
ప్రజా సమస్యలను పరిష్కరిస్తా
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో పలువురు ఆయన్ను కలిసి తమ సమస్యలు విన్నవించారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో పలువురు ఆయన్ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. దీనికి స్పందించిన ఎంపీ వెంటనే పరిష్కారమయ్యే వాటికి అధికారులకు ఫోన్‌చేసి వాటి పరిష్కారానికి కృషి చేశారు. అంతకుముందు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు.
అధికారం రాలేదని ఎవరూ నిరుత్సాహపడవద్దని.. భవిష్యత్ తమదేనని భరోసా ఇచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నందున అక్కడక్కడ చిన్నపాటి సమస్యలు ఎదురైనా వాటిని దీటుగా ఎదుర్కొవాలన్నారు. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని వారికి సూచించారు. అలాగే నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలోపేతం చేయాలన్నారు.