మంత్రగాడి మాటలతో కన్న కూతుర్నే.. | Tantrik Told Couple to Bury Her Daughter Body At Home | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 7 2018 10:52 AM | Last Updated on Tue, Aug 7 2018 1:47 PM

Tantrik Told Couple to Bury Her Daughter Body At Home - Sakshi

చిన్నారిని పూడ్చిపెట్టిన గొయ్యి

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. మంత్రగాడి మాయ మాటలతో ఓ జంట తమ కన్న కూతుర్నే పొట్టనబెట్టుకుంది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌, మోరదబాద్‌లోని చౌదర్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఆనంద్‌పాల్‌ ఆరేళ్ల కూతురు తార పోషకాహార లోపంతో బాధపడుతోంది. దీంతో దంపతులిద్దరు వ్యాధి నయం కోసం మంత్రగాడిని సంప్రదించారు. అయితే తారను చంపి ఇంట్లో పూడ్చి పెట్టాలని అతడు సూచించాడు. అలా చేస్తే తరువాత జన్మించబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని తెలిపాడు. దీనిని నమ్మిని ఆ దంపతులు కన్న కూతురు గొంతు నులిమి ఇంట్లో పూడ్చి పెట్టారు. తార కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగు పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగు చూసింది. ఇంట్లో పూడ్చిపెట్టిన గొయ్యి నుంచి పోలీసులు తారా బాడీని వెలికితీశారు.

తారతో తన తల్లి కలిసి ఉండలేకపోయిందని, అందుకే మాంత్రికుడి సూచనలతో చంపి నట్టింట్లో పూడ్చిపెట్టారని ఆ చిన్నారి బామ్మ మీడియాకు తెలిపారు. ఆ చిన్నారిని తిప్పని ఆసుపత్రి లేదని, ఇవ్వని మందు లేదని ఎంతకీ ఆమె వ్యాధి నయం కాలేదన్నారు. తన మనవడు కూడా ఈ వ్యాదితోనే బాధపడుతున్నాడని పేర్కొన్నారు. ఇక పోస్ట్‌మార్డం రిపోర్టులో ఆ చిన్నారి ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. కేసునమోదు చేసుకున్న పోలీసులు ఆ దంపతులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement