
హైదరాబాద్, సాక్షి: కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నవాళ్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఆలస్యం చేయకుండా కార్డులను వెంటనే జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అధికారులను ఆదేశాలు జారీ చేశారు.
సోమవారం తెలంగాణ కొత్త రేషన్ కార్డులకు(Telangana New Ration Cards) సంబంధించి పలు డిజైన్లను సీఎం రేవంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా.. కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారాయన. అయితే.. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్(Election Code) అమలు ఉంది. అందుకే కార్డుల జారీ నిలిచిపోయింది. అయితే.. కోడ్ అమలు లేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారాయన. అలాగే..
అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని సీఎం రేవంత్ మరోసారి అధికారులకు స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు.. మళ్లీ మళ్లీ దరఖాస్తులు(Ration Card Apply) చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా అవగాహన కల్పించాలని సూచించారాయన.