
సాక్షి, అమరావతి : తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దమ్ముంటే తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకోవాలని, తిరుపతిలో ఓడిపోతే చంద్రబాబు రాజకీయ సన్యాసానికి సిద్ధపడాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. తిరుపతిలో రెండో స్థానమో.. మూడో స్థానమో తేల్చుకోవాలని, ఆ ఉప ఎన్నికతో ఎవరేంటో తేలిపోతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రెఫరెండంపై ఆయన శుక్రవారం స్పందించారు. (ఇదేమి నీచ రాజకీయం! )
మంత్రి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు రాజకీయాల్లో నుంచి తప్పుకుంటే ప్రజలు సంతోషిస్తారు. ఆయనకు సొంత జిల్లాలో జరిగే ఉప ఎన్నికలో గెలిచే పరిస్థితి లేదు. మూడు రాజధానులు మా ప్రభుత్వ విధానం. బాబు మోసం ఏంటో ప్రజలకు ఎప్పుడో తెలిసింది. గత ఎన్నికల్లో 51 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైపు తీర్పు ఇచ్చారు. ఇంతకంటే రెఫరెండం ఏముంటుంద’’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment