జ్వరం తగ్గించడానికి ఇంత దారుణమా? | Tantrik Mercilessly Strikes Women Over High Fever | Sakshi
Sakshi News home page

మహిళపై మాంత్రికుడి అమానుషం

Published Sat, May 30 2020 2:43 PM | Last Updated on Sat, May 30 2020 3:02 PM

Tantrik Mercilessly Strikes Women Over High Fever - Sakshi

వీడియో దృశ్యాలు

లక్నో : జ్వరం తగ్గించటానికి ఓ మాంత్రికుడు మహిళపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఇష్టం వచ్చినట్లు కొడుతూ.. కత్తితో గుచ్చుతూ దారుణంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫిరోజాబాద్‌ జిల్లా గదైయా మొహల్లాకు చెందిన హర్షిణీ అనే మహిళకు నెలరోజుల క్రితం విపరీతంగా జ్వరం వచ్చింది. దీంతో ఆమెను దగ్గరలోని రాహుల్‌ భగత్‌ అనే మాంత్రికుడి దగ్గరకు తీసుకుపోయాడు భర్త పోక్‌పాల్‌. సదరు మాంత్రికుడు వైద్యం పేరుతో ఆమెపై దాడికి దిగాడు. ( ‘కబీర్‌ సింగ్‌’ చూసి.. అమ్మాయిలకు ఎర!)

జుట్టు పట్టుకుని విచక్షణా రహితంగా చితకబాదటమే కాకుండా పదునైన కత్తితో వీపుపై ఇష్టం వచ్చినట్లు పొడిచాడు. ఆమె ఎంత బ్రతిమాలుతున్నా పట్టించుకోకుండా క్రూరంగా ప్రవర్తించాడు. చివరకు ఓ రసాయనం ద్వారా ఆమెను స్పృహ కోల్పోయేలా చేశాడు. పోక్‌పాల్‌ చెల్లెలి భర్త ఆకాశ్‌ ఈ ఘోరాన్నంతా తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. బాధితురాలి కుమారుడు దీన్ని తన మేనమామ దినేశ్‌కు పంపాడు. దీంతో ఈ సంఘటన వైరల్‌గా మారి వెలుగులోకి వచ్చింది. ( 9 హత్యల కేసు: ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు శాంపిళ్లు )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement