Y.S Avinash reddy
-
కువైట్‌లో ఘనంగా వై.ఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు
కడప పార్లమెంట్ సభ్యులు వై.ఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు కువైట్‌లో ఘనంగా నిర్వహించారు. కువైట్ వైఎస్ అవినాష్ రెడ్డి యూత్ అసోషియేషన్ నాయకులు, ముల్లా జిలాన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ సిపీ గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు పాల్గొన్నారు. వీరితో పాటు కువైట్ వైఎస్ఆర్ సిపీ నాయకులు సహా అవినాష్ అభిమానులు బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అవినాష్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ అవినాష్ రెడ్డికి ప్రవాసాంధ్రులంటే ప్రత్యేక అభిమానమని, వాళ్ల సమస్యలు ఏవైనా ఆయన దృష్టికి వెళితే వెంటనే స్పందించి పరిష్కరించడానికి కృషి చేస్తారని గోవిందు నాగరాజు పేర్కొన్నారు. కరోనా కష్ట కాలంలో గల్ఫ్ లో ఉన్న ప్రవాసాంధ్రులను ఆదుకున్న గొప్ప వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి మైనార్టీ నాయకులు షేక్ రహమతుల్లా కొనియాడారు. -
‘ఉక్కు’ సంకల్పం
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఉక్కు’పరిశ్రమ ఏర్పాటుపై తాత్సారం చేయొద్దు. విభజన చట్టాన్ని అమలు చేయండి. కడప గడపలో ‘సెయిల్’ నేతృత్వంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలి. నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు కృషి చేయండి. తద్వారా వెనుకబడిన ప్రాంతాన్ని ఆదుకోండి’ అని వైఎస్సార్సీపీ పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలు కేంద్ర ఆర్థిక, హోంశాఖ మంత్రులు అరుణ్‌జైట్లీ, రాజనాథ్సింగ్లకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సమస్యలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వీరు కేంద్రమంత్రులను ఆదివారం ఢిల్లీలో కలిశారు. వైఎస్సార్ జిల్లాలో సెయిల్ నేతృత్వంలో ఉక్కుపరిశ్రమ నెలకొల్పాలని కోరారు. రాష్ట్ర విభజన చట్టంలో రూపొందించడంతో వెనుకబడ్డ ప్రాంతానికి ఉక్కుపరిశ్రమ వస్తుందనే ఆశలో ప్రజానీకం ఉన్నారని తెలిపారు. వారి ఆకాంక్షలను నెరవేర్చాలని సెయిల్ సూచనల మేరకు రాయితీలు అందించి కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని విన్నవించారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అందుకోసం సకాలంలో నీటి వనరులను ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే విషయాన్ని పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. రాయలసీమ కేంద్రంగా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే వెనుకబడ్డ ప్రాంతంలో ఉపాధికి మార్గం చూపినట్లుందని వారు వివరించారు. కేంద్ర మంత్రులను కలిసిన విషయాన్ని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి సాక్షికి ఫోన్ ద్వారా ధ్రువీకరించారు. -
నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్
పులివెందుల : వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పులివెందులకు రానున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరి బుధవారం ఉదయం ఎర్రగుంట్లకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఇడుపులపాయకు వెళ్లి మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో గడపనున్నారు. అనంతరం ఇటీవల చక్రాయపేట మండలం దేవరగట్టుపల్లెలో గుండె పోటుతో మృతి చెందిన వైఎస్ఆర్ సీపీ మండల యూత్ కన్వీనర్ వెంకటసుబ్బయ్య సోదరుడు నాగభూషణం కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం వైఎస్ జగన్ పులివెందులకు చేరుకుంటారు. 25వ తేదీన (గురువారం) ఉదయం పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం నుంచి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. -
ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి రక్తదానం చేయడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పులివెందుల : ప్రజల సమస్యలపట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేసే నాయకుడు వైఎస్ జగనన్న అని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బాకరాపురంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కేక్‌ను కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నేత వైఎస్ జగనన్న అని, ప్రజలపట్ల ఆయనకున్న సేవాభావాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పేదలకు ప్రతి ఒక్కరు తమ చేతనైనంత సహాయం చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, కౌన్సిలర్లు, తొండూరు మండల నాయకుడు బండి రామమునిరెడ్డి, లింగాల కొండారెడ్డి, కసనూరు పరమేశ్వరరెడ్డి, ఎంపీటీసీ విశ్వనాథరెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ : వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకొని కౌన్సిలర్ కోళ్ల భాస్కర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని అక్కడి సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, కౌన్సిలర్లు, అంబకపల్లె మురళి, ఓ.రసూల్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
రైతుల్ని ఆదుకోండి!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతన్నలకు ఆసరాగా నిలవాల్సిన ఇన్స్యూరెన్సు కంపెనీలు సైతం వేదనకు గురి చేస్తున్నాయి. 2012 రబీ పంటలకు ప్రీమియం చెల్లించినా రెండేళ్లుగా బీమా మంజూరు చేయలేదు. శనిగ పంటకు ప్రీమియం చెల్లించుకోవచ్చుని విషయం తెలిసినా ఒకరోజులోనే గడువు ముగిసింది. తక్షణమే రైతులకు ఇన్స్యూరెన్సు కంపెనీ ఆసరాగా నిలవాలని ఏఐసీ సిఎండి జోసెఫ్‌కు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వివరించారు. న్యూడిల్లీలో బుధవారం ఆయన సిఎండి జోసెఫ్‌ను కలిసి జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న దుస్థితిని వివరించినట్లు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మీడియాకు తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రభుత్వం ప్రకృతి కారణంగా నష్టపోతున్న రైతులకు ఆసరాగా నిలవాలనే లక్ష్యంతో ఇన్స్యూరెన్సు విధానం ప్రవేశ పెట్టింది. పంటలకు ప్రీమియం ముందే చెల్లించినా ఇన్స్యూరెన్సు చెల్లించడంలో కంపెనీలు వైఫల్యం చెందుతున్నాయి. 2012 రబీ పంటలకు ప్రీమియం చెల్లించినా ఇప్పటికి ఏఐసీ కంపెనీ ఇన్స్యూరెన్సు చెల్లించలేదు. శనగకు బీమా గడువు పెంచండి.... శనగ పంటకు ఇన్స్యూరెన్సు ప్రీమియం చెల్లించుకోవచ్చునని డిసెంబర్ 13న పత్రికల ద్వారా రైతులకు తెలిసింది. తుది గడువు 15గా ప్రకటించారు. అయితే 14వ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకుల్లో రైతులు డీడీలు తీసుకునే అవకాశం లేకపోయింది. 15వ తేదీ అందుబాటులో ఉన్న కొద్దిమంది రైతులు మాత్రమే బీమా కోసం డీడీలు కట్టారు. దీంతో ఎక్కువ మంది రైతులంతా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ప్రకృతి కారణంగా రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఈనెల 25వ తేదీ వరకూ ఇన్స్యూరెన్సు ప్రీమియం చెల్లించేందుకు గడువు పెంచాలి. ఆమేరకు సిఎండిగా మీరు చర్యలు తీసుకుని రైతులకు అవకాశం కల్పించాలని కోరినట్లు ఎమ్పీ వెల్లడించారు. అలాగే 2010 సంవత్సరం నుంచి 126 మంది రైతులకు చెందిన క్లైమ్లు సెటిల్ కాలేదు. పులివెందుల మున్సిపాలిటి పరిధిలోని బ్రహ్మణపల్లెకు చెందిన 126 మంది రైతులు వేరుశనగ పంట కోసం ప్రీమియం చెల్లించారు. అయితే బ్యాంకర్లు పొద్దుతిరుగుడు పంట కోసం చెల్లించినట్లుగా తప్పుగా నమోదు చేసుకున్నారు. రైతులు బ్యాంకులకు చెల్లించింది వేరుశనగ పంట కోసం. ఆమేరకు పులివెందుల ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు తమ తప్పిదాన్ని ధ్రువపరుస్తూ, 2013 జూలైలో ఏఐసీకి లేఖ రాసింది. రైతులు వేరుశనగ పంట కోసం ప్రీమియం చెల్లించి కూడా బీమా అందుకోలేకపోయారు. వారికి న్యాయం చేయూలని కోరినట్లు చెప్పారు. శనగ పంటకు కనీసం ఈనెల 25వతేదీ వరకూ బీమా గడువు పెంచాలి. 2012 రబీ పంటలకు చెల్లించిన ప్రీమియంకు ఇన్స్యూరెన్సు సత్వరమే అందించాలని సిఎండికి రాతపూర్వకంగా వివరించారు. ఆమేరకు పరిశీలించి సత్వర చర్యలు తీసుకుంటానని సిఎండి జోసెఫ్ హామీ ఇచ్చారని ఎమ్పీ చెప్పారు. -
బియ్యం నిల్వలు సీజ్
వేముల : ఎట్టకేలకు బెస్తవారిపల్లెలో బియ్యం నిల్వలను తహశీల్దార్ శివరామయ్య గురువారం సీజ్ చేశారు. దీంతో బియ్యం పంపిణీ కొలిక్కిరాలేదు. కాగా బియ్యం పంపిణీ చేయకపోవడంతో బుధవారం సర్పంచ్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సంఘీభావంగా పాల్గొన్నారు. ధర్నా సందర్భంగా తహశీల్దార్ శివరామయ్య గురువారం తాము బియ్యం పంపిణీ చేస్తామని హామీనిచ్చారు. ఈ హామీ మేరకు కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసేందుకు తహశీల్దార్ శివరామయ్య గురువారం సిబ్బందితో బెస్తవారిపల్లెకు వెళ్లారు. అక్కడ గ్రామంలో టీడీపీ నాయకుని ఇంటిలో అనధికారికంగా ఉన్న బియ్యాన్ని తరలించి దేవాలయం వద్ద బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. అధికారులు బియ్యాన్ని తరలించేందుకు అక్కడికి వెళ్లగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఇక్కడ నుంచి బియ్యం గింజను కూడా తీసుకపోనివ్వమని తహశీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. ఇంతలో కొందరు తమ నేతలకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. మరోవైపు టీడీపీ నేతలు తహశీల్దార్‌కు ఫోన్ చేసి అక్కడ నుంచి బియ్యం తరలిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించే ధోరణిలో మాట్లాడినట్లు తెలిసింది. దీంతో ఆయన టీడీపీ నేతల ఒత్తిళ్లతో ఎటూ తేల్చుకోలేకపోయారు. ఆర్డీవోకు సమాచారమిచ్చారు. ఈ పరిణామాలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠ నెలకొంది. పులివెందుల సీఐ మహేశ్వరరెడ్డి, వేముల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మరోపక్క బియ్యం నిల్వలను సీజ్ చేయకపోతే సర్పంచ్ లింగాల పార్వతమ్మ ఆధ్వర్యంలో ధర్నా చేసేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆర్డీవో ఆదేశాల మేరకు తహశీల్దార్ బియ్యం నిల్వలను సీజ్‌చేసి వెళ్లిపోయారు. తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ తెలిపారు. -
తాగునీటికే ప్రాధాన్యం
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వేంపల్లె : జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు షబ్బీర్‌వల్లి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డితో కలసి మంగళవారం ఆయన వేంపల్లె మండలం ముతుకూరు, నందిపల్లె, కత్తలూరులో పర్యటించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల వేంపల్లె మండల నాయకులతో సమావేశమైన సమయంలో పై గ్రామాల్లో తలెత్తిన తాగునీటి ఎద్దడి, సిమెంట్ రోడ్ల అవసరాన్ని వారు వివరించారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఆ గ్రామాల్లో పర్యటించారు. తాగునీటి పథకాన్ని ఆయన నిచ్చెన ఎక్కి స్వయంగా పరిశీలించారు. తరువాత పరిస్థితిపై ఆర్డబ్ల్యూఎస్ డీఈ శేషఫణి, ఏఈ ఖాదర్‌బాషాతో చర్చించారు. సమస్య పరిష్కారానికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. వాటి పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. ఎంపీటీసీ సభ్యులు ఎన్.గంగిరెడ్డి, కె.వెంకటేశ్, సర్పంచ్‌లు ఆర్ఎల్వీ ప్రసాద్‌రెడ్డి, మునెమ్మ, సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, సింగిల్ విండో డెరైక్టర్ నాగిరెడ్డి పాల్గొన్నారు. -
అ‘టెన్షన్’!
అధికార పార్టీనేతల నిర్వాకంకారణంగా రెండు పర్యాయాలువాయిదా పడిన జమ్మలమడుగుమున్సిపల్ ఛైర్మన్ ఎన్నికనుమూడోసారి నిర్వహించేందుకుఅధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ దఫానిర్వహిస్తున్న ఎన్నిక ఏమలుపు తిరుగుతుందోననిసర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జమ్మలమడుగు: జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఈ ఎన్నిక ఏక్షణాన ఏ మలుపు తిరుగుతుందోనని ప్రతి ఒక్కరూఆసక్తిగా గమనిస్తున్నారు. మే నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 9 స్థానాల్లో, టీడీపీ 11స్థానాల్లో విజయం సాధించింది. అయితే స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ ఓటునుఇక్కడే వినియోగించుకుంటుండటంతో రెండు పార్టీలకు సమానంగా 11 మంది సభ్యులున్నట్లయింది. దీంతో ఈనెల 3వతేదీన లాటరీ పద్ధతిలో ఛైర్మన్, వైస్ఛైర్మన్లను ఎన్నుకునేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.అనూహ్యంగా ఒకటో వార్డుకు చెందిన టీడీపీ కౌన్సిలర్ముల్లాజానీగైర్హాజరు కావడంతో టీడీపీ శ్రేణులుతమ కౌన్సిలర్‌ను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా ప్రిసైడింగ్ అధికారి ఎన్నిక 4వతేదీకి వాయిదావేశారు. అయితేకనిపించకుండా పోయిన కౌన్సిలర్ జానీ ప్రిసైడింగ్‌అధికారితో నేరుగా ఫోన్లో మాట్లాడి తనను ఎవరూకిడ్నాప్ చేయలేదని చెప్పారు. 4వతేదీ ఎన్నిక జరుగుతుందని అందరూ భావించారు. కోరం ఉన్నప్పటికీప్రిసైడింగ్ అధికారి తనకు ఆరోగ్యం సరిగా లేదని,తాను ఎన్నిక నిర్వహించలేనని చేతులు ఎత్తేయడంతోరెండో రోజుకూడా వాయిదాపడింది. దీంతో ఎన్నికల కమిషన్‌ఈనెల 13వతేదీన మున్సిపల్‌ై చెర్మన్, వైస్చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తామని ప్రకటించింది.అయితే ఒకటో వార్డుకు చెందిన కౌన్సిలర్‌ముల్లాజానీ ఓటును పరిగణలోనికి తీసుకోకూడదనిఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కోర్టును ఆశ్రయించారు.దీంతో కోర్టు జానీ ఓటును పరిగణలోనికి తీసుకోకూడదని తీర్పునిచ్చింది. అయితే శనివారం తిరిగి టీడీపీనాయకులు హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఈ తీర్పుపై స్టే విధించింది. ఒక వైపేమోప్రిసైడింగ్ అధికారి రామారావు తాము ముల్లా జానీఓటును పరిగణలోనికి తీసుకోమని చెప్పారు. తిరిగిఆ తీర్పుపై కోర్టు స్టే విధించడంతో అధికారులు ఏ విధంగానిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగామారింది.పకడ్బందీగా ఏర్పాట్లుఅధికార పార్టీ నేతలు, అధికారుల నిర్వాకంకారణంగా వాయిదా పడిన జమ్మలమడుగుమున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు ఆదివారం నిర్వహించనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈనెల 3వ తేదీన మున్సిపల్ ఛైర్మన్ , వైస్‌ఛైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ ప్రిసైడింగ్అధికారిగాఉన్న ఆర్డీఓ రఘునాథరెడ్డి చేతులెత్తేయడంతో వాయిదా పడ్డాయి. దీంతో ఎన్నికలకమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం తిరిగిమూడోసారి ఈ ఎన్నిక నిర్వహించనున్నారు.ప్రస్తుతం ప్రిసైడింగ్ అధికారిగా జిల్లాజాయింట్ కలెక్టర్ రామారావుతో పాటు,పరిశీలకునిగా ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్‌ను నియమించారు. వీరి పర్యవేక్షణలో పకడ్బందీగా ఎన్నిక నిర్వహించేందుకు కసరత్తుచేస్తున్నారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను రెండుసార్లు నిర్వహించిన సమయంలోనూ టీడీపీకిచెందిన నాయకులు, కార్యకర్తలు మున్సిపల్కార్యాలయంపై దాడి చేయడంతోపాటుపోలీసులపై రాళ్లు విసిరారు. ఈ సంఘటనలోకొంత మందికి గాయాలయ్యాయి. తిరిగిఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండామున్సిపల్ కార్యాలయం చుట్టూ బారికేడ్ల నిర్మాణంతో పాటు రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదలమధ్య ఉన్న రాళ్లను పొక్లెయిన్లతో తొలగించేకార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా కౌన్సిల్హాల్లో ఇరుపార్టీలకు చెందిన కౌన్సిలర్లు గొడవలకు దిగకుండా మధ్యలో టీడీపీ, వైఎస్సార్సీపీ, ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేక గ్యాలరీలనుఏర్పాటు చేశారు.జమ్మలమడుగులోనే ఎస్పీ, ఇన్చార్జి కలెక్టర్ఆదివారం జరిగే మున్సిపల్ ఛైర్మన్, వైస్ఛైర్మన్ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు ఇన్‌చార్జికలెక్టర్, ఎస్పీలు జమ్మలమడుగులో తిష్ట వేయనున్నారు. ఇప్పటికే రెండు సార్లు మున్సిపల్‌పాలక వర్గానికి సంబంధించిన ఎన్నికవాయిదా పడటంతో ఇకపై వాయిదా పడకుండా, ఎలాంటి గొడవలు జరగకుండాఉండేందుకు కలెక్టర్, ఎస్పీలు పట్టణంలోఉండి స్వయంగా ఎన్నికలు, శాంతిభద్రతలనుపర్యవేక్షించనున్నారు. -
ప్రజా సమస్యలను పరిష్కరిస్తా
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందుల: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో పలువురు ఆయన్ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. దీనికి స్పందించిన ఎంపీ వెంటనే పరిష్కారమయ్యే వాటికి అధికారులకు ఫోన్‌చేసి వాటి పరిష్కారానికి కృషి చేశారు. అంతకుముందు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. అధికారం రాలేదని ఎవరూ నిరుత్సాహపడవద్దని.. భవిష్యత్ తమదేనని భరోసా ఇచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నందున అక్కడక్కడ చిన్నపాటి సమస్యలు ఎదురైనా వాటిని దీటుగా ఎదుర్కొవాలన్నారు. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని వారికి సూచించారు. అలాగే నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలోపేతం చేయాలన్నారు. -
మానవతా దృష్టితో ఆదుకోండి
మైలవరం,న్యూస్‌లైన్: నవాబుపేట బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో కలిసి శనివారం ఆయన నవాబుపేట గ్రామంలో దుర్ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్‌షేడ్ కూలడంతో మృతి చెందిన వారి కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రూ.50 వేలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 20 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 10 వేలు చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా బాధిత కుటుంబాలను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షలు, గాయపడినవారికి రూ.60 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ తమ ట్రస్టు తరపున భవననిర్మాణ కార్మికులకు బీమా చేయించామని మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు బీమా వస్తుందన్నారు. గ్రామంలో దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ పేలుడు వల్ల ఇళ్లు, గో డలు పగుళ్లు వారుతున్నాయని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దాల్మియాపై పోరాటం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, కేకే కొం డారెడ్డి, నారాయణరెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులను రుణ విముక్తులను చేయాలి రైతులను రుణ విముక్తులను చేయాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల పంటరుణాలు, బంగారు రుణాలే కాకుండా కౌలుదారుని రుణాలను కూడా మాఫీ చేయాలన్నారు. కోల్డ్ స్టోరేజిలు, గోడౌన్లు, దాల్‌మిల్లులు, యంత్ర పరికరాలకు సంబంధించిన నూర్పిడి యంత్రాలు, వర్మి కంపోస్ట్, నర్సరి, ఉద్యానవన మొక్కలు తదితర వ్యవసాయ రంగానికి చెందిన అన్ని రకాల రుణాలను చంద్రబాబునాయుడు ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు టీడీపీ మేనిఫెస్టోలో పొందు పరిచిన డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగభృతి తదితర వాటిని అమలు చేయకపోతే నిరసనలు తప్పవన్నారు. ఈ సమావేశంలో తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, కేకే కొండారెడ్డి, శివనాథరెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నష్టపోయిన రైతులకు తక్షణ బీమా
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లాలో పంట నష్టపోయిన శనగ, ఉల్లి రైతులకు చెల్లించాల్సిన బీమా మొత్తాన్ని తక్షణం అందేలా చర్యలు తీసుకోవాలని అగ్రికల్చర్ బీమా కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ జోసఫ్‌కు కడప ఎంపీ వై.ఎస్. అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 2011లో ప్రీమియం చెల్లించిన రైతులకు ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఇన్సూరెన్స్ అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని కేంద్ర కార్యాలయ అధికారుల దృష్టికి ఆయన బుధవారం ఢిల్లీలో తీసుకెళ్లారు. కేజీ మార్గ్‌లోని అగ్రికల్చర్ బీమా కంపెనీ సీఎండీతో దాదాపు అరగంట పాటు రైతుల ఇబ్బందులపై చర్చించారు. అనంతరం అక్కడి మీడియాతో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడారు. ఆమేరకు వివరాలిలా ఉన్నాయి. ‘ 2011లో రైతులు శనగ పంటకు, ఉల్లి పంటకు ప్రీమియం కట్టారు. దాదాపు మూడేళ్లు గడిచినా నష్టపోయిన రైతులకు బీమా సొమ్ము అందలేదు. ఈ విషయాన్ని అనేక సార్లు వైఎస్సార్సీపీ తరఫున వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లోని వ్యవసాయ బీమా కార్యాలయానికి వెళ్లాం. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సైతం స్వయం గా అక్కడి అధికారులతో ఫోన్లోనూ మాట్లాడారు. దాదాపు ఐదారుసార్లు ఆ కార్యాలయానికి వెళ్లి ఒత్తిడి తెచ్చాం. అయినా ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా అయితే ప్రీమియం కట్టిన రెండేళ్లలోపే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. మూడేళ్లకుపైగా గడిచినా నష్టపోయిన పంటకు సంబంధించి రైతులకు పరిహారం అందకపోవడం చాలా బాధాకరం. హైదరాబాద్ కార్యాలయంలో ఎన్నిసార్లు కలిసినా ఈ విషయంపై స్పష్టత రావడం లేదు. ఈ విషయాన్ని ఢిల్లీలోని కేంద్ర కార్యాలయం దృష్టికి తెచ్చేందుకు బుధవారం అగ్రికల్చర్ బీమా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ జోసఫ్‌ను కలిశాం. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు కలగ కుండా వారం నుంచి రెండు వారాల్లో బీమా మొత్తాలు అందేలా కృషి చేస్తామని మాకు సీఎండీ హామీ ఇచ్చారు. రైతులకు బీమా అందే వరకు ప్రతి రెండు రోజులకోమారు జోసెఫ్గారితో ఫోన్లో మాట్లాడతాం. రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుండి పోరాడతాం..’ అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర కలిపి రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన రైతులకు రూ. 91 కోట్లు బీమా అందాల్సి ఉందని తెలిపారు. దీనిలో కరువుపీడిత జిల్లా కావడంతో కేవలం వైఎస్సార్ జిల్లాలోనే 40 వేల మంది రైతులకు సుమారుగా రూ. 59 కోట్లు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని జోసఫ్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. -
ఇడుపులపాయలో బిజీబిజీ
వేంపల్లె, న్యూస్‌లైన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయలో బుధవారం మధ్యాహ్నం వరకు బిజీబిజీగా గడిపారు. ఉదయం నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో చేయి చేయి కలిపి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్నం 12గంటలవరకు ప్రతి చిన్న కార్యకర్తతో కూడా వివరాలు అడుగుతూ సమస్యలను తెలుసుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో కలిసి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలలోనూ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో వేంపల్లె మండలంలో మంచి మెజార్టీ సాధించారని వైఎస్ జగన్మోహన్రెడ్డి వేంపల్లె నాయకులను అభినందించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వేంపల్లె మండల ఎన్నికల పక్రియను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలోనే వేంపల్లె ఎంపీపీ అభ్యర్థి రవికుమార్‌రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి ఎన్నికలలో వచ్చిన మెజార్టీని తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని జగన్ అభినందించారు.కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీలను వైఎస్ జగన్‌కు పరిచయం చేశారు. వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు నాయకులు : గురువారం ఇడుపులపాయలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని జిల్లాలోని పలువురు నాయకులు, కార్యకర్తలు కలుసుకున్నారు. కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, మైదుకూరు ఎమ్మెల్యే రఘునాథరెడ్డి, నిత్యానందరెడ్డి వైఎస్ జగన్‌ను కలిశారు. అలాగే చిత్తూరు జిల్లా కాణిపాకంకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున వైఎస్ జగన్‌ను కలిశారు. వారి బాగోగులను జగన్ అడిగి తెలుసుకున్నారు. అలాగే మండలాల కన్వీనర్లు చంద్ర ఓబుళరెడ్డి, రఘునాథరెడ్డి, బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వేంపల్లె ఎంపీపీ అభ్యర్థి రవికుమార్‌రెడ్డి, కె.వి.ప్రశాంత్‌రెడ్డి, ఎంపీటీసీలు గంగరాజు, కొత్తూరు రెడ్డయ్య, కటిక చంద్రశేఖర్, రాజ్‌కుమార్, హబీబుల్లా, సింగిల్ విండో అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి, రవి గౌడ్, ఏపీ ఆగ్రోస్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి, యూత్ కొండయ్య, చలపతి, మున్నీర్, రమేష్‌బాబు, సింగారెడ్డి జయచంద్రారెడ్డి, సల్మా, భారతి, ఝాన్సీ, సర్పంచ్‌లు ఆర్ఎల్వి ప్రసాద్‌రెడ్డి, రమేష్‌బాబు, మైనార్టీ నాయకులు మున్నీర్, షేక్షా, వార్డు మెంబర్లు మోహన్ పవర్, మణిగోపాల్‌రెడ్డి, శేషయ్య, హజీం, మల్లయ్య, కుర్రాకుల వెంకటేష్, మాజీ సర్పంచ్‌లు పాలేటిరెడ్డి, దర్బార్, బికారీ, అలవలపాడు శ్రీను, మాజీ ఎంపీపీ కొండయ్య, ఎంపీటీసీ సుశీల, మాజీ సర్పంచ్ రామాంజనేయరెడ్డి తదితరులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. -
పార్లమెంట్‌కు రెండు, అసెంబ్లీలకు ఐదు..
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కడప లోక్‌సభ స్థానానికి మంగళవారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి తరపున ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి శశిధర్‌కు అందజేశారు. పిరమిడ్ పార్టీ అభ్యర్థి గజ్జల రామసుబ్బారెడ్డి ఒక సెట్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కడప అసెంబ్లీ నియోజకవర్గానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి వెంకల భాగ్యలక్ష్మి ఒక సెట్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థి జక్కం వెంకటరమణ నామినేషన్ దాఖలు చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నగిరిపల్లె యానాదయ్య నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి కొనుదుల నారాయణరెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గానికి పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా సి.సుజనాదేవి ఒక సెట్‌నామినేషన్‌ను సమర్పించారు. -
YS అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
వైఎస్ఆర్ సీపీలోకి ముక్తియార్
చక్రాయపేట, న్యూస్‌లైన్: ప్రజలకు ఇచ్చిన హామీలను తీర్చడం ఒక్క వైఎస్ కుటుంబానికే సాధ్యమని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు, ఆ పార్టీ కడప పార్లమెంటు అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమని ఆయన విమర్శిం చారు. గడపగడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని అద్దాలమర్రి,కుమారకాల్వ, ఎర్రబొమ్మనపల్లె,కె.రాజుపల్లె,కల్లూరుపల్లె, కె.ఎర్రగుడి,గ్రామాల్లో మండల ఇన్చార్జ్ వైఎస్ కొండారెడ్డితో పాటు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత కరెంటు, లక్షలాది పక్కా గృహాలు, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. వైఎస్ఆర్ పథకాలను రోశయ్య,కిరణ్ కుమార్‌రెడ్డిలు కోతలు పెట్టారని ధ్వజమెత్తారు. తన హయాంలో పేదల సంక్షేమాన్నే మరచిన చంద్రబాబు నేడు ఎలాగైనా సీఎం కావాలని నోటికి వచ్చిన హామీలన్నీ ఇస్తున్నారన్నారు. ఈయన తీరు చూస్తే ప్రజలు ‘ఎండలు ఎక్కువగా ఉన్నయ్ సార్’ అంటే మీకు బాధ కలుగకుండా ఎండలనూ రద్దు చేస్తాననే హామీ ఇచ్చేందుకూ వెనుకాడడని ఎద్దేవా చేశారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తే అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులకు ఎల్కేజీ నుంచి పీజీ వరకూ 500 నుంచి,1000 వరకు నెలనెలా బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు.డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, రైతులకు నాణ్యమైన విద్యుత్ 7 గంటలు ఇవ్వడం, తర్వాత దాన్ని 9గంటలకు పెంచడం జరుగుతుందన్నారు. పింఛన్లు,పక్కా గృహాలు వంటి మంచి పథకాలు అమలు చేయాలంటే ప్రజలు జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బెల్లం ప్రవీణ్ కుమారెడ్డి,యూత్ కన్వీనర్ వెంకటసుబ్బయ్య, ఉద్యాన శాఖ మాజీ డెరైక్టర్ కర్నాటి నాగభూషణరెడ్డి,ఏపి ఆగ్రోస్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి,సీనియర్ నేతలు బెల్లం కృష్ణారెడ్డి,చెన్నారెడ్డి, మాజీ రెస్కో చేర్మెన్ శివప్రసాద్‌రెడ్డి,సింగిల్ విండో అధ్యక్షులు శేషారెడ్డి, సురేష్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. -
మాట తప్పితే ముట్టడిస్తాం
సాక్షి ప్రతినిధి, కడప: పంటల బీమా విషయంలో మాట తప్పితే వందలాది రైతులతో కలిసి ఇన్సూరెన్స్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వైఎస్సార్సీపీ యూత్ జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం సాయంత్రానికి క్లియరెన్స్ దక్కకపోతే బుధవారం కార్యాలయాన్ని ముట్టడిస్తామని జీఎం నాగార్జునకు అల్టిమేటం జారీ చేశారు. 2011-12 రబీ సీజన్ పంటల బీమాకు సంబంధించి రూ.52 కోట్లు జిల్లాకు రావాల్సి ఉంది. సుమారు 39వేల మంది రైతులు శనగ, ఉల్లి పంటలకు ప్రీమియం చెల్లించారు. ఇంతవరకూ బీమా విడుదలకు గ్రీన్‌సిగ్నల్ పడటం లేదు. ఈవిషయమై వైఎస్ అవినాష్‌రెడ్డి స్వయంగా జనరల్ మేనేజర్ నాగార్జునతో పలుమార్లు సంప్రదింపులు నిర్వహించారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లు చేయడంతో పాటు లేఖలు కూడా రాశారు. కమిటీలోని ఐదుగురు సభ్యులు సంతకాలు చేశారని, శనివారం నాటికి తప్పకుండా సీఎండీతో సంతకం చేయించి క్లియరెన్సు ఇప్పిస్తామని జనరల్ మేనేజర్ నాగార్జున ‘సాక్షి’కి ధృవీక రించారు. శనివారం సాధ్యం కాకపోవడంతో మరోమారు వైఎస్ అవినాష్‌రెడ్డి జీఎంతో ఫోన్లో మాట్లాడారు. సోమవారానికి క్లియరెస్సు ఇప్పిస్తామని, అంతవరకూ ఆందోళన చెందవద్దని జీఎం తెలిపారు. ఇచ్చిన మాట మేరకు కట్టుబడి ఉండకపోతే కార్యాలయాన్ని ముట్టడించేందుకు అన్ని ఏర్పాట్లను వైఎస్ అవినాష్‌రెడ్డి చేస్తున్నట్లు సమాచారం. వందలాది మంది రైతులతో ప్రదర్శనగా వెళ్లి హైదరాబాద్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సమాయత్తం అవుతున్నారు. తిరిపెం ఇవ్వడం లేదు పంటల బీమాపై స్వయంగా , ఫోన్‌ద్వారా ఎన్నో సార్లు మాట్లాడాను.. పరిహారం కోసం రైతులు పడిగాపులు పడుతున్న విషయాన్ని తెలియజేశాం.. రైతులకు తిరిపెం ఇవ్వడం లేదు.. ప్రీమియం చెల్లించినందుకు బీమా ఇస్తున్నారు. సోమవారం సాయంత్రానికి ఫైలుకు క్లియరెన్స్ ఇప్పిస్తే సరి.. లేదంటే బుదవారం హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. -
వైఎస్ పాలన మళ్లీ రావాలి
బద్వేలు/కాశినాయన, న్యూస్‌లైన్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలు నెరవేరాలంటే ఆయన తనయుడు జగన్ మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని వైఎస్సార్సీపీ యువజన వభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని వరికుంట్ల గ్రామంలో గురువారం పార్టీ అభ్యర్థుల ప్రచారం ప్రారంభిస్తున్న సందర్భంగా భారీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి, గోవిందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సీఎం కిరణ్ అసమర్థతే కారణమన్నారు. బిల్లు శాసనసభకు వచ్చిన రోజే రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. సీమాంధ్రలోని కోట్లాది మంది రాష్ట్ర విభజనను వద్దని కోరుతున్నా చంద్రబాబు మాత్రం రెండు కళ్ల సిద్ధాంతాన్ని విడిచి పెట్టడం లేదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ ఒక్కడై సమైక్య ఉద్యమాన్ని భుజాన వేసుకుని విభజనను ఆపేందుకు తన శాయశక్తులా కృషి చేస్తున్నారని చెప్పారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు మాట్లాడుతూ మరో 70 రోజుల్లో రాష్ట్రంలో కొత్త పరిపాలన వస్తుందని, జగన్ సీఎం అవుతారని చెప్పారు. ఈ 70 రోజులు ప్రతి కార్యకర్త, నాయకులు సైనికుల్లా శ్రమించి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలకు సమాధి కట్టే సమయం ఆసన్నమైందన్నారు. పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు, మైదుకూరు మాజీ ఎమ్మల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ టిక్కెట్ జయరాములుకు దక్కిందంటే ఆయన గెలిచినట్లేనన్నారు. అభ్యర్థి జయరాములు మాట్లాడుతూ వైఎస్ ఆశయాల సాధనకు తన వంతు కృషి చేస్తానని, అలాగే నియోజకవర్గంలోని పలు సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. రాష్ట్ర మహిళా ఆర్థికాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ కృష్టమ్మ మాట్లాడుతూ వైఎస్ రుణం తీర్చుకోవాలంటే జగన్‌ను సీఎం చేయడమే మార్గమన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ విశ్వనాథరెడ్డి, సత్యనారాయణరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు రామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ పెద్ద రామయ్య, సర్పంచ్ నాగిరెడ్డి, ఉపసర్పంచ్ ఓబుల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీ ప్రచారం ప్రారంభిస్తున్న సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. తొలుత పోరుమామిళ్లలో పలువురు జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. బద్వేలు మున్సిపల్ ఛైర్మన్ మునెయ్య, వైస్ ఛైర్మన్ గురుమోహన్, కన్వీనర్లు గోపాల్‌రెడ్డి, కరీముల్లా, యోగానందరెడ్డి, ఇమాంహుస్సేన్, బాలమునిరెడ్డి, నాయకులు నాగార్జునరెడ్డి, అంకన గురివిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, బోడపాడు రామసుబ్బారెడ్డి, శ్రీరాములు, కరెంట్ రమణారెడ్డి, పంగా గురివిరెడ్డి, చిత్తా బ్రదర్స్, మాజీ ఎంపీపీలు సర్వసతమ్మ, ఈశ్వరమ్మ, నేతలు వసంతరాయలు, అల్లా పాల్గొన్నారు. -
భవిష్యత్ వైఎస్ఆర్సీపీదే
వేముల, న్యూస్‌లైన్ : భవిష్యత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా యూత్ అధ్యక్షులు వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మండలంలోని భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లె, మీదిపెం ట్ల కోట గ్రామాల్లో మంగళవారం మండల నా యకులు నాగేళ్ల సాంబశివారెడ్డితో కలిసి వైఎస్ అవినాష్‌రెడ్డి గడప.. గడప కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో గడప.. గడప తొక్కుతూ వైఎస్ఆర్ సీపికి అండగా నిలవాలని మహిళలను, వృద్ధులను, యువకులను అభ్యర్థించారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలు అందిస్తామని హామీనిచ్చారు. ఇప్పటికి గ్రామాల్లో సంక్షేమ పథకాలు అందని నిరుపేదలు చాలామంది ఉన్నారని తెలిపారు. సమస్యలకు పరిష్కారం చూపుతాం.. : ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై స్పందించిన వైఎస్ అవినాష్‌రెడ్డి సమస్యలకు పరిష్కారం చూపుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రతిచోట పింఛన్ రాలేదని.. పక్కాగృహం మంజూరు కాలేదని.. ఉపాధి అవకాశాలు కుల్పించాలనే సమస్యలే ఎక్కువగా ఆయన దృష్టికి వచ్చాయి. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు కృషి చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. నాలుగో రీచ్‌లో భూములను తీసుకొనేలా చూడండి : తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టుకు నాల్గవ రీచ్‌లో భూములు తీసుకునేలా చూడాలని బాధిత రైతులు వైఎస్ అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ప్రాజెక్టుకు నాల్గవ రీచ్ కింద భూములను తీసుకుంటామని చెప్పిన యూసీఐఎల్ ఆ తర్వాత పట్టించుకోలేదని వివరించారు. ప్రాజెక్టు భూములు తీసుకోక.. పంటలు సాగు చేయక పొలాలన్నీ బీళ్లుగా మారాయని.. ఆ భూములను యూసీఐఎల్ తీసుకొనేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రాజెక్టు ఇడీ బెహల్‌తో చర్చిస్తానని.. బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీనిచ్చారు. ఆయా గ్రామాల్లో అపూర్వ స్వాగతం : గడప.. గడపకు విచ్చేసిన వైఎస్ఆర్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆ పార్టీ మండల నాయకులు నాగేళ్ల సాంబశివారెడ్డిలకు ఆయా గ్రామాల్లో అపూర్వ స్వాగతం లభించింది. గ్రామ సరిహద్దులకు చేరిన వెంటనే డప్పు వాయిద్యాల మధ్య టపాసులు పేల్చుతూ తమ అభిమాన నేతను సాదరంగా గ్రామాల్లోకి ఆహ్వానించారు. గ్రామానికి చేరిన వెంటనే ఆయనతో నాయకులు, కార్యకర్తలు, యువకులు కరచాలనం కోసం పోటీపడ్డారు. కార్యక్రమంలో వేల్పుల సొసైటీ అధ్యక్షులు శివశంకర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాజారెడ్డి, బయపురెడ్డి, మరకా శివకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్
పులివెందుల/ఇడుపులపాయ, న్యూస్‌లైన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఇడుపులపాయకు వస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌నుంచి వైఎస్ జగన్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరి మంగళవారం తెల్లవారుజామున ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో దిగి అక్కడ నుంచి వి.ఎన్.పల్లె, వేంపల్లె మీదుగా ఇడుపులపాయకు చేరుకుంటారన్నారు. ఇడుపులపాయలో మహానేత, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద వైఎస్ జగన్‌రెడ్డి నివాళులర్పించి ప్రార్థనలు చేయనున్నట్లు అవినాష్‌రెడ్డి వెల్లడించారు. అనంతరం వచ్చిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు వైఎస్ జగన్‌ను కలవనున్నారు. వైఎస్ జగన్ ఒక్కరోజు మాత్రమే ఇడుపులపాయలో ఉండి.. మళ్లీ అదే రోజు రాత్రికి హైదరాబాద్ వెళతారని ఆయన వివరించారు. ఏర్పాట్లు పరిశీలించిన వైఎస్ అవినాష్‌రెడ్డి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఇడుపులపాయకు రానున్న నేపథ్యంలోవైఎస్ఆర్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎస్టేట్ ఇన్‌ఛార్జి వైఎస్ కొండారెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జగన్ వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్, జనార్థన్‌రెడ్డిలు ఏర్పాట్లను పరిశీలించారు. పులివెందుల డీఎస్పీ హరినాథబాబు, సీఐ శంకరయ్యలు శాంతిభద్రత దృష్ట్యా పరిసరాలను పరిశీలించారు. -
సమన్యాయం చేశాకే విభజన
కడప కార్పొరేషన, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో సాగునీటి సమస్యలు, హైదరాబాద్‌లాంటి మరో నగరాన్ని అభివృద్ది చేశాకే విభజన గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుందని వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. ఇదంతా జరగ డానికి పదేళ్ల కాలం పట్టినా అంత వరకు రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలని ఆయన డిమాండు చేశారు. వైఎస్ విజయమ్మ సమరదీక్షకు సంఘీభావంగా కడప సమన్వయకర్త ఎస్బి అంజద్‌బాష, శెట్టిపల్లె నాగిరెడ్డి, ఎస్.ప్రసాద్‌రెడ్డి, రాఘవరెడ్డితో కలిసి ఆయన చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారానికి ఐదు రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని పార్టీలతో చర్చించకుండా నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కృష్ణా జలాలను రాయలసీమ వాసులు పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి రావాలన్నారు. హైదరాబాద్ లాంటి నగరాన్ని సీమాంధ్రలో కూడా అభివృద్ధి చేశాక విభజన గురించి కనీసం మాట్లాడే హక్కైనా ఉంటుందన్నారు. అంతవరకు రాష్ట్ర విభజన ఊసే ఎత్తొద్దని తెలిపారు. విభజన జరగకముందే జూరాల ప్రాజెక్టుపై ఉన్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి 70 టీఎంసీల నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం విడిపోకముందే ఇన్ని కుట్రలు చేసే వీరు విడిపోతే ఇంకెన్ని దారుణాలకు ఒడిగడుతారో స్పష్టంగా తెలుస్తోందన్నారు. సీఎం, చంద్రబాబు రాజీనామాలు చేయాల్సిందే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు, బొత్స సత్యనారాయణ రాజీనామాలు చేస్తేనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని వైఎస్సార్ సీపీ కడప నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్బాష తెలిపారు. కేంద్ర మంత్రులు, ఎంపీలకు వెన్నెముక లేదని, వీరు కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు గంగిరెద్దుల్లా తలూపుతున్నారన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి చంద్రబాబు విభజనకు కారణమయ్యారన్నారు.