Raghunath Reddy
-
కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్.. రైల్వే మంత్రి కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ క్రమంలో కడప-పెండ్లిమర్రి సెక్షన్ మధ్య లైన్ పూర్తి అయినట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు రూ. 359 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పుకొచ్చారు.పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక జవాబు ఇచ్చారు. ఈ క్రమంలో మంత్రి అశ్విని వైష్ణవ్.. ఈ రైల్వే లైన్ కోసం రూ.2706 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పటివరకు రూ.359 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. కడప-పెండ్లిమర్రి సెక్షన్ మధ్య లైన్ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కొత్త లైన్ కోసం సర్వే కోసం ఆమోదం తెలిపాం. ముద్దనూరు-పులివెందుల-ముదిగుబ్బ-శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం మీదుగా కడప నుంచి ఈ లైన్ వెళ్తుంది అని స్పష్టం చేశారు. -
ఏపీజీబీ తరలింపు అన్యాయం!
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ)తో మరో మూడు గ్రామీణ బ్యాంకుల్ని విలీనం చేసి, విలీనానంతర బ్యాంకును అమరావతికి తరలిస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఈ తరలింపు ఆలోచన ఔచిత్యాన్ని పరిశీలించడం అవసరం. దేశంలోని గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి వాటి సంఖ్యను 43 నుంచి 28కి కుదించాలనీ, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు గ్రామీణ బ్యాంకుల్ని విలీనం చేసి ఒకే రాష్ట్రస్థాయి బ్యాంకుని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను మొదటగా స్వాగతించాలి. దేశ వ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల సిబ్బంది తమ బ్యాంకులను విలీనం చేసి రాష్ట్రానికి ఒక్క గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేయాలని దీర్ఘకాలంగా కోరుతూ వస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా ‘వన్ స్టేట్ – వన్ ఆర్ఆర్బీ’ విధానానికి అనుగుణంగా ఈ ఆకాంక్షను మన్నించింది. ఇందులో భాగంగా నూతన ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు గ్రామీణ బ్యాంకులు కలిసి రాష్ట్ర స్థాయిలో ఒకే బ్యాంకుగా మారబోతున్నాయి. ఇప్పటివరకు ఈ నాలుగు బ్యాంకుల్లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కడపలో, సప్తగిరి గ్రామీణ బ్యాంకు చిత్తూరులో, చైతన్య గ్రామీణ బ్యాంకు గుంటూరులో, ఉత్తరాంధ్రలోని గ్రామీణ బ్యాంకులు వరంగల్ ప్రధాన కార్యాలయాలుగా పనిచేస్తున్నాయి.ఇప్పుడు ఏపీలోని 26 జిల్లాల్లోని గ్రామీణ బ్యాంకుల విలీనానంతర రాష్ట్రస్థాయి బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉండాలన్నది ప్రశ్న. ఈ విషయంలో సంప్రదాయాలు, మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నా ఈ ప్రధాన కార్యాలయాన్ని కడపలో కాకుండా అమరావతికి తరలించాలని ప్రభుత్వం చూస్తోంది. ఇది వివాదాస్పద నిర్ణయం. సంప్రదాయం విషయానికొస్తే... గత నమూనా ఒకటి ఉంది. రాయలసీమ గ్రామీణ బ్యాంకుతో అనంత గ్రామీణ బ్యాంకు, పినాకిని గ్రామీణ బ్యాంకులు 2006లో విలీనమయ్యాయి. విలీనానంతర బ్యాంకుగా ‘ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు’ను ఏర్పాటు చేసి... రాయలసీమ గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలో ఉంది కాబట్టి దాని ప్రధాన కార్యాలయాన్నీ కడపలోనే ఏర్పాటు చేశారు. మార్గదర్శకాల ప్రాతిపదికన చూస్తే... తాజాగా 2024 నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ఆర్బీ సెక్షన్ విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు: గ్రామీణ బ్యాంకులు ఏదైనా ఒక పెద్ద గ్రామీణ బ్యాంకులో విలీనమైనప్పుడు, ఆ పెద్ద గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడుందో, అక్కడే విలీనం తర్వాత ఏర్పడే రాష్ట్రస్థాయి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలి. సంప్రదాయమే కాకుండా, ఇలా చూసినా, ఏపీ రాష్ట్రస్థాయి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కడపలోని ఏర్పాటు కావాలి. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి ఇప్పటికే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు పోషించిన పాత్ర విస్మరించలేనిది. ఏపీజీబీ రైతులకు రుణాలు ఇచ్చింది. స్వయం సహాయక బృందాలకు అండగా నిలిచింది. చిన్న, సూక్ష్మ , మధ్యతరహా పరిశ్రమలు అక్కడక్కడైనా నిడదొక్కుకోవడానికి ఊపిరి పోసింది. ఏపీజీబీ ఇలా చేయగలగడానికి కారణం రాయలసీమ నేపథ్యం, అవసరాలే! ఏపీజీబీ స్పాన్సర్ బ్యాంక్ అయిన కెనరా బ్యాంకుతో సహా మిగతా మూడు గ్రామీణ బ్యాంకుల స్పాన్సర్ బ్యాంకుల ముఖ్య అధికారుల వ్యక్తిగత అజెండాలూ, ఆ బ్యాంకుల వ్యాపార ప్రయోజనాలూ ఏపీజీబీ విలీన బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించాలన్న వాదన వెనక ఉన్నాయని బలంగా వినిపిస్తున్నది. ఇది సరైనది కాదు. ఇది ప్రజల అవసరాలు, దీర్ఘకాల దృష్టితో, బాధ్యతతో పాలకులు నిర్ణయించాల్సిన అంశం.కడపలో ఇప్పుడున్న ఏపీజీబీ ప్రధాన కార్యాలయానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి స్థలమివ్వడం వల్ల 2015 లోనే చాలా మంచి సొంత ప్రధాన కార్యాలయం ఉంది. 50 సెంట్లలో, 47 వేల చదరపు అడుగులలో, ఒక సెల్లార్, నాలుగు అంతస్తులలో అధునాతనమైన కార్యాలయంగా ఇది ప్రారంభమైంది. కడపలో ఆకర్షణీయమైన ఆఫీస్ ప్రెమిసెస్‌లో కలెక్టరేట్ తర్వాత ఇదే అత్యుత్తమమైనది.ఇక రాష్ట్రంలోని నాలుగు గ్రామీణ బ్యాంకుల వ్యాపార ఫలితాల విషయానికొస్తే, ఏపీజీబీ తర్వాతే ఏదైనా! రాష్ట్రంలో గ్రామీణ బ్యాంకుల మొత్తం వ్యాపారంలో 43 శాతం వ్యాపారం ఏపీజీబీదే. నష్టాలు తట్టుకునే సామర్థ్యం, మూలధన అవసరాల్ని తీర్చే శక్తి ఏపీజీబీకే ఎక్కువ (25.65%). కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ లలో కస్టమర్లను బాగా ఆకర్షించే కాసా నిష్పత్తిలో ఏపీజీబీదే అగ్రస్థానం.అన్ని బ్యాంకుల మొత్తం కస్టమర్ల కంటే ఎక్కువగా ఏపీజీబీకే (86.75 లక్షల మంది కస్టమర్లు) ఉన్నారు. బ్రాంచ్‌ల సంఖ్య ఏ ఇతర గ్రామీణ బ్యాంకుతో పోల్చుకున్నా కూడా రెట్టింపే. రాష్ట్రంలోని మిగతా గ్రామీణ బ్యాంకులకు లేని చెస్ట్ సదుపాయం ఆర్బీఐ అనుమతితో కడప ఏపీజీబీకి ఎప్పటినుంచో ఉంది. మిగతా గ్రామీణ బ్యాంకుల మొత్తం రిజర్వుల కంటే ఏపీజీబీ రిజర్వులు 1400 కోట్లు ఎక్కువ.విభజన హామీల అమలు విషయంలో ఇప్పటికే న్యాయం జరగలేదు. పైగా, ఇటీవలే కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్‌లో భాగమైన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఇప్పుడు అమరావతిలో బుద్ధిగా ఒదిగిపోయింది. తాజాగా, రాయలసీమ నుంచి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు అమరావతికి తరలిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. వచ్చేవి రాకపోయ, విశాల రాయలసీమ నడిబొడ్డున ఉన్న ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని కూడా అమరావతికి తరలించాలన్న కృత నిశ్చయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉందని వస్తున్న సంకేతాలు అనుబంధాలకు అతీతంగా ఇక్కడి ప్రజల మనోభావాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఇప్పటికే వామపక్ష సంఘాలు ఆందోళన బాట పట్టాయి. పార్టీలకు అతీతంగా అనేకమంది రాజకీయ నాయకులూ ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజానుకూలంగా, దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరిస్తుందని ఆశిద్దాం!-ఎ. రఘునాథరెడ్డి, వ్యాసకర్త సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ కన్వీనర్ -
‘నేను వైఎస్సార్సీపీని వీడేది లేదు’
సాక్షి, తాడేపల్లి: పార్టీ మారుతున్నట్టు తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు వైఎస్సార్సీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి. ఈ సందర్భంగా తాను వైఎస్సార్సీపీని వీడేది లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై మండిపడ్డారు...వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి పార్టీ మారుతున్నారని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఎంపీ రఘునాథ్ రెడ్డి స్పందిస్తూ..‘ఇదంతా తప్పుడు ప్రచారం. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. నేనే వైఎస్సార్సీపీని వీడేది లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తాను. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్ జగన్‌తోనే నా ప్రయాణం కొనసాగుతుంది. నాపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఫేక్ ప్రచారాన్ని ఎవరూ నమ్మకండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రులు
-
కాన్వాయ్ విడిచి.. నడిచి వెళ్లిన మంత్రి
అనంతపురం : ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో కాలినడకన ర్యాలీ చేస్తుండగా.. ఎదురుగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాన్వాయిని అడ్డుకున్నారు. గురువారం అనంతపురం రూరల్ పరిధిలోని శ్రీకంఠం సర్కిల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలోని ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో గురువారం నగరంలో కాలినడకన ర్యాలీ చేపట్టారు. వారికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాన్వాయ్ అడ్డురావడంతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి కారు దిగి అరగంట సేపు మంతనాలు జరిపినా వారు వినకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఏమీ చేయలేని పరిస్థితిలో.. మంత్రి అరమైలు దూరం కాలినడకన వెళ్లి అక్కడి నుంచి వేరే వాహనంలో వెళ్లిపోయారు. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి
చిత్తూరు జిల్లా మదనపల్లెలో మంత్రి రఘునాథ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. తిరుపతి ఉప ఎన్నిక నోటిఫికేషన్ సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లని ప్రలోభపెట్టేలా మంత్రి వరాల జల్లులు కురిపించారు. సంక్రాంతి సంబరాల పేరుతో ఇస్తున్న చంద్రన్న కానుకను తిరుపతికి మరింత ఎక్కువగా ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్నదాని కన్నాఅదనంగా రూ.కోటి పెంచనున్నట్టు మంత్రి మదనపల్లెలో తెలిపారు. -
ఘనంగా రంజాన్
అనంతపురం కల్చరల్ : జిల్లా వ్యాప్తంగా మంగళవారం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. మసీదులు, దర్గాలు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతపురం హౌసింగ్బోర్డులోనిఈద్గా మైదానం జనసంద్రమైంది. మైనార్టీ సంక్షేమ, సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ మదమంచి స్వరూప, వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరై.. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నగర ఖాజీ ఇమామ్ షరీఫ్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం దివ్య సందేశాన్నిచ్చారు. ముతవల్లి కె.ఎం.షఫీవుల్లా, వివిధ మసీదుల ఇమామ్‌లు రంజాన్ విశిష్టతను వివరించారు. హెచ్చెల్సీ కాలనీలోని బాహువుద్దీన్ మసీదు ప్రాంగణంలో గల ఈద్గా మైదానంలో పేష్ ఇమామ్ జమీరుల్ సందేశం వినిపించారు. పెద్దలు, గురువుల పట్ల వినయ విధేయతలు, మత సామరస్యం, సోదర భావం ప్రతి ముస్లిం అలవర్చుకోవాలని సూచించారు. రంజాన్ పర్వదినం దేశమంతటికీ సకల శుభాలు కలగజేయాలని ఆకాంక్షించారు. అనంతరం పక్కనే ఉన్న ఖబరస్థాన్‌లో సమాధుల వద్ద పెద్దల ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు. మత సామరస్యాన్ని చాటుతూ ఇచ్చిన విందుల్లో ముస్లింలతో పాటు పలువురు హిందువులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బహువుద్దీన్ మసీదు ముతవల్లి ఫరీదుద్దీన్, వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం నాయకులు మక్బుల్, సమీవుల్లా తదితరులు పాల్గొన్నారు. -
అ‘టెన్షన్’!
అధికార పార్టీనేతల నిర్వాకంకారణంగా రెండు పర్యాయాలువాయిదా పడిన జమ్మలమడుగుమున్సిపల్ ఛైర్మన్ ఎన్నికనుమూడోసారి నిర్వహించేందుకుఅధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ దఫానిర్వహిస్తున్న ఎన్నిక ఏమలుపు తిరుగుతుందోననిసర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జమ్మలమడుగు: జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఈ ఎన్నిక ఏక్షణాన ఏ మలుపు తిరుగుతుందోనని ప్రతి ఒక్కరూఆసక్తిగా గమనిస్తున్నారు. మే నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 9 స్థానాల్లో, టీడీపీ 11స్థానాల్లో విజయం సాధించింది. అయితే స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ ఓటునుఇక్కడే వినియోగించుకుంటుండటంతో రెండు పార్టీలకు సమానంగా 11 మంది సభ్యులున్నట్లయింది. దీంతో ఈనెల 3వతేదీన లాటరీ పద్ధతిలో ఛైర్మన్, వైస్ఛైర్మన్లను ఎన్నుకునేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.అనూహ్యంగా ఒకటో వార్డుకు చెందిన టీడీపీ కౌన్సిలర్ముల్లాజానీగైర్హాజరు కావడంతో టీడీపీ శ్రేణులుతమ కౌన్సిలర్‌ను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా ప్రిసైడింగ్ అధికారి ఎన్నిక 4వతేదీకి వాయిదావేశారు. అయితేకనిపించకుండా పోయిన కౌన్సిలర్ జానీ ప్రిసైడింగ్‌అధికారితో నేరుగా ఫోన్లో మాట్లాడి తనను ఎవరూకిడ్నాప్ చేయలేదని చెప్పారు. 4వతేదీ ఎన్నిక జరుగుతుందని అందరూ భావించారు. కోరం ఉన్నప్పటికీప్రిసైడింగ్ అధికారి తనకు ఆరోగ్యం సరిగా లేదని,తాను ఎన్నిక నిర్వహించలేనని చేతులు ఎత్తేయడంతోరెండో రోజుకూడా వాయిదాపడింది. దీంతో ఎన్నికల కమిషన్‌ఈనెల 13వతేదీన మున్సిపల్‌ై చెర్మన్, వైస్చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తామని ప్రకటించింది.అయితే ఒకటో వార్డుకు చెందిన కౌన్సిలర్‌ముల్లాజానీ ఓటును పరిగణలోనికి తీసుకోకూడదనిఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కోర్టును ఆశ్రయించారు.దీంతో కోర్టు జానీ ఓటును పరిగణలోనికి తీసుకోకూడదని తీర్పునిచ్చింది. అయితే శనివారం తిరిగి టీడీపీనాయకులు హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఈ తీర్పుపై స్టే విధించింది. ఒక వైపేమోప్రిసైడింగ్ అధికారి రామారావు తాము ముల్లా జానీఓటును పరిగణలోనికి తీసుకోమని చెప్పారు. తిరిగిఆ తీర్పుపై కోర్టు స్టే విధించడంతో అధికారులు ఏ విధంగానిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగామారింది.పకడ్బందీగా ఏర్పాట్లుఅధికార పార్టీ నేతలు, అధికారుల నిర్వాకంకారణంగా వాయిదా పడిన జమ్మలమడుగుమున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు ఆదివారం నిర్వహించనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈనెల 3వ తేదీన మున్సిపల్ ఛైర్మన్ , వైస్‌ఛైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ ప్రిసైడింగ్అధికారిగాఉన్న ఆర్డీఓ రఘునాథరెడ్డి చేతులెత్తేయడంతో వాయిదా పడ్డాయి. దీంతో ఎన్నికలకమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం తిరిగిమూడోసారి ఈ ఎన్నిక నిర్వహించనున్నారు.ప్రస్తుతం ప్రిసైడింగ్ అధికారిగా జిల్లాజాయింట్ కలెక్టర్ రామారావుతో పాటు,పరిశీలకునిగా ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్‌ను నియమించారు. వీరి పర్యవేక్షణలో పకడ్బందీగా ఎన్నిక నిర్వహించేందుకు కసరత్తుచేస్తున్నారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను రెండుసార్లు నిర్వహించిన సమయంలోనూ టీడీపీకిచెందిన నాయకులు, కార్యకర్తలు మున్సిపల్కార్యాలయంపై దాడి చేయడంతోపాటుపోలీసులపై రాళ్లు విసిరారు. ఈ సంఘటనలోకొంత మందికి గాయాలయ్యాయి. తిరిగిఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండామున్సిపల్ కార్యాలయం చుట్టూ బారికేడ్ల నిర్మాణంతో పాటు రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదలమధ్య ఉన్న రాళ్లను పొక్లెయిన్లతో తొలగించేకార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా కౌన్సిల్హాల్లో ఇరుపార్టీలకు చెందిన కౌన్సిలర్లు గొడవలకు దిగకుండా మధ్యలో టీడీపీ, వైఎస్సార్సీపీ, ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేక గ్యాలరీలనుఏర్పాటు చేశారు.జమ్మలమడుగులోనే ఎస్పీ, ఇన్చార్జి కలెక్టర్ఆదివారం జరిగే మున్సిపల్ ఛైర్మన్, వైస్ఛైర్మన్ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు ఇన్‌చార్జికలెక్టర్, ఎస్పీలు జమ్మలమడుగులో తిష్ట వేయనున్నారు. ఇప్పటికే రెండు సార్లు మున్సిపల్‌పాలక వర్గానికి సంబంధించిన ఎన్నికవాయిదా పడటంతో ఇకపై వాయిదా పడకుండా, ఎలాంటి గొడవలు జరగకుండాఉండేందుకు కలెక్టర్, ఎస్పీలు పట్టణంలోఉండి స్వయంగా ఎన్నికలు, శాంతిభద్రతలనుపర్యవేక్షించనున్నారు. -
చెప్పిందే చేయాలి
సాక్షి ప్రతినిధి, కడప: అనైతిక చర్యలైనా, నిబంధనలకు విరుద్ధమైనా తాము చెప్పిందే చేయాలనే తత్వాన్ని తెలుగుదేశాధీశులు వంటబట్టించుకుంటున్నారు. కంటికి రెప్పచాటుగా అధికారపార్టీకి అండగా ఉంటామంటే, కాదు కూడదు, బహిరంగంగా... ఏకపక్షంగా నిలిచినోళ్లే జిల్లాలో ఉండాలని కొత్త భాష్యం పలుకుతున్నారు. జిల్లాలో ప్రజాబలం లేకపోయినా అధికారం అండతో తెలుగుదేశం పార్టీకి అగ్రపీఠం వేయాలనే తలంపుతో వ్యవహరిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కడప సీఎంగా చెప్పుబడుతున్న వ్యక్తి అధికార దర్పం చూపెడుతున్నారు. జిల్లాలో జమ్మలమడుగు మున్సిపల్ ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ పూర్తి అప్రజాస్వామ్యకంగా వ్యవహరించింది, అందుకు అధికార యంత్రాంగం వంతపాడింది. చైర్మన్ ఎన్నికల్లో 50శాతం కోరం ఉంటే ఎన్నికలు నిర్వహించాలని నిబంధనలు వివరిస్తున్నాయి. ఒక సభ్యుడు గైర్హాజర్ అయిన కారణంగా చైర్మన్ ఎన్నికలను 3వతేదీన వాయిదా వేశారు. 4వతేదీ ఎటుతిరిగి ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు నమ్మబలికారు. అయితే ఎన్నికల సంఘం జమ్మలమడుగు మున్సిఫల్చైర్మన్ ఎన్నికను నిర్వహించాలని ఓవైపు ఆదేశిస్తున్నా, మరోవైపు జిల్లా యంత్రాంగం తెలుగుదేశం పార్టీకి పూర్తిగా సహకారం అందించింది. తెరపైకి జమ్మలమడుగు ఆర్డీఓ రఘునాథరెడ్డి కన్పించినా తెరవెనుక ఉన్నత స్థాయి యంత్రాంగం వ్యూహాత్మకంగా పావులు కదిపారు. రెండు రోజులపాటు హైడ్రామా నడిపి చైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అవకాశం లేకుండా చేసినందుకు తెలుగుతమ్ముళ్లు అధికార యంత్రాంగాన్ని మెచ్చుకున్నట్లు సమాచారం. జెడ్పీ చైర్మన్ టీడీపీకి దక్కకపోవడంతో.... జిల్లా పరిషత్‌లో వైఎస్సార్సీపీకి 39 మంది సభ్యుల బలం ఉంటే, తెలుగుదేశం పార్టీకి 11మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ జెడ్పీ పీఠం తమదేనని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రకటించుకున్నారు. ఏకంగా మీడియా సమావేశంలో ఆపార్టీ ఎంపీ రమేష్‌నాయుడు కోతలు కోశారు. జెడ్పీ చైర్మన్‌ను దక్కించుకోవాలనే తలంపు ఆయనలో మెండుగా ఉన్నట్లు సమాచారం. బహిరంగంగా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలతో మంతనాలు నిర్వహిస్తూ ప్రలోభాలకు గురిచేశారు. మరికొంత మందిపై బెదిరింపులకు దిగారు. ఎన్నియుక్తులు పన్నినప్పటికీ చైర్మన్ ఎన్నికల గడువు నాటికి తెలుగుదేశం పార్టీకి ఆశించిన మద్దతు దక్కలేదు. అధికారం అండతో చైర్మన్ ఎన్నికలే నిర్వహించకూడదని భావించినట్లు సమాచారం. ఆమేరకు కడప సీఎంగా చెప్పబడుతున్న ఓనాయకుడు జెడ్పీ చైర్మన్ ఎన్నికల్ని జమ్మలమడుగు తరహాలో వాయిదా వేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. జమ్మలమడుగు ఆర్డీఓ తరహాలో ఛైర్మన్ ఎన్నికలు నిర్వహించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి వాయిదా వేయాలని, వైఎస్సార్సీపీకి ఆపీఠం ఎలాంటి పరిస్థితుల్లో దక్కరాదని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. అప్పటికే 39 మంది వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు, కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి తోపాటు, 8మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి జెడ్పీ సమావేశ మందిరంలో ఉన్నారు. ఆపరిస్థితుల్లో ఎన్నిక వాయిదాకు గట్టిగా ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేమని తెలపడంతో తెలుగుతమ్ముళ్లుకు తీవ్ర ఆగ్రహాం తెప్పించినట్లు సమాచారం. ఆమేరకు సరిగ్గా మూడు రోజులకే జిల్లా కలెక్టర్ బదిలీ ఉత్తర్వులొచ్చాయి. అధికార దర్పానికి తలొగ్గి, అప్రజాస్వామ్యకంగా వ్యవహరించలేదన్న ఏకైక కారణంతోనే బదిలీ చేయించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జీ హుజూర్... అధికారుల కోసం.... కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ ద్వయం జిల్లా ప్రజానీకం మెప్పుపొందారు. సర్పంచ్ ఎన్నికలు మొదలుకొని, సార్వత్రిక ఎన్నికల వరకూ ఎలాంటి హింసాత్మక ఘటనలు తలెత్తకుండా ప్రశాంతంగా నిర్వహించారు. కడపజిల్లా అంటేనే ఎన్నికల్లో బాంబులు రాజ్యమేలుతాయన్న విమర్శకులనోర్లు మూయించారు. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుత ఓటింగ్‌కు ఆస్కారం కల్పించారు. జిల్లా టీం సమన్వయం కారణంగా ఎన్నికల్లో సమూల మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీకి ఏకపక్షంగా నిలవలేదనే కారణంగా జిల్లా కలెక్టర్‌కు బదిలీ బహుమానంగా ఇచ్చారు. జిల్లా ఉన్నతాధికారులు జీ..హుజూర్ అంటుంటే క్రింది స్థాయి అధికారులతో బెడద ఉండదనే తలంపుతో తెలుగుతమ్ముళ్లు ఉన్నట్లు సమాచారం. ఆమేరకు తర్వాత చూపు జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ పట్లే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుబాస్గా చెప్పింది తుచ తప్పకుండా చేసిపెట్టే అధికారి కోసం టీడీపీ నేతలు అన్వేషణ చేస్తున్నట్లు సమాచారం. సమర్థత కంటే అధికారపార్టీకి కాపలాగా ఉండే అధికారుల కోసం ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కడప సీఎంగా చెప్పుకుంటున్న నాయకుడు తనకు అనుకూలరైన అధికారుల వేటలో ఉన్నట్లు సమాచారం. -
హైడ్రామా
జమ్మలమడుగు: మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో జమ్మలమడుగులో రెండో రోజూ హైడ్రామా నడిచింది. రాత్రి 11 గంటల వరకు ఎన్నిక విషయంలో అధికారులు ఎటూ తేల్చలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చిన తరువాతే ఎన్నికను నిర్వహిస్తామని 11గంటల తరువాత ఆర్డీఓ ప్రకటించి వెళ్లిపోయారు. శుక్రవారమే ఎన్నికను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులు సూచించినా ప్రిసైడింగ్ అధికారి రఘునాథరెడ్డి తనకు ఆరోగ్యం సరిగా లేదంటూ డ్రామాకు తెరలేపారు. ఆయన ఆరోగ్యం సరిగానే ఉందంటూ వైద్యులు తేల్చిచెప్పారు. మరోవైపు రెండో రోజుకూడా తెలుగుతమ్ముళ్లు స్వైర విహారం చేశారు. రాళ్లు రువ్వడంతో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. దాదాపు గంటసేపు టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఒకటో వార్డు కౌన్సిలర్ అయిన తన కుమారుడు ముల్లా జానీ కిడ్నాప్ అయినట్లు ఆయన తల్లి నూర్జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన తర్వాతే చైర్మన్ ఎన్నికను నిర్వహిస్తామని ప్రిసైడింగ్ అధికారి రఘునాథరెడ్డి పేర్కొన్నారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో వైద్యం చేయించుకోవడానికి వెళ్లాలని ముండ్లజానీ ఆర్డీఓకు ఫ్యాక్స్ ద్వారా తెలిపారు. అంతేగాక గోవాలోని పనాజీ కోర్టుకు హాజరై తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వాంగ్మూలం ఇచ్చాడు. వివిధ టీవీ ఛానల్స్‌తో కూడా మాట్లాడారు. దీనిని అధారంగా చేసుకుని పోలీసులు నివేదిక తయారు చేసి ఆర్డీఓకు సమర్పించారు. దీనిపై ప్రిసైడింగ్ అధికారి సరైన నిర్ణయం తీసుకోలేదు. కోరం ఉన్నా ఎన్నికను వాయిదా వేయడం సరికాదని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కార్యాలయంలోనే ధర్నా నిర్వహించారు. తొలుత కౌన్సిల్ సమావేశానికి ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించిన ఆర్డీఓ జి.రఘునాథరెడ్డి హజరుకాగానే అధికారులు వచ్చిన కౌన్సిలర్, ఎమ్మెల్యే, ఎంపీలతో సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారు. వైఎస్సార్సీపీకి చెందిన వారు సంతకాలు చేసిన తర్వాత టీడీపీ సభ్యులతో సంతకాల కార్యక్రమం చేపట్టగా తాము దొంగ సంతకాలు చేయమని తమ కౌన్సిలర్ ముల్లా జానీ తమ ముందుకు వచ్చిన తర్వాతనే సమావేశాన్ని నిర్వహించాలని గొడవకు దిగారు. 20 వార్డు కౌన్సిలర్ అయిన నూర్జహాన్ కౌన్సిల్ సమావేశం హాలులోనికి కారం పోడిపొట్లం తెచ్చి ఎంపీ వైఎస్ ఆవినాష్రెడ్డిపై చల్లే ప్రయత్నం చేశారు. కారం పొడి ఎంపీ చొక్కా, టేబుల్‌పై పడింది. -
సాదాసీదా సమీక్ష
శుక్రవారం అనంతపురంలోని రెవెన్యూ భవన్లో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, చిత్రంలో పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు తదితరులు అనంతపురం కలెక్టరేట్ : జిల్లా అభివృద్ధిపై సమగ్ర సమీక్ష కాస్త సాదాసీదాగా ముగిసింది. మూడు అంశాలపై మూడున్నర గంటలపాటు చర్చించారు. మిగతా అంశాలను ప్రస్తావించలేదు. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినీబాలతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైన ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధికి పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతపురం, హిందూపురం ఎపీలు జేసీ దివాకర్‌రెడ్డి, నిమ్మలకిష్టప్ప గైర్హాజరయ్యారు. కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో శుక్రవారం జిల్లా అభివృద్ధిపై తొలిసారి సమీక్ష ఏర్పాటు చేశారు. తొలుత తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ పైప్‌లైన్ లీకేజీలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేశారు. అనంతరం కలెక్టర్ లోకేష్‌కుమార్ సమీక్ష ప్రారంభించారు. తాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యలపై చర్చించారు. విద్య, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తదితర పథకాలపై సమీక్ష జరపకుండానే ముగించేశారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యేలు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రభాకర్‌రావును నిలదీశారు. దీనిపై ఎస్ఈ వివరణ ఇస్తూ 1258 గ్రామాల్లో నీటి సమస్య ఉందన్నారు. ధర్మవరం, పెనుకొండ, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ నీటి సమస్య పరిష్కారానికి రూ. 160 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. తాగునీటి పథకాల కరెంట్ బిల్లులు రూ.109 కోట్ల మేర పేరుకుపోయాయని, వాటిని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని పరిష్కరించేందుకు చేపట్టిన చర్యలను వివరించాలని ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రసాదరెడ్డిని కోరారు. రెండేళ్లు కావస్తున్నా రైతులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడం లేదని నిలదీశారు. ట్రాన్స్ఫార్మర్ల సమస్య పరిష్కరించాలని సూచించారు. నాణ్యమైన విత్తనం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని జేడీకి సూచించారు. తీర్మానాలు గుంతకల్లును రైల్వే జోన్ చేయాలి తాగునీటి సమస్యకు నాన్ సీఆర్ఎఫ్ పండ్ కింద రూ. 8 కోట్లు కేటాయించాలి. రూ. 10 కోట్లతో రిజర్వు పండ్ ఉంచాలి. ఏదైనా నియోజకవర్గంలో తాగునీటి సమస్య వచ్చినప్పుడు వీటిని వినియోగించాలి. తాగునీటి పథకాలకు 24 గంటలు కరెంట్ సరఫరా చేయాలి చేతి పంపుల మర్మమ్మతుకు మెకానిక్‌లను నియమించాలి. రూ. 5 వేల కోట్ల తాగునీటి పథకాలన్నింటిపై విచారణ చేయాలి. జిల్లాకు 7,400 కిలోమీటర్ల విద్యుత్ వైర్, 7 వేల ట్రాన్స్ఫార్మర్లు, 65 వేల విద్యుత్ స్తంభాలు కేటాయించాలి. ‘అనంత’కు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 10 వేల కోట్లు కేటాయించాలి. రూ. 7,476 కోట్లతో ‘ప్రాజెక్టు అనంత’ అమలు చేయాలి జిల్లాలో ఐఐటీ, ఐటీఐఆర్, టెక్స్టైల్ పార్కు, సోలార్ ఎనర్జీ సంస్థలు ఏర్పాటు చేయాలి పీఏబీఆర్‌కు 10 టీఎంసీల నికర జలాలు కేటాయించాలి. ఎయిమ్స్, ఐఐటీ సంస్థలు ఏర్పాటు చేయాలి జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలి. గుంతకల్లును రైల్వే జోన్‌గా గుర్తించాలి. ‘ప్రాజెక్ట్ అనంత’ అమలుకు చర్యలు తీసుకోవాలి. ఐఐటీ, ఇతర జాతీయ సంస్థలు ఏర్పాటు చేసేలా తీర్మానంలో పెట్టాలి. -విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఉరవకొండ విద్యుత్ సరఫరా మెరుగు పరచాలి కదిరికి పార్నపల్లి నుంచి తాగునీరు రావాల్సి ఉంది. రెండు ప్రాంతాలకూ ఒకే లైన్ మీదుగా విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలి. కదిరిలో కొంతమంది రైతులు డీడీలు కట్టి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు కనెక్షన్ మంజూరు చేయలేదు. త్వరగా అందజేసేలా చర్యలు తీసుకోవాలి. - అత్తార్ చాంద్‌బాషా, ఎమ్మెల్యే, కదిరి ట్యాంకరు రవాణా చార్జీలు పెంచాలి పెనుకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసిన వారికి బిల్లులు చెల్లించలేదు. నీటి సరఫరా నిమిత్తం ట్రాక్టర్‌కు ఇస్తున్న రూ.350 నుంచి రూ.500 పెంచాలి. -బీకే పార్థసారథి, ఎమ్మెల్యే, పెనుకొండ చెరువులు నింపాలి జిల్లాలో భూగర్భ జాలాలు అభివృద్ధి చెందాలి. ఇక్కడి చెరువులు నింపిన తరువాతే కడప జిల్లాకు నీటిని వదలాలి. జిల్లా కోటా మేరకు పూర్తి స్ధాయిలో నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. -జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే, తాడిపత్రి చెరువులు నింపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి తాగునీటి సమస్య తీరాలంటే చెరువులను నీటితో నింపేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. శ్రీరామరెడ్డి తాగునీటి పథకంపై విచారణ జరిపించాలి. - వరదాపురం సూరి, ఎమ్మెల్యే, ధర్మవరం శింగనమల చెరువును గుర్తించాలి శింగనమల చెరువు ప్రాధాన్యతను గుర్తించండి. చెరువును నీటితో నింపేలా చర్యలు తీసుకోవాలి. - యామినీ బాల, ప్రభుత్వ విప్ ఇన్పుట్ సబ్సిడీ అందజేయాలి గత ఏడాది వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీ అందేలా చర్యలు తీసుకోవాలి. స్కూళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించాలి. - గేయానంద్, ఎమ్మెల్సీ అగళిలో నీటి సమస్య పరిష్కరించండి మడకశిర నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అగళిలో సమావేశానికి వెళ్లినప్పుడు ప్రజలు తాగునీటి సమస్యపై నిలదీశారు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ఉన్నా ప్రయోజనం లేదు. మొదట అగళిలో నీటి సమస్య పరిష్కరించండి. - ఈరన్న, ఎమ్మెల్యే, మడకశిర కాలువలు సరి చేయాలి హంద్రీనీవా నీరు సక్రమంగా అందడం లేదు. మరమ్మతులు చేపట్టి సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలి. - ప్రభాకర్‌చౌదరి, ఎమ్మెల్యే, అనంతపురం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలి రాయదుర్గంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అవకాశాలున్నాయి. టెక్స్టైల్ పార్క్, సోలార్ ఎనర్జీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. - మెట్టు గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ మోటార్లు కాలిపోతున్నాయి గుత్తి, గుంతకల్లు, వైటీ చెరువులలో తాగునీటి కొరత ఉంది. మోటార్లు కాలిపోతున్నాయి. తగిన చర్యలు తీసుకోవాలి. - జితేందర్‌గౌడ్, ఎమ్మెల్యే, గుంతకల్లు కరెంట్ బకాయిలు ప్రభుత్వమే చెల్లించాలి జిల్లాలో తాగునీటి పథకాల నిర్వహణ భారంగా ఉంది. రూ.109 కోట్ల కరెంటు బకాయిలు ప్రభుత్వమే చెల్లించేలా ప్రతిపాదన పంపాలి. - కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ చీఫ్ విప్ హంద్రీనీవా త్వరగా పూర్తి చేయాలి ‘అనంత’లో తాగునీటి సమస్య పరిష్కారానికి హంద్రీనీవా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకొచ్చి త్వరగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. - బాలకృష్ణ, ఎమ్మెల్యే, హిందూపురం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది జిల్లాలో అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్ ఉన్నా అధునాతన పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తీసుకొస్తాం. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించాలి. సమష్టిగా జిల్లా అభివృద్ధికి కలిసి రావాలి. -మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాలసునీత -
రైల్వే ఆదాయం పెంచేందుకు స్పెషల్ డ్రైవ్
ఆలంపల్లి, న్యూస్‌లైన్: రైళ్లలో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే చర్యలు తీసుకుంటామని రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రఘునాథ్‌రెడ్డి ప్రయాణికులను హెచ్చరించారు. సోమవారం వికారాబాద్ రైల్వేస్టేషన్లో తనిఖీలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిక్కెట్ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని తనిఖీలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్, చిత్తాపూర్, వాడీ, వికారాబాద్, పర్లి సెక్షన్ల పరిధిలో ప్రత్యేకంగా 44 మంది టీసీలు, పది మంది ఆర్పీఎఫ్ పోలీసులతో తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్లో తని ఖీలు కొనసాగుతున్నట్లు రఘునాథ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నుంచి తనిఖీలు చేస్తూ టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 144 మంది ప్రయాణికులపై కేసులు నమోదు చేసి రూ. 70 వేల జరిమానా వసూలు చేశామన్నా రు. రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించడం సరికదని ఆయన చెప్పారు. ప్రయాణికులంతా విధిగా టికెట్ తీసుకొని ప్రయాణించాలన్నారు. 10 టెటరింగ్ కేసులు(ఉమ్మివేత) నమోదు చేసి రూ. 2 వేల జరిమానా విధించినట్లు రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రఘునాథ్‌రెడ్డి చెప్పా రు. రైళ్లలో, రైల్వేస్టేషన్లలో గుట్కాలు, పాన్‌మసాలాలు ఉమ్మివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సీట్లపై ఆహారం, ఇతర ప దార్ధాలు వేసి అపరిశుభ్రం చేయడం తగదన్నారు. రైల్వే ఆదాయం పెం చేందుకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ స్టేషన్ మేనేజర్ మోహన్, తనిఖీ సిబ్బంది ఉన్నారు. -
రూ. 20 కోట్లు స్వాహా!
గిరిధర్ (పేరు మార్చాం) హిందూపురంలో సప్తగిరి డిగ్రీ కళాశాల (పల్లె రఘునాథరెడ్డికి చెందిన విద్యా సంస్థ)లో 2013-14 విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఇతడు మొదటి సంవత్సరంలో రూ.8 వేలు ఫీజు కళాశాలలో చెల్లించాడు. ద్వితీయ సంవత్సరంలో రూ.8 వేలు కట్టాడు. తృతీయ సంవత్సరంలో రూ.9 వేలు చెల్లించాడు. ఈ విద్యార్థికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద మూడేళ్లకు కలిసి రూ.27 వేలు మంజూరైంది. గిరిధర్ కట్టిన ఫీజు రూ.25 వేలు, రీయింబర్స్మెంట్ మొత్తం రూ.27 వేలు కలిపితే మొత్తం రూ.52 వేలు అవుతుంది. గిరిధర్‌కు ఈ మొత్తంలో కేవలం రూ.6 వేలు మాత్రమే వెనక్కు చెల్లించారు. ఇతడికి ఇంకా రూ.19 వేలు వెనక్కు రావాల్సి ఉంది. రేపు...మాపు అంటూ తిప్పుకుంటున్నారు తప్ప ఇంతవరకు చెల్లించలేదు. - ఇది జిల్లాలో పల్లె రఘునాథరెడ్డికి చెందిన విద్యా సంస్థల్లో విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం పడుతున్న అగచాట్లకో ఉదాహరణ. ఎస్కేయూ/అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : పల్లె రఘునాథరెడ్డి జిల్లాలో ఇంటర్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, బీఈడీ, డీఎడ్ కోర్సుల పేరుతో 26 కళాశాలలను స్థాపించారు. ఆ కళాశాలల్లో 7,457 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పేద విద్యార్థులకు అండగా ఉండేందుకు దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 2008 నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఎంతో మంది పేద విద్యార్థులు ఈ పథకం కింద ఉన్నత విద్యకు దగ్గరై ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కాగా కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఈ పథకాన్ని వరంగా మలుచుకున్నాయి. పభుత్వం నుంచి మంజూరైన నిధులను కాజేసి పేద విద్యార్థుల కడుపులు కొడుతున్నాయి. ఓవైపు విద్యార్థుల నుంచి ఫీజు కట్టించుకుని..రీయింబర్స్మెంట్ వచ్చిన తర్వాత వెనక్కు ఇస్తామని చెబుతూ చివరకు చేతులెత్తేస్తున్నాయి. కోర్సు పూర్తయిన విద్యార్థులు ఒకటి రెండుసార్లు కళాశాలకు వెళ్లి అడిగి తర్వాత మిన్నకుండి పోతున్నారు. గట్టిగా అడిగిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. ఈ విషయంలో పల్లె రఘునాథరెడ్డికి చెందిన విద్యా సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి. విద్యార్థుల నుంచి ప్రారంభంలోనే ట్యూషన్ ఫీజు రూపంలో డబ్బులు వసూలు చేసి, ఆ మొత్తాన్ని ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో ప్రభుత్వం నుంచి తిరిగి పొందిన తర్వాత విద్యార్థులకు అప్పగించాలి. ‘పల్లె’ విద్యా సంస్థల్లో ఈ పరిస్థితి కనిపించడం లేదు. విద్యార్థులతో కట్టించుకున్న మొత్తం చెల్లించడం లేదు. గట్టిగా అడిగిన విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 2009 నుంచి 2014 వరకు పల్లె రఘునాథ రెడ్డికి చెందిన అన్ని కళాశాలల్లోనూ సుమారు రూ.20 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ స్వాహా చేసినట్లు బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2008 నుంచే దోపిడీకి శ్రీకారం ప్రారంభ రోజుల్లోనే పథకానికి తూట్లు పొడిచేందుకు పథకం రచించారు. అందులో భాగంగా విద్యార్థులకు ఈ నిధులు చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసేసుకున్నారు. ఒక వైపు విద్యార్థులతో సన్నిహితంగా మెలుగుతూనే తన రాజకీయ జీవితానికి ఉన్నత బాటలు వేసుకున్న విద్యాసంస్థల అధినేత.. మరో వైపు దోపిడీకీ శ్రీకారం చుట్టారు. ఈ లావాదేవీల్లో తన పాత్ర లేనట్టుగా ప్రిన్సిపాళ్లను, అధ్యాపకులను అడ్డు పెట్టుకుని రూ.కోట్లు దండుకున్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని పసిగట్టినా.. వారు నోరు తెరిచి అడిగే పరిస్థితి లేదు. 2008-2009 విద్యా సంవత్సరం నుంచి 26 కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది వ్యక్తిగత ఖాతాలను పరిశీలిస్తే ఈ మొత్తం అవినీతి బాగోతం బయటపడే అవకాశం ఉందని బాధితులు చెబుతున్నారు. దోపిడీ పర్వం ఇలా విద్యార్థితో ఫీజు మొత్తాన్ని విద్యా సంవత్సరం ప్రారంభంలోనే కట్టించుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చినా విద్యార్థి ఖాతాలో నేరుగా జమ చేయకుండా చేతికి ఇస్తామని చెబుతారు. రెండోది విద్యార్థి ఫీజును ‘ఖాతా చెక్కు’ రూపంలో కాకుండా తద్భిన్నంగా ‘బేరర్ చెక్’ రూపంలో ఇచ్చి నగదును యాజమాన్యమే డ్రా చేసుకుంటోందని విద్యార్థులు చెబుతున్నారు. ఇవీ ‘పల్లె’ విద్యా సంస్థలు బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, బాలాజీ డీఎడ్ కళాశాల, పీఆర్ఆర్ మేనేజ్మెంట్ కళాశాల, పీవీకేకే డిగ్రీ, పీజీ కళాశాల, పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సప్తగిరి డిగ్రీ కళాశాల(హిందూపురం), సప్తగిరి జూనియర్‌కళాశాల (హిందూపురం), ఎస్బీసీఆర్ఎం జూనియర్కాలేజ్ (కదిరి), ఎస్డీఆర్ఆర్ డిగ్రీ కళాళాల (ముదిగుబ్బ), ఎస్డీఆర్ఆర్ జూనియర్ కళాశాల (ముదిగుబ్బ), శ్రీబాలాజీ పీజీ కళాశాల (అనంతపురం), శ్రీబీఆర్ఎస్ఆర్ జూనియర్ కాలేజీ (కదిరి), శ్రీ సాయి డిగ్రీ కళాశాల (గుత్తి), శ్రీసాయి జూనియర్‌కళాశాల (గుత్తి), శ్రీవివేకానంద డిగ్రీ, పీజీ కళాశాల (కదిరి), శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల (కళ్యాణదుర్గం), శ్రీనివాస డిగ్రీ, పీజీ కళాశాల (ధర్మవరం), స్వామి వివేకానంద డీఎడ్ కళాశాల (కళ్యాణదుర్గం), స్వామి వివేకానంద డిగ్రీ కళాశాల (కళ్యాణదుర్గం), స్వామి వివేకానంద బీఈడీ కళాశాల (కళ్యాణదుర్గం), వెంకటేశ్వర బీఈడీ కళాశాల (కదిరి), వెంకటేశ్వర డీఈడీ కళాశాల (కదిరి), శ్రీ బాలాజీ ఎంబీఏ కళాశాల (అనంతపురం), శ్రీ సత్యసాయి డీఈడీ కళాళాల (పెనుకొండ), శ్రీ సాయి డీఈడీ కళాశాల (గుత్తి). గోల్మాల్ జరగలేదు మా విద్యాసంస్థలకు సంబంధించి విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్సమెంట్ విషయంలో ఎటువంటి గోల్మాల్ జరగలే దు. ఒక వేళ జరిగినట్లు రుజువు చే స్తే నేను ఏ శిక్షకైనా సిద్ధమే. ప్రభుత్వం నుంచి విద్యార్థుల ఖాతాలకు చేరాల్సిన మొత్తం విద్యార్థులకే చేరుతుంది. కళాశాలకు చెందాల్సిన మొత్తం కళాశాలకే చెందుతుంది. ఇందులో గోల్మాల్ జరిగేందుకు అవకాశమే లేదు. రాజకీయ నాయకులు మీద ఆరోపణలు రావడం సహజమే. విద్యార్థుల సొమ్ము ను స్వాహా చేయాల్సిన అవసరం మాకు రాలేదు. - పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పుట్టపర్తి -
చిన్నారి గొంతు నులిమి దోపిడీ
రూ. లక్ష నగదు, 30 తులాల బంగారం అపహరణ... ఓటేసేందుకు వెళ్తే ఇల్లు దోచేశారు తల్లిదండ్రులు ఓటు వేసేందుకు వెళ్లగా.. ఇంట్లో ఉన్న పిల్లలను బెదిరించి రూ. లక్ష నగదుతోపాటు, 30 తులాల బంగారాన్ని దోచేశారు. స్థానిక శాంతినగర్ గౌరవ్ గార్డెన్స్ సమీపంలోని ఓ ఇంట్లో కాంట్రాక్టర్ రఘునాథరెడ్డి, సుజాత దంపతులు నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తమ పిల్లలు లహరి (12), జస్వంత్ (7)లను ఇంట్లో వదిలి, ఓటు వేసేందుకు సమీపంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. కొద్దిసేపటికి ఎవరో తలుపు తట్టడంతో వచ్చింది ఎవరంటూ లహరి ఆరా తీసింది. ‘ఏసీ రిపేర్ చేయడానికి వచ్చానని.. మమ్మీ, డాడీ ఓటు వేసేందుకు వెళుతూ ఎదురు వచ్చారని, తలుపులు తీయాలని అతను కోరాడు. దీంతో ఆ చిన్నారి తండ్రికి ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తూనే తలుపులు తీసి బయటకు వచ్చింది. బయటే వేచి ఉన్న అగంతకుడు అమె గొంతు పట్టుకుని నులుముతూ లోపలి గదిలోకి తీసుకెళ్లి బెదిరించడంతో, ఆమె తమ్ముడు జస్వంత్ బీరువా తాళాలు ఇచ్చేశాడు. బీరువా తెరిచి.. 30 తులాల బంగారు నగలు, రూ. లక్ష నగదు తీసుకుని దుండగుడు ఉడాయించాడు. ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు విషయం తెలుసుకుని సమాచారం అందించడంతో త్రీటౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంతకు ముందు ఎప్పుడూ అతడిని చూడలేదని చిన్నారి చెబుతోంది. -
స్వార్థమే జీవిత పరమార్థమా?
మోసం... దగా... చీటింగ్... హవాలా... హర్షద్‌మెహతా... కోలా కృష్ణమోహన్... తెలివిగా... చాకచక్యంగా... నేర్పుగా... నమ్మినవారిని నిలువునా నట్టేట ముంచటం... వచ్చిన ధనంతో దర్జాగా జీవించటం... ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ కనిపిస్తున్న సాంఘిక రుగ్మత. ఈ రుగ్మతలపై రఘునాథ్‌రెడ్డి తీసిన లఘుచిత్రమే ‘నౌ దో గ్యారహ్’. డెరైక్టర్స్ వాయిస్: మాది గుంటూరు. చిన్నప్పటి నుంచి నాకు కథలు చెప్పడ మంటే చాలా ఇష్టం. అదే నాకు ఈ రోజు లఘుచిత్రాలు తీయడానికి సహాయపడింది. మా నాన్నగారు గతంలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కావడం కూడా నాకు ప్లస్ అయ్యింది. నేను ప్రస్తుతం బెంగళూరులోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నౌ దో గ్యారహ్... నోరు ఉంటే రాజ్యం, నోటు ఉంటే సామ్రాజ్యం. ఇదీ స్థూలంగా కథాంశం. ఈ కాన్సెప్ట్ మీద కథ తయారుచేద్దామనుకున్నప్పుడు... రోజూ జరిగే మోసాల గురించి రాద్దామనుకున్నాను. అది కూడా వినోదాత్మకంగా తీయాలనుకున్నాను. ఈ ప్రాసెస్‌లో 1980లలో జరిగిన ల్యాండ్ స్కామ్ గురించి ఒక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్ నన్ను బాగా ప్రభావితం చేసింది. అలా క్యారెక్టర్స్, సీన్లు డెవలప్ చేశాను. సినిమా తీయడంలో అందరిలాగే నన్ను కూడా త్రివిక్రమ్ గారు ప్రభావితం చేశారు. మా టీమే నాకు పెద్ద ఆస్తి. యుకే లో ఉంటున్న యామని శృంగారం గారు మా సినిమాకి ఆర్థికంగా సహాయం చేశారు. ఈ చిత్రం షూటింగ్ నాలుగు రోజుల్లో పూర్తి చేశాం. ఒక రోజులో ప్యాచ్ వర్క్ పూర్తి చేశాం. పూర్తిగా హైదరాబాద్‌లోనే చేశాం. మా టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడింది. పెద్ద చిత్రాలు తీయాలనే నా కోరిక నెరవేర్చుకోవడం కోసం లఘుచిత్రాలు తీసి అనుభవం సంపాదించుకుంటున్నాను. నాతో పనిచేసేవారంతా ఎంతో హార్డ్‌వర్క్ చేస్తున్నారు. మా అందరికీ సినిమాలంటే ఒక ప్యాషన్ ఉండబట్టి లఘుచిత్రాలు బాగా తీయగలుగుతున్నాం. ఇంతకుముందు రోజుల్లా కాకుండా మా టాలెంట్ నిరూపించుకోవడానికి లఘుచిత్రాల నిర్మాణం ఎంతగానో ఉపయోగపడుతోంది. షార్ట్ స్టోరీ: తెల్లవారి లేచింది మొదలు ఎవరో ఒకరు అవతలివారిని మోసం చేస్తూనే ఉన్నారు. ఇందులో కొందరు యువత ఒక జట్టుగా ఏర్పడి మోసాలు చేస్తుంటారు. అలా మోసం చేసి ధనం సంపాదిస్తుంటారు. స్థూలంగా ఇదీ కథ. కామెంట్: టిఎంసి బ్యాన ర్ మీద తీసిన ఈ లఘుచిత్రం కథాకథనం చాలా బాగుంది. ముఖ్యంగా ఈ చిత్ర డెరైక్టర్ రఘునాథరెడ్డి లఘుచిత్రాన్ని ఫీచర్‌ఫిల్మ్ స్థాయిలో తీశారు. లొకేషన్లు చాలా బాగున్నాయి. నటీనటులలో ఒకరిద్దరు తప్ప మిగతావారంతా బాగా చేశారు. ముఖ్యంగా హీరోయిన్గా వేసిన అమ్మాయి డైలాగ్ డెలివరీలో పవర్ లేదు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది డైలాగులు. ‘ఇగోకి ఆత్మాభిమానం పేరు పెట్టుకుని తిరుగుతాడు’ ‘అమ్మడానికి అది నా సెంట్ పర్సెంట్ లవ్’ ‘దొంగతనం చేయాలంటే ఒక మనిషి జేబులో చెయ్యి పెడితే చాలు... మోసం చేయాలంటే అదే మనిషి నమ్మకాన్ని కొట్టేయాలి’ ‘యాక్టివ్‌గా అలర్ట్‌గా ఉంటాడు’ ‘మొరాలిటీ కన్న ప్రాక్టికాలిటీనే ప్రధానం’ ‘ప్రకృతిని క్యాష్ చేసుకుంటే బోలెడు ధనం’ ‘ప్రేక్షకుడికి ప్రొడ్యూసర్‌కి మధ్య బ్యారియర్లాగ’ ‘వెళ్లివస్తాను... సారీ... నేను వెళ్తాను మీరు రండి’ ‘నా పూర్వీకులు చాలా పూర్ అని విన్నాను’ ‘ఫ్రీగా ఎకరాలు ఇవ్వడానికి సలహా అనుకున్నావా’ వంటి చురుకైన పదునైన డైలాగులు... ఈ కథకు ప్రాణం పోశాయి. డెరైక్టర్‌గా రఘునాథ్ సక్సెస్ సాధించినట్లే. డైలాగులు, మ్యూజిక్, కెమెరా, ఎడిటింగ్... అన్నీ పక్కాగా ఉన్నాయి. యూట్యూబ్ ప్రేక్షకులకు ఇది నిజంగా ఒక కనువిందే. కేవలం వారం రోజులలోనే రెండు లక్షల మంది ఈ చిత్రాన్ని వీక్షించారు. - డా.వైజయంతి ‘ఇగోకి ఆత్మాభిమానం పేరు పెట్టుకుని తిరుగుతాడు’ ‘అమ్మడానికి అది నా సెంట్ పర్సెంట్ లవ్’ వంటి చురుకైన పదునైన డైలాగులు... ఈ కథకు ప్రాణం పోశాయి.