వైజాగ్ ఎయిర్ పోర్ట్, షార్లను పేల్చేస్తాం.. | threath letter to vizag airport | Sakshi
Sakshi News home page

వైజాగ్ ఎయిర్ పోర్ట్, షార్లను పేల్చేస్తాం..

Oct 12 2015 7:56 PM | Updated on Aug 28 2018 7:24 PM

వైజాగ్ ఎయిర్ పోర్ట్, షార్లను పేల్చేస్తాం.. - Sakshi

వైజాగ్ ఎయిర్ పోర్ట్, షార్లను పేల్చేస్తాం..

తెలుగు రాష్ట్రాల సీఎంలను టార్గెట్ చేసుకున్నామని, వైజాగ్ ఎయిర్ పోర్టు, షార్ అంతరీక్ష కేంద్రాన్నీ పేల్చేస్తామని గుర్తుతెలియని దుండగులు బెదిరింపు లేఖలు పంపారు.

- టార్గెట్ లో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులూ
- వైజాగ్ ఎయిర్ పోర్టుకు దుండగుల బెదిరింపు లేఖ.. నిర్ధారించిన సీపీ అమిత్ గార్గ్

హైదరాబాద్:
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను టార్గెట్ చేసుకున్నామని, విశాఖపట్టణం ఎయిర్ పోర్టుతోపాటు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరీక్ష కేంద్రాన్నీ పేల్చేస్తామని గుర్తుతెలియని దుండగులు బెదిరింపు లేఖలు పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా సంస్థల వద్ద అదనపు బలగాలను మోహరించారు. అంతేకాక, ఇతర ముఖ్య కార్యాలయాల దగ్గరా భద్రతను పెంచారు. ఈ కలకలానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని విశాఖపట్టణం ఎయిర్ పోర్టుకు కొద్ది రోజుల కిందట ఒక ఉత్తరం వచ్చింది. అందులో సీఎంలను టార్గెట్ చేశామనడం, ఎయిర్ పోర్టు, షార్ లను పేల్చేస్తామంటూ తెలుగులో రాసుంది. ఎయిర్ పోర్టు అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు లేఖ వచ్చింది వాస్తవమేనని, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో ఈ లెటర్ పోస్ట్ అయినట్లు గుర్తించామని విశాఖ పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement