అ‘టెన్షన్’! | That tennison! | Sakshi
Sakshi News home page

అ‘టెన్షన్’!

Published Sun, Jul 13 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM

అ‘టెన్షన్’!

అ‘టెన్షన్’!

అధికార పార్టీనేతల నిర్వాకంకారణంగా రెండు పర్యాయాలువాయిదా పడిన జమ్మలమడుగుమున్సిపల్ ఛైర్మన్ ఎన్నికనుమూడోసారి నిర్వహించేందుకుఅధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ దఫానిర్వహిస్తున్న ఎన్నిక ఏమలుపు తిరుగుతుందోననిసర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
 
 జమ్మలమడుగు: జమ్మలమడుగు మున్సిపల్  ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఈ ఎన్నిక ఏక్షణాన ఏ మలుపు తిరుగుతుందోనని ప్రతి ఒక్కరూఆసక్తిగా గమనిస్తున్నారు. మే నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 9 స్థానాల్లో, టీడీపీ 11స్థానాల్లో విజయం సాధించింది. అయితే స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ ఓటునుఇక్కడే వినియోగించుకుంటుండటంతో రెండు పార్టీలకు సమానంగా 11 మంది సభ్యులున్నట్లయింది.
 
 దీంతో ఈనెల 3వతేదీన లాటరీ పద్ధతిలో ఛైర్మన్, వైస్‌ఛైర్మన్‌లను ఎన్నుకునేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.అనూహ్యంగా ఒకటో వార్డుకు చెందిన టీడీపీ కౌన్సిలర్‌ముల్లాజానీగైర్హాజరు కావడంతో టీడీపీ శ్రేణులుతమ కౌన్సిలర్‌ను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా ప్రిసైడింగ్ అధికారి ఎన్నిక 4వతేదీకి వాయిదావేశారు. అయితేకనిపించకుండా పోయిన కౌన్సిలర్ జానీ ప్రిసైడింగ్‌అధికారితో నేరుగా ఫోన్‌లో మాట్లాడి తనను ఎవరూకిడ్నాప్ చేయలేదని చెప్పారు. 4వతేదీ ఎన్నిక జరుగుతుందని అందరూ భావించారు.
 
  కోరం ఉన్నప్పటికీప్రిసైడింగ్ అధికారి తనకు ఆరోగ్యం సరిగా లేదని,తాను ఎన్నిక నిర్వహించలేనని చేతులు  ఎత్తేయడంతోరెండో రోజుకూడా వాయిదాపడింది. దీంతో ఎన్నికల కమిషన్‌ఈనెల 13వతేదీన మున్సిపల్‌ై చెర్మన్, వైస్‌చైర్మన్‌ల  ఎన్నిక నిర్వహిస్తామని ప్రకటించింది.అయితే ఒకటో వార్డుకు చెందిన కౌన్సిలర్‌ముల్లాజానీ ఓటును పరిగణలోనికి తీసుకోకూడదనిఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కోర్టును ఆశ్రయించారు.దీంతో కోర్టు జానీ ఓటును పరిగణలోనికి తీసుకోకూడదని తీర్పునిచ్చింది. అయితే శనివారం తిరిగి టీడీపీనాయకులు హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఈ తీర్పుపై స్టే విధించింది. ఒక వైపేమోప్రిసైడింగ్ అధికారి రామారావు తాము ముల్లా జానీఓటును పరిగణలోనికి తీసుకోమని చెప్పారు.
 
 తిరిగిఆ తీర్పుపై కోర్టు స్టే విధించడంతో అధికారులు ఏ విధంగానిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగామారింది.పకడ్బందీగా ఏర్పాట్లుఅధికార పార్టీ నేతలు, అధికారుల నిర్వాకంకారణంగా వాయిదా పడిన జమ్మలమడుగుమున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు ఆదివారం నిర్వహించనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈనెల 3వ తేదీన మున్సిపల్ ఛైర్మన్ , వైస్‌ఛైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ ప్రిసైడింగ్‌అధికారిగాఉన్న ఆర్డీఓ రఘునాథరెడ్డి చేతులెత్తేయడంతో వాయిదా పడ్డాయి. దీంతో ఎన్నికలకమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం తిరిగిమూడోసారి ఈ ఎన్నిక నిర్వహించనున్నారు.ప్రస్తుతం ప్రిసైడింగ్ అధికారిగా జిల్లాజాయింట్ కలెక్టర్ రామారావుతో పాటు,పరిశీలకునిగా ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్‌ను నియమించారు. వీరి పర్యవేక్షణలో పకడ్బందీగా ఎన్నిక నిర్వహించేందుకు కసరత్తుచేస్తున్నారు.
 
  మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను రెండుసార్లు నిర్వహించిన సమయంలోనూ టీడీపీకిచెందిన నాయకులు, కార్యకర్తలు మున్సిపల్‌కార్యాలయంపై దాడి చేయడంతోపాటుపోలీసులపై రాళ్లు విసిరారు. ఈ సంఘటనలోకొంత మందికి గాయాలయ్యాయి. తిరిగిఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండామున్సిపల్ కార్యాలయం చుట్టూ బారికేడ్ల నిర్మాణంతో పాటు రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదలమధ్య ఉన్న రాళ్లను పొక్లెయిన్‌లతో తొలగించేకార్యక్రమాన్ని చేపట్టారు.
 
 అదేవిధంగా కౌన్సిల్‌హాల్‌లో ఇరుపార్టీలకు చెందిన కౌన్సిలర్లు గొడవలకు దిగకుండా మధ్యలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ, ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేక గ్యాలరీలనుఏర్పాటు చేశారు.జమ్మలమడుగులోనే ఎస్పీ, ఇన్‌చార్జి కలెక్టర్‌ఆదివారం జరిగే మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్‌ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు ఇన్‌చార్జికలెక్టర్, ఎస్పీలు జమ్మలమడుగులో తిష్ట వేయనున్నారు. ఇప్పటికే రెండు సార్లు మున్సిపల్‌పాలక వర్గానికి సంబంధించిన ఎన్నికవాయిదా పడటంతో ఇకపై వాయిదా పడకుండా, ఎలాంటి గొడవలు జరగకుండాఉండేందుకు కలెక్టర్, ఎస్పీలు పట్టణంలోఉండి స్వయంగా ఎన్నికలు, శాంతిభద్రతలనుపర్యవేక్షించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement