వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై టీడీపీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు ఆగ్రహాం వ్యక్తం చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై తెలుగుదేశంపార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు శనివారం కర్నూలులో ఆగ్రహాం వ్యక్తం చేశారు. నోరు అదుపులోక పెట్టుకుని మాట్లాడితే మంచిదని ఆయన గాలి ముద్దుకృష్ణమనాయుడుకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ల కాలంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. సీఎం పదవికే మచ్చ తెచ్చిన వ్యక్తి చంద్రబాబు అని సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ బెయిల్కు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఆయన స్ఫష్టం చేశారు. జగన్ బయట ఉంటే చంద్రబాబుకు వణుకుపుడుతోందని, అందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సుధాకర్ బాబు ఆరోపించారు.