంలోనూ పాతకాలపు మూఢనమ్మకాలు ఏ మాత్రం తగ్గడంలేదు. చేతబడి, బాణామతి అంటూ నేటి కాలపు మనుషులు కూడా తమ మతి తప్పినట్లు ప్రవర్తిస్తున్నారు. నరబలికి సైతం సై అంటున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్ముతూ సొంత కొడుకునే బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు బీహార్‌కు చెందిన ఓ తాంత్రికుడు. తన కొడుకు బలికి అనుమతి ఇవ్వాలంటూ ఏకంగా అధికారులకు వినతి పత్రం కూడా సమర్పించాడు. వివరాలు.. బీహార్‌లోని బెగుసరాయి జిల్లా మోహన్పూర్-పహాడ్‌పూర్ గ్రామ వాసి, తాంత్రికుడైన సురేంద్రప్రసాద్ సింగ్, ఇంజినీర్ అయిన తన కొడుకును బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. తన ఆరాధ్య దేవతను ప్రసన్నం చేసుకునేందుకు నరబలికి అనుమతించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ లేఖ, సురేంద్ర ప్రసాద్ ఓ విలేకరితో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో సురేంద్రప్రసాద్ సింగ్ మాట్లాడుతూ.. ‘ నరబలి నేరం కాదు. ఇంజనీర్ అయిన నా కొడుకును మా ఆరాధ్య దేవత అయిన కామాఖ్యదేవికి బలి ఇవ్వాలనుకుంటున్నాను. ఇదే నా మొదటి నరబలి. నా ఆరాధ్య దేవత గుడికి ఆర్థిక సాయం చేయడానికి నా కొడుకు నిరాకరించాడు. అందుకే బలి ఇవ్వాలనుకుంటున్నాను. నా కొడుకు రావణాసూరుడు లాంటి వాడు. నరబలికి అనుమతి ఇవ్వండి’ అంటూ అధికారులకు విన్నవించాడు. అయితే అలాంటి దరఖాస్తు తమకు అందలేదని, తాంత్రికుడి కోసం గాలిస్తున్నామని సంబంధిత అధికారి తెలిపారు. నరబలి చట్టవిరుద్ధమని, త్వరలోనే తాంత్రికుడిని పట్టుకుంటామని తెలిపారు. కాగా సురేంద్రప్రసాద్ సింగ్ ఓ పిచ్చోడని, ప్రచారం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. -
ఉత్తరప్రదేశ్‌లో దారుణం
-
మంత్రగాడి మాటలతో కన్న కూతుర్నే..
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. మంత్రగాడి మాయ మాటలతో ఓ జంట తమ కన్న కూతుర్నే పొట్టనబెట్టుకుంది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్, మోరదబాద్‌లోని చౌదర్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఆనంద్‌పాల్ ఆరేళ్ల కూతురు తార పోషకాహార లోపంతో బాధపడుతోంది. దీంతో దంపతులిద్దరు వ్యాధి నయం కోసం మంత్రగాడిని సంప్రదించారు. అయితే తారను చంపి ఇంట్లో పూడ్చి పెట్టాలని అతడు సూచించాడు. అలా చేస్తే తరువాత జన్మించబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని తెలిపాడు. దీనిని నమ్మిని ఆ దంపతులు కన్న కూతురు గొంతు నులిమి ఇంట్లో పూడ్చి పెట్టారు. తార కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగు పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగు చూసింది. ఇంట్లో పూడ్చిపెట్టిన గొయ్యి నుంచి పోలీసులు తారా బాడీని వెలికితీశారు. తారతో తన తల్లి కలిసి ఉండలేకపోయిందని, అందుకే మాంత్రికుడి సూచనలతో చంపి నట్టింట్లో పూడ్చిపెట్టారని ఆ చిన్నారి బామ్మ మీడియాకు తెలిపారు. ఆ చిన్నారిని తిప్పని ఆసుపత్రి లేదని, ఇవ్వని మందు లేదని ఎంతకీ ఆమె వ్యాధి నయం కాలేదన్నారు. తన మనవడు కూడా ఈ వ్యాదితోనే బాధపడుతున్నాడని పేర్కొన్నారు. ఇక పోస్ట్‌మార్డం రిపోర్టులో ఆ చిన్నారి ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. కేసునమోదు చేసుకున్న పోలీసులు ఆ దంపతులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
సంతానం కోసం మాంత్రికుడి దగ్గరకు వెళితే..
హౌరా: ఇటీవల దొంగ బాబాలు, మంత్ర గాళ్లు ఎక్కువైపోతున్నారు. ఎన్ని సంఘటనలు చోటుచేసుకుంటున్నా జనాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. తమ ఇబ్బందులను తొలగిస్తాడని ఆశ్రమానికి వెళితే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరా లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హౌరా ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయ దంపతులిద్దరు సంతానం కోసమని భూపతినగర్‌లో ఉన్న రెహమత్ అలీ షేక్ అనే మాంత్రికుడి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ తన అనుచరులతో భర్తను స్థంబానికి కట్టేసి బాబా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె వద్ద ఉన్న ఆభరణాలను, డబ్బును తీసుకొని వదిలేశారు. విషయం బయటకు చెప్పకూడదని మాంత్రికుడు షేక్ వారిని బెదిరించారు. ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన దంపతులు సమీప పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆశ్రమానికి వెళ్లి మాంత్రికుడు రెహమత్ అలీ షేక్‌ను అరెస్ట్ చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి మోస పోవడం గమనార్హం. -
పెళ్లి కోసం మంత్రగాడి దగ్గరికి వెళ్తే...
లక్నో: పెళ్లి కోసం మంత్రగాడి దగ్గరికి వెళ్తే.. ప్రాణాల మీదకే వచ్చింది. అయితే వైద్యులు సకాలంలో స్పందించటంతో ప్రాణాలు దక్కాయి. వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్ ద్వివేది(42)కి వివాహం కాలేదు. పైగా కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ తరుణంలో బంధువుల సలహామేరకు ఓ మాంత్రికుడిని ఆశ్రయించాడు. తాను చెప్పినట్లు వింటే సమస్యలన్నీ దూరమైపోతాయని మాంత్రికుడు అజయ్‌ను నమ్మబలికాడు. సెల్ ఫోన్ బ్యాటరీ, పదునైన ఇనుప ముక్కలు, గాజు ముక్కల తినాలంటూ అజయ్‌కు మాంత్రికుడు సూచించాడు. అజయ్ కూడా గుడ్డిగా ఆ వస్తువులన్ని తినేశాడు. ఆపై కడుపు నొప్పితో బాధపడుతున్న అతన్ని బంధువులు ఆస్పత్రిలో చేర్పించారు. స్కానింగ్‌లో కడుపులో ఇనుప ముక్కలు కనిపించటంతో వైద్యులు నిర్ఘాంత పోయారు. వెంటనే అతనికి ఆపరేషన్ చేసి ఆ చెత్తనంతా తొలగించారు. అజయ్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని.. దయచేసి ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మొద్దంటూ వైద్యులు సూచిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సదరు మాంత్రికుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి పొట్ట నుంచి బయటపడ్డ వస్తువులు.. అజయ్(ఇన్సెట్లో) -
పాలకమండలి నోరు నొక్కిన ముఖ్యమంత్రి
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తాంత్రిక పూజలపై నమోదైన కేసును మూసివేసేందుకు రంగం సిద్ధమైంది. అర్థరాత్రి దుర్గగుడిలో అసలు పూజలే జరగలేదని నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఇవ్వనుంది. అయితే నివేదికపై వస్తున్న లీకులపై తాంత్రిక పూజలు జరిగాయని ఆరోపణలు చేసిన ఆలయ పాలకమండలి సభ్యులు మౌనం వహిస్తున్నారు. తాంత్రిక పూజల వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలకమండలి సభ్యులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై పాలకమండలి సభ్యులు నోరు మెదపవద్దని ఇప్పటికే చంద్రబాబు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. అసలేం జరిగింది.. దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయనే ఆరోపణలు రాష్ట్ర ప్రజలను షాక్‌కు గురి చేశాయి. స్వయంగా ముఖ్యమంత్రి కుటుంబానికి ఈ ఘటనతో సంబంధముందనే మరో ఆరోపణ మరింత విస్తుపోయేలా చేసింది. అయితే ఈవో సూర్యకుమారి ...ఆలయంలో పూజలు జరగలేదని వివరణ ఇస్తే...పాలకమండలి సభ్యులు మాత్రం తాంత్రిక పూజలు జరిగినట్లు పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టి.. రెండు రోజుల నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. పూజలు జరిగాయని తేలితే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. సీన్ రివర్స్.. రెండు రోజుల పాటు తాంత్రిక పూజలపై విచారణ చేయాల్సిన కమిటీ ఒక రోజుతోనే విచారణను ముగించింది. అంతేకాదు అర్థరాత్రి ఆలయంలో అసలు పూజలే జరగలేదనే లీకులు ఇచ్చింది. వాస్తవానికి నిర్ధారణ కమిటీ సభ్యులు నివేదికను ఆదివారం కమిషనర్‌కు సమర్పించాల్సివుంది. అయితే, నివేదికపై ముందుగానే కమిటీ సభ్యులు లీకులు ఇవ్వడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అమ్మవారి ముందు అలాంటి పూజలు చేసే ధైర్యం ఎవరికీ లేదని విచారణ కమిటీలోని సభ్యుడు ఒకరు అన్నట్లు తెలిసింది. దీంతో కేసును మూసేసేందుకు కమిటీని ప్రభుత్వం పావుగా వాడుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రపతి పేరు.. మరోవైపు దుర్గ గుడిలో జరిగిన తాంత్రిక పూజల వ్యవహారంపై చర్చలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేరును వాడినట్లు సమాచారం. అయితే, ఏ విషయంపై రాష్ట్రపతి పేరును తీసుకువచ్చరన్న దానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం చేసింది చిన్న అపచారం కాదు కనకదుర్గమ్మ ఉగ్రరూపంలో ఇంద్రకీలాదిపై స్వయంభూగా వెలసింది. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలను తన చల్లని చూపులతో కటాక్షించాలని అమ్మవారిని వేడుకుంటూ మూలవిరాట్‌ను కళాన్యాసంతో పరిపుష్టం చేశారు. స్మార్త వైదిక ఆగమం ప్రకారం కళాన్యాసంలో 10 విభాగాల కింద మొత్తం 96 కళలు ఉంటాయి. ఈ కళలను అమ్మవారి మూలవిరాట్‌లో పరిపుష్టం చేసి, కవచం తొడిగారు. ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలు మహిమాన్వితమైన ఆ కవచాన్ని కదిపి ఘోర అపరాధానికి పాల్పడ్డారు. -
‘ఉమా నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకో’
సాక్షి, విజయవాడ : టీడీపీ పాలనలో ప్రజలకే కాదని, చివరికి అమ్మవారికి కూడా భద్రత కరువైందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దుర్గగుడిలో అర్థరాత్రి తాంత్రిక పూజలు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నా మళ్లీ విచారణ కమిటీ ఏమిటని సుధాకర్ బాబు సూటిగా ప్రశ్నించారు. వీడియో క్లిప్పింగ్స్ స్పష్టంగా ఉంటే విచారణ కమిటీనా అని అన్నారు. ‘టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఈ పూజలు లోకేష్ కి రాజయోగం కోసం చేయించారు అని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటివరకు సీఎం ఎందుకు నోరు మెదపలేదు. ఇది మీ ఇంట్లో విషయం కాదు, కోట్లాది మంది హిందువుల మత విశ్వాసం దెబ్బతింది. గుళ్లో జరిగిన విషయాలు అన్ని ప్రజలకు వివరించాలి. అమ్మ వారి నగలు నిజమైనవేనా అన్న అనుమానం వస్తుంది. మీరు నియమించిన కమిటీకి విలువ లేదు. దేవినేని ఉమా మీరు సూటిగా సమాధానం చెప్పండి, ఒక స్థానిక ఎంపీని మాట్లాడనీయరా, చిత్రవతికి మీ హయాం లో ఇచ్చిన నిధులు ఎన్ని?. ఉమా నోరు అదుపులో పెట్టుకో. అడ్డగోలుగా విమర్శించద్దు. నీ అవినీతి విజయవాడలో, మైలవరం లో ఎవరిని అడిగినా చెబుతారు. పులివెందులకి నీళ్లు ఇచ్చే విషయంలో మీ హయాంలో ఎంత ఖర్చు పెట్టారో, వైఎస్ఆర్ హయాంలో ఎంత పెట్టారో లెక్కలు బయటపెట్టండి.’ అని డిమాండ్ చేశారు. -
నా మీద చాలామంది కోపంగా ఉన్నారు..
సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదని ఆలయ ఈవో సూర్యకుమారి తెలిపారు. తాంత్రిక పూజల వ్యవహారంపై ఆమె బుధవారం ప్రెస్‌మీట్ లో మాట్లాడుతూ.. తాంత్రిక పూజలు అంటే ఏంటో తనకు తెలియదని, దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నామన్నారు. అలాగే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఈవో తెలిపారు. గత నెల 26వ తేదీ రాత్రి సాధారణంగా చేసే అలంకారమే జరిగిందని, అందుకు సంబంధించిన సామాగ్రిని మాత్రమే లోనికి వెళ్లిందని ఆమె పేర్కొన్నారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా 14మందికి నోటీసులు ఇచ్చామన్నారు. అలాగే సీసీ టీవీ ఫుటేజ్ ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈవో స్పష్టం చేశారు. బదిలీకి సంబంధించి తనకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని ఆమె తెలిపారు. నా మీద చాలామంది కోపంగా ఉన్నారు.. ‘గుడిలో నా మీద చాలామందికి కోపం ఉంది. పాలకమండలికి, నాకు మధ్య కొంత దూరం ఉంది. పాలకమండలి కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ వింగ్ ప్రారంభించాం. గుడిలో వంద గ్రూపులు ఉన్నాయి. నా మీద కొంత ఒత్తిడి వచ్చింది. కానీ నిబంధనల ప్రకారమే పని చేశాం. బయోమెట్రిక్ పెట్టడం, పని సక్రమంగా చేయడం, కొత్త పూజలు ప్రవేశ పెట్టడం కూడా కొందరికి నచ్చలేదు. హుండీ 20శాతం, టిక్కెట్ ఆదాయం 80శాతం పెరిగింది. సుమారు 130 కోట్ల వరకు డిపాజిట్ లు వున్నాయి. ఒక్క కార్తీకమాసంలో కోటి రూపాయల ఆదాయం పెరిగింది. ఇక గుడిలో పూజలకు సంబంధించి ఎస్పీఎఫ్, దేవాదాయ సిబ్బంది, ఓపిడిఎస్ స్టాఫ్ ను ఆలయ ఈఈ వెంకటేశ్వర రాజు విచారిస్తున్నారు. పాలకమండలి కూడా రెండు రోజుల కిందటే సీసీ టీవీ ఫుటేజీ చూసింది. బయటి వ్యక్తులు ఎలా వచ్చారని పాలకమండలి సభ్యులు ప్రశ్నించారు.’ అని అన్నారు. కాగా ఈ వివాదం నేపథ్యంలో ఈవో సూర్యకుమారిపై వేటు పడింది. ఆమెను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. సూర్యకుమారి స్థానంలో ఇన్చార్జ్ ఈవోగా రామచంద్ర మోహన్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సింహాచలం దేవాలయ ఈవోగా ఉన్న ఆయనను వెంటనే రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. -
మంచితనంగా ఇంటికి పిలిచి దారుణం
అమృత్సర్: తమకు ఉన్న పరిచయం మేరకు మంచితనంగా ఓ గృహిణిని ఇంటికి పిలిపించి ఆమె ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేశారు. ఇంటికొచ్చిన స్నేహితురాలిపై దాడి చేసి స్పృహలేనిపరిస్థితుల్లో చనిపోయిందనుకొని ఓ కాలువలో పడేశారు. అదృష్టం కొద్ది ఆమె తిరిగి స్పృహలోకి రావడంతో నేరుగా ఇంటికెళ్లి భర్తకు చెప్పగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే పంజాబ్ లోని అమృత్ సర్ లో గుర్మీత్ కౌర్ అనే ఓ మహిళ ఉంది. ఆమెకు బాజ్ సింగ్, ఫతే అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరిని తీసుకొని తమ ఇంటికి రావాల్సిందిగా మంజిత్ కౌర్ మహిళ ఆహ్వానించింది. ఆమె ఇంటికి రాగానే మంజిత్ కుమారుడు మహిందర్ జిత్, వాళ్లింట్లో పనిచేసే హరిజిందర్ అనే ఇద్దరు వారిపై దాడి చేశారు. ఆమెను కొట్టి చనిపోయిందని కాలువలో పడేసి పిల్లలను ఎత్తుకెళ్లారు. అందులో ఫతేకు ఎనిమిది నెలలు కాగా బాజ్‌కు ఎనిమిదేళ్లు. వీరిని నేరుగా తీసుకెళ్లిన వారు క్షుద్రపూజలకోసం అమ్మేశారు. పోలీసులు నిర్వహించిన గాలింపు చర్యల్లో ఈ విషయం తెలిసింది. బాజ్‌ను రూ.50వేలకు దీరా బాబా నానక్ అనే తాంత్రికుడికి అమ్మినట్లు తెలిసింది. అయితే, బాజ్ తిరగబడినంత పనిచేయడంతో విషయం బయటకు పొక్కుతుందని భయంతో అతడిని హత్య చేసి ఓ ఊరి వద్ద పడేశారు. నేరాన్ని వారు స్వయంగా అంగీకరించడంతో ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. -
కీలెరిగిన మాంత్రికుడు
జీవన కాలమ్ ఈ మధ్య విజయ్ మాల్యా ఆర్థికమయిన అవినీతి మీద ఛానళ్లు, పత్రికలు హోరు పెడుతున్నాయి. కోట్ల రూపాయలు బ్యాంకులకూ, కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ సిబ్బందికీ ఎగవేసిన కథలు పుంఖానుపుంఖాలుగా వెలుగులోకి వస్తున్నాయి. తీరా విజయ్ మాల్యాను ఈ దేశం విడిచిపోవడానికి చక్కగా అవకాశం కల్పించాక- దొంగలు పడిన ఆరు నెలలకి ఈ బ్యాంకులు సుప్రీం కోర్టుకెక్కాయని చానళ్లు చెబుతున్నాయి. ‘అవినీతి’కి అంతులేని గ్లామర్ ఉంది. ఈ దేశం వీరప్పన్ గురించి మాట్లాడుకున్నంత రుచిగా పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి గురించి మాట్టాడుకుని ఉండదు. ఇన్ని రోజులు చానళ్లలో మాట్లాడుతున్నవారూ, ప్రభుత్వ ప్రతినిధులూ - సర్వే సర్వత్రా విజయ్ మాల్యాకు అధికార, బ్యాంకు యంత్రాంగం నుంచి అమోఘమైన సహకారం లభించిందనేవారే కానీ ఏ ఒక్కరూ కారణం చెప్పలేదు. నిజానికి చెప్పలేరు. ఆయా కీలక స్థానాలలో ఉన్న అధికారులు, బ్యాంకు ఆఫీసర్లను కూడగట్టుకోవడానికి శృంగారరాయుడు మాల్యాగారి దగ్గర ఎన్నో దగ్గర తోవలున్నాయి. 9000 కోట్ల పై చిలుకు మాల్యా అరాచకానికి పరోక్షంగా తోడ్పడిన- షరతుల్నీ, పద్ధతుల్నీ, రూల్సునీ తుంగలోకి తొక్కి - నిన్న మొన్నటిదాకా షష్టిపూర్తిని కూడా కోట్ల ఖర్చుతో జరుపుకున్న మాల్యాకు సహాయ పడడానికి వెనుక గల రహస్యం ఏమిటి? మాల్యాగారి చుట్టూ డజన్ల సీతాకోకచిలుకల్ని చూస్తూ ఉంటాం. మాల్యాగారెప్పుడు కనీసం ఒక్కరు లేదా ఇద్దరు అందమయిన అమ్మాయిల భుజాల మీద చెయ్యి వేసుకుని దర్శనమిస్తూంటారు. వారు ఆయనకి పబ్లిగ్గా ముద్దులు కురిపిస్తూంటారు - చూపరులకి ఈర్ష్య కలిగేటట్టుగా. అతి తరచుగా వారు ఇచ్చే విందుల్లో ఎన్ని సుఖాలు దాగి ఉన్నాయో ఈ దేశంలో పెద్దలందరికీ - కనీసం మనస్సుల్లోనయినా తెలుసు. బ్యాంకులు రూల్సు మరిచిపోయినా, అధికారులు కోట్ల రుణాలకి సంతకాలు చేసినా - ఏ రాత్రి, ఏ సుఖం నీడలో జరిగిందో ఆ భగవంతుడికెరుక. అవినీతి వీధిన పడ్డాక అందరూ ‘మడి’ కట్టుకుని మాట్లాడుతున్నారు కానీ - మన యంత్రాంగంలో తేలుకుట్టిన దొంగలు చాలామంది ఉన్నారు. సుఖానికీ, డబ్బుకీ ఆ దుర్మార్గం ఉంది. 28వ ఏట కోట్లు విలువ చేసే వ్యాపారానికి వారుసుడైన శృంగార పురుషుడు - వ్యాపారానికి బలమైన దగ్గర తోవలు కనిపెట్టడంలో ఆశ్చర్యం లేదు. ఇది చానళ్లలో చెప్పుకునే, ఒప్పుకునే విషయం కాదు. ‘అవినీతి’ని చట్టం పొలిమేరల్లో నిలపగలిగే తెలివైన వాటాదారులూ ఈ గూడుపుఠాణీలో భాగం కావడం ఆశ్చర్యం కాదు. చాలాయేళ్ల కిందట - తమిళనాడులో ఓ జాతీయ బ్యాంకు చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ గారికి సినీమావారంటే మోజు ఉండేది. సినీమా సభల్లో తారల సరసన తరచూ కనిపించేవారు - పదిమందికీ తెలిసింది అంతమట్టుకే. అధికారాన్ని అతి ఉదారంగా దుర్వినియోగం చేసి - చీకటి ఒప్పందాలకు - సుఖం పెట్టుబడిగా దన్నుగా నిలిచి, వీధిన పడి జైలుకు వెళ్లారు. 1996 ప్రాంతాలలో అరెస్టయ్యారు. రెండు నెలల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. సీబీఐ కోర్టు వారికి దరిమిలాను పదేళ్లు జైలు శిక్షని విధించింది. మనదేశంలో న్యాయ వ్యవస్థ ధర్మమా అంటూ తన 78వ ఏట వరకూ ఈ కోర్టు కేసులు సాగుతూనే ఉన్నాయి. ఆ రోజుల్లోనే కట్టడం ప్రారంభమైన పది అంతస్తుల భవనం ఇప్పటికీ అదే స్థితిలో, చెన్నై జెమిని సెంటర్లో దర్శనమిస్తుంది. అయితే ఇది కేవలం చిన్న చీమ కథ. మాల్యా గారిది జాతీయ స్థాయి గోమఠేశ్వరుడి కథ. మొదటి నుంచీ ‘కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్’గా రొమాంటిక్ జీవనాన్ని కెమేరాల ముందు ఆవిష్కరించే శృంగార వ్యాపారి - ఆ శృంగారాన్ని ‘ఎర’గా చేయగలిగితే వ్యాపారానికి ఎల్లలు చెరిగిపోతాయని ఎరిగి, చెరిపేసిన కథని కాస్త ఆలస్యంగా దేశం వింటోంది. ఆయా దశలలో పెద్దల చీకటి కథల్లో అసలు రహస్యం ఉంది. కాని అక్కడంతా చీకటి. కన్నుపొడుచుకున్నా వినిపించడమే కానీ ఏమీ కనిపించదు. నా మట్టుకు విజయ్ మాల్యా కీలెరిగిన మాంత్రికుడు. ఈ దేశానికి విస్కీ మత్తునీ, గుర్రాల పందాలనీ, కారు రేసుల్నీ , క్రికెట్ ఆటల జూదాన్నీ పంచిన తెలివైన వ్యాపారి - కీలక స్థానాలలో ఉన్న వ్యక్తుల బలహీనతలని - ఏ మనిషినయినా తల్లకిందులు చేయగల ‘ఆకర్షణ’ని పంచడాన్ని ప్రారంభిస్తే దేవుడు కూడా ఆ ఉచ్చు నుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే దేవుడు సాక్షాత్తు మోహినీ అవతారంలో ఆ పని చేశాడు కనుక. అయితే ఆనాడు ఆకర్షితులని రాక్షసులన్నాం. ఇప్పుడు చట్టాన్ని అటకెక్కించిన ‘అధికార, బ్యాంకింగు యంత్రాంగం’ అనుకుంటే మర్యాదగా ఉంటుంది. - గొల్లపూడి మారుతీరావు