సుఖ శాంతులు వెల్లివిరియాలి | Y.S Jagan Mohan Reddy make Christmas celebrations in C.S church | Sakshi
Sakshi News home page

సుఖ శాంతులు వెల్లివిరియాలి

Published Thu, Dec 26 2013 2:06 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM

పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో మాట్లాడుతున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి - Sakshi

పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో మాట్లాడుతున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

పులివెందుల, న్యూస్‌లైన్: ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో శాంతి సౌఖ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరికీ ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ జగన్ చిన్నాన్నలు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, సతీమణి వైఎస్ భారతిరెడ్డి తదితరులు కూడా ప్రసంగించారు.
 
 సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు :
 క్రిస్మస్ పండుగ సందర్భంగా బుధవారం వైఎస్ కుటుంబ సభ్యులు సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
 
 బుధవారం ఉదయాన్నే కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సతీమణి భారతిరెడ్డి, కుమార్తెలు హర్ష,వర్ష, వైఎస్ జగన్ తల్లి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ మేనేత్త కమలమ్మ, చిన్నాన్నలు వైఎస్ వివేకానందరెడ్డి, సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, సతీమణి పద్మావతమ్మ, వైఎస్ మనోహర్‌రెడ్డి, సతీమణి ప్రమీలమ్మ,  వైఎస్‌ఆర్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, వైఎస్ జార్జిరెడ్డి కుమారులు వైఎస్ అనిల్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, జగన్ మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి ఈసీ సుగుణమ్మలతోపాటు పలువురు వైఎస్ కుటుంబ సభ్యులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా వైఎస్ జగన్, వైఎస్ వివేకా, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, పురుషోత్తమరెడ్డి తదితరులు క్రిస్మస్ కేక్‌ను చర్చిలో కట్ చేశారు. చర్చి ఫాస్టర్ ఐజాక్ వరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.
 
 జీసెస్ చారిటీస్‌లో షర్మిల :
 పులివెందులలోని జీసెస్ చారిటీస్‌లో చిన్నారుల మధ్య షర్మిల, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలిలు క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు. జీసెస్ చారిటీస్‌లోని చర్చిలో షర్మిల కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
 
 చాలాసేపు షర్మిల చిన్నారులతో గడిపారు. ఫాస్టర్ మృత్యుంజయ, జీసెస్ చారిటీస్ నిర్వాహకురాలు లిల్లీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement