‘నేను వైఎస్సార్‌సీపీని వీడేది లేదు’ | YSRCP MP Meda Raghunath Reddy Gives Clarity On Party Change Rumours, Says I Will Never Leave YSRCP | Sakshi
Sakshi News home page

‘నేను వైఎస్సార్‌సీపీని వీడేది లేదు’

Published Thu, Aug 29 2024 10:18 AM | Last Updated on Thu, Aug 29 2024 11:04 AM

 YSRCP MP Meda Raghunath Reddy Clarifies On Party Change News

సాక్షి, తాడేపల్లి: పార్టీ మారుతున్నట్టు తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు వైఎస్సార్‌సీపీ ఎంపీ మేడా రఘునాథ్‌ రెడ్డి. ఈ సందర్భంగా తాను వైఎస్సార్‌సీపీని వీడేది లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో సోషల్‌ మీడియాలో ఫేక్‌ ప్రచారంపై మండిపడ్డారు.

..వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్‌ రెడ్డి పార్టీ మారుతున్నారని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఎంపీ రఘునాథ్‌ రెడ్డి స్పందిస్తూ..‘ఇదంతా తప్పుడు ప్రచారం. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. నేనే వైఎస్సార్‌సీపీని వీడేది లేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తాను. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్‌ జగన్‌తోనే నా ప్రయాణం కొనసాగుతుంది. నాపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఫేక్‌ ప్రచారాన్ని ఎవరూ నమ్మకండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement