tirupathi bi election
-
తిరుపతి ఉప ఎన్నిక: బీజేపీ నకిలీ సాకులు
బీజేపీ నేతలు స్థానిక సమరంలో మట్టికరిచారు.. పురపోరులో ‘నోటా’తో పోటీ పడ్డారు.. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలోనూ ఘోర పరాభవం తప్పదనే ఆందోళనలో ఉన్నారు. ముందస్తుగా ఓటమికి సాకులు వెతుక్కునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో నకిలీ ఓటరు కార్డులు ఉన్నాయనే వింత వాదనను తెరపైకి తీసుకువచ్చారు. సాక్షి, తిరుపతి : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వింత వాదనను వినిపించారు. 2లక్షల నకిలీ ఓటరు కార్డులు ఉన్నాయని, వాటి సాయంతోనే వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిందని ఆరోపించారు. బుధవారం ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సైతం ఇదే వాదనను మళ్లీ వినిపించారు. దీనిపై పలువురు మేధావులు మాట్లాడుతూ బీజేపీ రాబోయే ఎన్నికల్లో పరాభవానికి సాకులు వెతుక్కుంటోందని అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో కనీస మాత్రపు పట్టుకూడా లేని బీజేపికి వైఎస్సార్సీపీతో పోటీపడే స్థాయి లేదని విశ్లేషిస్తున్నారు. ఎలాగైనా ఓట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచి అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునేందుకు తంటాలు పడుతున్నారని వెల్లడిస్తున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తరహాలోనే తిరుపతి ఉపపోరులో ఓట్లు వస్తే పరువు పోతుందని కొత్త ఎత్తులు వేస్తున్నారని వివరిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నకిలీ ఓటరు కార్డులపై వ్యాఖ్యానించడం అర్థరహితమని తెలియజేస్తున్నారు. రాబోయే ఓటమికి కారణాలు అన్వేషించుకునేందుకే ఇలాంటి ప్రకటనలు గుప్పిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. చదవండి: హోదా వద్దు అన్నది చంద్రబాబే -
ఆ ఎన్నికతో ఎవరేంటో తేలిపోతుంది
సాక్షి, అమరావతి : తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దమ్ముంటే తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకోవాలని, తిరుపతిలో ఓడిపోతే చంద్రబాబు రాజకీయ సన్యాసానికి సిద్ధపడాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. తిరుపతిలో రెండో స్థానమో.. మూడో స్థానమో తేల్చుకోవాలని, ఆ ఉప ఎన్నికతో ఎవరేంటో తేలిపోతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రెఫరెండంపై ఆయన శుక్రవారం స్పందించారు. (ఇదేమి నీచ రాజకీయం! ) మంత్రి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు రాజకీయాల్లో నుంచి తప్పుకుంటే ప్రజలు సంతోషిస్తారు. ఆయనకు సొంత జిల్లాలో జరిగే ఉప ఎన్నికలో గెలిచే పరిస్థితి లేదు. మూడు రాజధానులు మా ప్రభుత్వ విధానం. బాబు మోసం ఏంటో ప్రజలకు ఎప్పుడో తెలిసింది. గత ఎన్నికల్లో 51 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైపు తీర్పు ఇచ్చారు. ఇంతకంటే రెఫరెండం ఏముంటుంద’’ని అన్నారు. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి
చిత్తూరు జిల్లా మదనపల్లెలో మంత్రి రఘునాథ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. తిరుపతి ఉప ఎన్నిక నోటిఫికేషన్ సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లని ప్రలోభపెట్టేలా మంత్రి వరాల జల్లులు కురిపించారు. సంక్రాంతి సంబరాల పేరుతో ఇస్తున్న చంద్రన్న కానుకను తిరుపతికి మరింత ఎక్కువగా ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్నదాని కన్నాఅదనంగా రూ.కోటి పెంచనున్నట్టు మంత్రి మదనపల్లెలో తెలిపారు.