Telangana CMs
-
కొత్త రేషన్‌కార్డుల జారీ ఆపోద్దు: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నవాళ్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఆలస్యం చేయకుండా కార్డులను వెంటనే జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అధికారులను ఆదేశాలు జారీ చేశారు.సోమవారం తెలంగాణ కొత్త రేషన్ కార్డులకు(Telangana New Ration Cards) సంబంధించి పలు డిజైన్లను సీఎం రేవంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా.. కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారాయన. అయితే.. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్(Election Code) అమలు ఉంది. అందుకే కార్డుల జారీ నిలిచిపోయింది. అయితే.. కోడ్ అమలు లేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారాయన. అలాగే..అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని సీఎం రేవంత్ మరోసారి అధికారులకు స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు.. మళ్లీ మళ్లీ దరఖాస్తులు(Ration Card Apply) చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా అవగాహన కల్పించాలని సూచించారాయన. -
వైజాగ్ ఎయిర్ పోర్ట్, షార్లను పేల్చేస్తాం..
- టార్గెట్ లో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులూ - వైజాగ్ ఎయిర్ పోర్టుకు దుండగుల బెదిరింపు లేఖ.. నిర్ధారించిన సీపీ అమిత్ గార్గ్ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను టార్గెట్ చేసుకున్నామని, విశాఖపట్టణం ఎయిర్ పోర్టుతోపాటు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరీక్ష కేంద్రాన్నీ పేల్చేస్తామని గుర్తుతెలియని దుండగులు బెదిరింపు లేఖలు పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా సంస్థల వద్ద అదనపు బలగాలను మోహరించారు. అంతేకాక, ఇతర ముఖ్య కార్యాలయాల దగ్గరా భద్రతను పెంచారు. ఈ కలకలానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని విశాఖపట్టణం ఎయిర్ పోర్టుకు కొద్ది రోజుల కిందట ఒక ఉత్తరం వచ్చింది. అందులో సీఎంలను టార్గెట్ చేశామనడం, ఎయిర్ పోర్టు, షార్ లను పేల్చేస్తామంటూ తెలుగులో రాసుంది. ఎయిర్ పోర్టు అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు లేఖ వచ్చింది వాస్తవమేనని, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో ఈ లెటర్ పోస్ట్ అయినట్లు గుర్తించామని విశాఖ పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. -
ఇద్దరు సీఎంలూ దోషులే: ఉత్తమ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పార్టీ ఫిరాయింపులకు ఆధ్యులు ఆంధ్ర, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో గురువారం ఏర్పా టు చేసిన ఎమ్మెల్సీ ఆకుల లలిత సన్మానసభలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. అంతకు ముందు కామారెడ్డి, నిజామాబాద్‌ల్లో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఏడాది పాల నపై జనం అసంతృప్తితో ఉన్నారన్నారు. ఓటుకు నోటు కేసులో చిక్కిన చంద్రబాబు, రేవంత్‌తోపాటు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్‌ను కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాబే ముద్దాయి: వీహెచ్ నోటుకు కోట్లు కేసులో చంద్రబాబే అసలు ముద్దాయని రాజసభ సభ్యుడు వి.హన్మంతరావు అన్నా రు. టేపులో గొంతు తనదికాదని అంటున్న చం ద్రబాబు ఢిల్లీలో పైరవీలు ఎందుకు చేస్తున్నా రని ప్రశ్నించారు. లలితను ఆశీర్వదించే సభకు డి.ఎస్. హాజరు కాకపోవడం మంచిది కాదన్నారు.