సమన్యాయం చేశాకే విభజన | Irrigation problems in the state | Sakshi
Sakshi News home page

సమన్యాయం చేశాకే విభజన

Published Sat, Aug 24 2013 4:32 AM | Last Updated on Fri, May 25 2018 8:09 PM

Irrigation problems in the state

కడప కార్పొరేషన, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో సాగునీటి సమస్యలు, హైదరాబాద్లాంటి మరో నగరాన్ని అభివృద్ది చేశాకే విభజన గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుందని వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. ఇదంతా జరగ డానికి పదేళ్ల కాలం పట్టినా అంత వరకు రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలని ఆయన డిమాండు చేశారు. వైఎస్ విజయమ్మ సమరదీక్షకు సంఘీభావంగా కడప సమన్వయకర్త ఎస్‌బి అంజద్‌బాష, శెట్టిపల్లె నాగిరెడ్డి, ఎస్.ప్రసాద్‌రెడ్డి, రాఘవరెడ్డితో కలిసి ఆయన చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారానికి ఐదు రోజులు పూర్తి చేసుకుంది.
 
 ఈ సందర్బంగా వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని పార్టీలతో చర్చించకుండా నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కృష్ణా జలాలను రాయలసీమ వాసులు పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి రావాలన్నారు. హైదరాబాద్ లాంటి నగరాన్ని సీమాంధ్రలో కూడా అభివృద్ధి చేశాక విభజన గురించి కనీసం మాట్లాడే హక్కైనా ఉంటుందన్నారు. అంతవరకు రాష్ట్ర విభజన ఊసే ఎత్తొద్దని తెలిపారు. విభజన జరగకముందే జూరాల ప్రాజెక్టుపై ఉన్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి 70 టీఎంసీల నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం విడిపోకముందే ఇన్ని కుట్రలు చేసే వీరు విడిపోతే ఇంకెన్ని దారుణాలకు ఒడిగడుతారో స్పష్టంగా తెలుస్తోందన్నారు.  
 
 సీఎం, చంద్రబాబు
 రాజీనామాలు చేయాల్సిందే
 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు, బొత్స సత్యనారాయణ రాజీనామాలు చేస్తేనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని వైఎస్సార్ సీపీ కడప నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్‌బాష తెలిపారు. కేంద్ర మంత్రులు, ఎంపీలకు వెన్నెముక లేదని, వీరు కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు గంగిరెద్దుల్లా తలూపుతున్నారన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి చంద్రబాబు విభజనకు కారణమయ్యారన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement