
సాక్షి, పులివెందుల: డాక్టర్ ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియలు కార్యక్రమం ముగిసింది. అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. సమాధుల తోట వద్దకు అంత్యక్రియలు నిర్వహించారు. కడసారి పేదల డాక్టర్‌ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. అంతిమ యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు.
కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆయన సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు. ఈయనకు పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు.
Comments
Please login to add a commentAdd a comment