ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి
Published Tue, Jan 13 2015 3:24 PM | Last Updated on Mon, Mar 25 2019 3:03 PM
చిత్తూరు జిల్లా మదనపల్లెలో మంత్రి రఘునాథ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. తిరుపతి ఉప ఎన్నిక నోటిఫికేషన్ సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లని ప్రలోభపెట్టేలా మంత్రి వరాల జల్లులు కురిపించారు.
సంక్రాంతి సంబరాల పేరుతో ఇస్తున్న చంద్రన్న కానుకను తిరుపతికి మరింత ఎక్కువగా ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్నదాని కన్నాఅదనంగా రూ.కోటి పెంచనున్నట్టు మంత్రి మదనపల్లెలో తెలిపారు.
Advertisement
Advertisement