
సాక్షి, కాకినాడ : అర్ధరాత్రి అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ ఒక్క సారిగా అరుపులు వినిపించాయి. ఏదో తెలియని శబ్దాలు, కేకలు పెద్ద ఎత్తున వినిపించాయి.. అంతే చుట్టు పక్కల వారంత ఒక్కసారి నిద్ర లేచారు. మంత్రాలు, అరుపులు ఇంకా ఎక్కువవడంతో హడలిపోయారు. అంతా ఒక్క చోటికి చేరుకొని శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గమనించారు. పక్కనే ఉన్న ఇంట్లో నుంచి మంత్రాలు వినిపిస్తున్నాయని గుర్తించారు. గుంపుగా కలిసి ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా గది అంతా పసుపు, నిమ్మకాయలతో నిండిపోయింది. ఇంటి యజమానియే క్షుద్రపూజలు చేశాడు. స్థానికులు అంతా దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని రాయుడుపాలెంలో జరిగింది. క్షుద్రపూలకు పాల్పడిన వ్యక్తిని షేక్ మహ‍్మద్‌గా గుర్తించారు. స్థానికులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు షేక్ మహ్మద్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment